ఒంగోలు

వికీపీడియా నుండి
(Ongole నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
  ?ఒంగోలు
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
ఒంగోలు రైల్వే స్టేషను
ఒంగోలు రైల్వే స్టేషను
అక్షాంశరేఖాంశాలు: 15°30′N 80°03′E / 15.5°N 80.05°E / 15.5; 80.05
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 25.00 కి.మీ² (10 చ.మై)[1]
జిల్లా(లు) ప్రకాశం జిల్లా
జనాభా
జనసాంద్రత
2,04,746[2] (2011 నాటికి)
• 8,190/కి.మీ² (21,212/చ.మై)
భాష(లు) తెలుగు
పురపాలక సంఘం ఒంగోలు నగర పాలక సంస్థ
వెబ్‌సైటు: http://ongolemunicipalcorporation.org/OngoleAbt.aspx


ఒంగోలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లా యొక్క ముఖ్య పట్టణము మరియు ఒంగోలు మండలానికి కేంద్రము.[1]

చరిత్ర[మార్చు]

ఒంగోలు సమీపంలోని చినగంజాంలో దొరికిన ఆధారాలను అనుసరించి మౌర్య, శాతవాహనుల పాలన కాలంలోనే ఈ పట్టణం రూపుదిద్దుకున్నట్లు ఋజువౌతుంది. శాతవాహనుల తరువాత కాకతీయుల పాలనలో ఈ పట్టణం వెలుగులోకి వచ్చింది. ఆ సమయలో మోటుపల్లి మరియు వాడరేవు ప్రసిద్ధ రేవు పట్టణాలుగా ఉన్నాయి. రెడ్డి రాజులు మొదట ఒంగోలు సమీపములోని అద్దంకిని రాజధానిగా పాలించారు. వంగవోలు రాజులు పరిపాలించారు కాబట్టి ఈ ప్రాంతానికి వంగవోలు అనే పేరు వచ్చింది . కాలక్రమేణా వంగవోలు పేరు ఒంగోలుగా స్థిరపడి పోయింది కడప నవాబుల పాలనలో ఉన్న ఒంగోలు పట్టణాన్ని కర్ణాటక నవాబు హైదర్ అలీకి దత్తం చేయబడింది. 1801లో టిప్పూ సుల్తాన్ వద్ద నుండి బ్రిటీషు పాలనలోకి వచ్చింది.[3] ఒంగోలు పట్టణాన్ని మునిసిపాలిటీగా 1876లో వ్యవస్థీకరించారు.[4] ఆంధ్ర కేసరిగా సుప్రసిద్ధులైన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి బాల్యం ఒంగోలులోనే గడిచింది.

పేరు వెనుక చరిత్ర[మార్చు]

పూర్వము దీని పేరు వంగవోలు.

జనాభా వివరాలు[మార్చు]

2011 జనాభా ప్రకారం, 204,746. ఇందులో 102,835 మగవారు మరియు 101,911 ఆడవారు ఉన్నారు.[2] 19,744 మంది 0–6 వయసు లోపు వారు ఉన్నారు. ఇందులో 10,228 అబ్బాయిలు మరియు 9,516 అమ్మయిలు. ఈ నగరంలో 83.04% అక్షరాస్యతతొ 153,628 మంది అక్షరాస్యులు ఉన్నారు.[2]

పౌర పరిపాలన[మార్చు]

ఒంగోలు పురపాలక సంస్థ 1876లొ స్థాపించారు. దీని ప్రస్తుత అధికార పరిది 25.00 kమీ2 (9.65 sq mi). ఎస్.వెంకట కృష్ణా ప్రస్తుత పురపాలక సంస్థ కమీషనర్.[5]

రవాణా సౌకర్యం[మార్చు]

రహదారి మార్గము[మార్చు]

ఒంగోలు వద్ద జాతీయ రహదారి 5
ఒంగోలు రైలు స్టేషను

జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 216 నగరంగుడా వెళ్ళె జాతీయ రహదార్లు. ఒంగోలు బస్ స్టేషన్ నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు నడుపుతుంది.[6][7]

రైల్వేలు[మార్చు]

ఒంగోలు రైల్వే స్టేషను హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము పై ఉంది. ఇది విజయవాడ రైల్వే డివిజను లోని దక్షిణ మధ్య రైల్వే జోన్కు చెనందిన A-గ్రేడ్ రైల్వే స్టేషను.[8]

విమానాశ్రయ[మార్చు]

ఒక కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఫిబ్రవరి 2014లొ ఆమోదించారు.[9]

విద్యా సౌకర్యాలు[మార్చు]

రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్,[10]

క్యు.ఐ.ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ,[11]

ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ,[12]

దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల.

పి.వి,ఆర్ బాలికల ఉన్నత పాఠశాల.

సెయింట్ థెరెస్సా ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల స్వర్ణోత్సవాలు 2017,ఫిబ్రవరి-18న ఘనంగా నిర్వహించారు. [15]

లూయీస్ బ్రెయిలీ అంధుల పాఠశాల:- భాగ్యనగర్ 1వ లైన్‌లో ఏర్పాటుచేసిన ఈ పాఠశాలను, 2017,ఫిబ్రవరి-28న ప్రారంభించారు. [16]

వేదపాఠశాల[మార్చు]

భరద్వాజ మహర్షి వేద విద్యా మండలి (అలూరి సీతారామమ్మ-రామకోటేశ్వరరావు పాఠశాల)[మార్చు]

ఈ పాఠశాల ఒంగోలులోని మంగమూరు రహదారిపై ఉంది. ఈ పాఠశాలను 1997,నవంబరు-17న ప్రారంభించారు. ఈ పాఠశాల ఉచితంగా వేదవిద్యను బోధించుచూ, సంస్కృతీ పరిరక్షణలో పునీతమగుచున్నది. ప్రస్తుతం ఈ పాఠశాలకు ఒక మూడంస్థుల భవనం ఉంది. ఇప్పటి వరకు ఈ పాఠశాలలో 250 మంది పండితులు వేదాధ్యయనం పూర్తి చేసుకున్నారు. శ్రీకృష్ణ యజుర్వేదం, స్మార్తం ఇక్కడ బోధించుచుండగా, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కాశీ మొదలగు ప్రాంతాలనుండి విద్యార్థులు ఇచ్చటికి వచ్చి వేదవిద్యను అభ్యసించుచున్నారు. [18]

ప్రముఖులు[మార్చు]

ఒంగోలు పట్టణములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

సమావేశ మందిరం, ఒంగోలు

ఆశ్రమములు[మార్చు]

 1. సమతా మహిళా వృద్ధాశ్రమం:- ఈ ఆశ్రమం స్థానిక సీతారాంపురంలో ఉంది.
 2. ఉషోదయా వృద్ధాశ్రమం:- ఈ ఆశ్రమం స్థానిక బలరాం కాలనీలో ఉంది.

వైద్య సౌకర్యం[మార్చు]

ఆత్రేయ ఆయుర్వేద ఆసుపత్రి:- ఈ ఆసుపత్రి స్థానిక రాజా పానగల్ రహదారిపై ఉంది.

ఒంగోలు పట్టణములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

 1. శివాలయం - విష్ణాలయం.
 2. శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం, కేశవస్వామిపేట.
 3. శ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారి ఆలయం:- కమ్మపాలెం - దశరాజుపల్లె రహదారిపైన, అప్పాయిగుంట సమీపంలోని ఈ ఆలయ ప్రథమ ప్రతిష్ఠా మహోత్సవం, 2016,మే-20వ తేదీ శుక్రవారంనాడుℳ మరియు 21వ తెదీ శనివారం (వైశాఖ శుద్ధపౌర్ణమి) నాడు, వైభవంగా నిర్వహించెదరు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మంగళవాయిద్యాలు, వేదపఠనం, రాత్రి 8 గంటలకు హనుమత్ హోమం, శనివారం ఉదయం 8 గంటలకు సహస్రనామ సహిత తమలపాకుల పూజ, 9 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించెదరు. [14]
 4. శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం, గద్దలగుంట.
 5. శ్రీ చిట్టి ఆంజనేయస్వామివారి ఆలయం:- రైతుబజారు కూడలిలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయ ప్రారంభోత్సవం మరియు విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రంఆలు, 2015,మార్చ్-27, శుక్రవారం నుండి, 29వ తేదీ ఆదివారం వరకు నిర్వహించెదరు. 50 సంవత్సరాల క్రితం, స్థానిక అశ్వత్ఠ వృక్షం క్రింద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సదరు ప్రదేశాన్ని నూతన మందిరంగా తీర్చి దిద్ది, ధార్మిక కార్యక్రమాలకు కేటాయించారు. [5]
 6. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం:- కొత్తపట్నం బస్సుస్టాండు కూడలిలోని ఈ ఆలయంలో, అమ్మవారి త్రయోదశ వార్షిక మహాకుంభాభిషేక మహోత్సవాలు, 2015,జూన్-21వ తేదీ ఆదివారం నుండి, 23వ తేదీ మంగళవారం వరకు వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రామాలలో భాగంగా, 23వ తేదీ మంగళవారంనాడు, శిఖర, కలశ కుంభాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో ఉదయం నుండి విశేషహోమాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను దివ్యంగా అలంకరించి, శాంతికళ్యాణం, గ్రామోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. [6]
 7. శ్రీ లలితాశ్రమం, కేశవస్వామిపేట.
 8. శ్రీ పంచముఖ గాయత్రీదేవి ఆలయం, మంగమూరు రహదారి.
 9. శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం:- 15వ శతాబ్దానికి చెందిన ఒంగోలు రాజు శ్రీ మందపాటి రామచంద్రరాజు, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ ఆలయ నిర్మాణం జరిపించారు. ఆయన తన గుర్తుగా, ఈ ఆలయానికి ఒక ఖడ్గాన్ని బహూకరించారు, ఆ ఖడ్గం ఇప్పటికీ ఆలయంలో చెక్కుచెదరకుండా భద్రంగా ఉంది. [7]
 10. భగవాన్ మురళీకృష్ణ మందిరము. మంగమూరు రహదారి, ఐశ్వర్యనగర్.
 11. రాధాగోవిందజీ సత్సంగ మందిరం:- ఈ మందిరం స్థానిక మంగమూరు రహదారిలో, మర్రిచెట్లకాలనీ సమీపంలో ఉంది.
 12. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయం:- కొత్తపట్నం బస్ స్టాండ్ రోడ్డులో ఉన్న ఈ ఆలయం జీర్ణోద్ధరణ పనులకు, 2017,ఆగస్టు-12వతేదీ ఉదయం 9 గంటలకు శంకుస్థాపన నిర్వహించెదరు. [20]
 13. శ్రీ అనంత కోదండ రామస్వామివారి ఆలయం:- గాంధీ రోడ్డులో ఉన్న ఈ ఆలయంలో శ్రీ గోదా రంగనాయకస్వామివారల ఉత్సవమూర్తుల సంప్రోక్షణ కార్యక్రమం, 2015,డిసెంబరు-4,5.6 తేదీలలో (కార్తీకమాసంలో) వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పంచామృత స్నపన, తిరుమంజనం, గోదర్శనం, యఙ పూర్ణాహుతి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. [10]
 14. శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయం:- ఈ ఆలయం రైల్వే గేటు అవతల ప్రక్కన ఉన్న బాలాజీనగర్ లో ఉంది. ఈ ఆలయ ఆవరణలో, 2015,డిసెంబరు-11వ తేదీ శుక్రవారంనాడు, లోకకళ్యాణార్ధం, అశ్వద్ధనారాయణ కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. [11]
 15. శ్రీ సీతారామాలయం:- ఈ ఆలయం, ఒంగోలు పట్టణంలోని చేజెర్ల లక్ష్మణాచారి వీధిలో ఉంది.
 16. శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- గుర్రంవారి వీధిలోని ఈ ఆలయంలో 2017,మార్చ్-9 నుండి 17 వరకు వార్షిక బ్రహ్మోత్సాలు నిర్వహించెదరు. 15వతేదీ బుధవారంనాడు స్వామివారి కళ్యాణం మరియు రథోత్సవం నిర్వహించెదరు. [17]
 17. మామిడి పాలెం కొండమీద రాముల వారి ఆలయం.
 18. శ్రీగిరి వేంకటేశ్వరాలయం.
 19. శ్రీ వల్లూరమ్మ అమ్మవారి ఆలయం.
 20. శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం, (సంత పేట):- ఈ ఆలయంలో ఉపాలయంగా ఉన్న శివాలయంలో 2016,ఫిబ్రవరి-19వ తేదీ శుక్రవారంనాడు నూతనంగా ప్రతిష్ఠించనున్న ధ్వజస్తంభానికి, 18వ తేదీ గురువారంనాడు నగరోత్సవం నిర్వహించారు. [13]
 21. శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం, (రింగు రోడ్డు).
 22. శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం, (లాయరుపేట).
 23. పావులూరు శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామివారి ఆలయం (ఫోన్ నం. 9701832811):- ఒంగోలు పట్టణంలోని మంగమూరు రహదారిపై, మర్రిచెట్టు కాలనీలోని ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలు, 2017,ఆగస్టు-8 నుండి 10 వరకు వైభవంగా నిర్వహించెదరు. 8వతేదీ మంగళవారం ఉదయం అష్టోత్తర శతకలశాభిషేకం, 9వతేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం, 10వతేదీ గురువారం ఉదయం 8 గంటలకు ధ్వజస్తంభమునకు మహా సంప్రోక్షణ కుంభాభిషేకం నిర్వహించెదరు. అనంతరం మద్యాహ్నం 12 గంటలకు భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించెదరు. [19]
 24. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక ట్రంకు రోడ్డుపై ఉంది.
 25. శ్రీ గురు రాఘవేంద్ర మూల మృత్తికా బృందావనం:- స్థానిక సంతపేటలో ఉన్న ఈ క్షేత్రంలో, 2015,ఆగస్టు-30వ తేదీనుండి మూడురోజులపాటు శ్రీ రాఘవేంద్రస్వామివారి 344వ ఆరాధనా మహోత్సవాలు నిర్వహించారు. [8]
 26. శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం:- స్థానిక కర్నూలు రహదారిమీద ఉన్న ఈ ఆలయ వార్షికోత్సవం, 2016,ఫిబ్రవరి-14వ తేదీ ఆదివారం, రథసప్తమి నాడు కన్నులపండువగా నిర్వహీంచారు. మొదట ఆలయప్రాంగణంలోని మహాగణపతి, తదితర విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమ్మల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా సాగినది. [12]
 27. శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయం నెల్లూరు బస్సు స్టాండ్ కూడలిలో ఉంది.
 28. భగవాన్ గొలగమూడి వెంకయ్యస్వామి మందిరం, సంతపేట:- ఈ ఆలయంలో స్వామివారి ఆరాధన మహోత్సవాలు, 2017,ఆగస్టు-22వతేదీ మంగళవారం నుండి 24వతేదీ గురువారం వరకు వైభవంగా నిర్వహించెదరు. [21]
సాయిబాబ మందిరం, ఒంగోలు

పండుగలు[మార్చు]

ప్రతి దీపావళికి ముందు నరకాసుర వధ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. పట్టణంలో ఈ సాంప్రదాయం 1902 నుంచి కొనసాగుతుండటం విశేషం. నరక చతుర్దశి రోజు అర్ధరాత్రి ఈ ప్రదర్శన మొదలై తెల్లవారు జామున నాలుగు గంటలకు ముగుస్తుంది. ఒంగోలుకే చెందిన శ్రీయువజన మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరుగుతాయి. పట్టణంలోని తూర్పుపాలెం నివాసి సింగరాజు సుబ్బయ్య నేతృత్వంలో ఈ కార్యక్రమం మొట్టమొదటి సారిగా ప్రారంభమైంది.[13]

ఆర్ధిక వ్యవస్థ[మార్చు]

ప్రధాన పంటలు[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్లో వర్జీనియా రకం పొగాకు పంటకు ఒంగోలు ఒక ప్రధాన ఉత్పత్తి, వాణిజ్య కేంద్రము. గ్రానైటు గనులకు ప్రసిద్ధి చెందినది.

ప్రధాన వృత్తులు[మార్చు]

ఒంగోలు గిత్త

ఒంగోలులోని పెద్ద వ్యాపార సంస్థలు రైతుకుటుంబాలచే స్థాపించబడ్డాయి. పొగాకు కంపెనీలు, పంట, వ్యాపారం బాగా జరుగుతూ వచ్చింది. 1970, 80 దశాబ్దాలలో షూ, పెయింట్, మందులకంపెనీ, పివిసి మొదలైన పరిశ్రమలు ప్రారంభించబడ్డాయి. కానీ వీటిలో చాలావరకు ఆంధ్ర ప్రదేశ్ లోపల వెలుపల ప్రాతాలలోని పోటీకి నిలిచి మనుగడ సాగించడంలో విఫలమయ్యాయి. మానవశక్తి, పెట్టుబడులు మరియు విజయవంతంగా నడపటానికి కావలసిన నాయకత్వం కొరతే దీనికి కారణం. ఎనభై (80), తొభైయవ (90)దశాబ్దంలో నూతన సెకండరీ, ఇంటర్మీడియట్ కళాశాలలు, ఆసుపత్రుల స్థాపనలు అధికమైనాయి. ఒంగోలు విద్యాపరంగా అభివృద్ధిలో ఉన్న ప్రదేశం. ఎనభైయ్యవ (80) దశకంలో ఒంగోలు పశ్చిమ దిశలో గ్రానైట్ నిక్షేపాలు వెలుగు చూడటంతో వ్యాపార పరంగా సరికొత్త అధ్యాయం మొదలైంది.

ఒంగోలు పట్టణ విశేషాలు[మార్చు]

ఒంగోలుజాతి ఎద్దులు ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఎద్దులు. ప్రఖ్యాతిచెందిన జేబూ (Zebu)జాతి ఎద్దులలో ఇవి ఒకటి.

సంస్కృతి[మార్చు]

నాటక మరియు చలనచిత్ర రంగము[మార్చు]

ప్రతీ యేడు ఇక్కడ ఎన్.టి.ఆర్ కళా పరిషత్, ఒంగోలు ఆధ్వర్యంలో జరిగే నాటకోత్సవాలకి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన కళాకారులు ప్రజలను అలరిస్తారు. ఒంగోలు నుండి ఎంతో మంది ప్రముఖులు నాటక మరియు చిత్ర రంగమందు ప్రిసిద్ధి చెందారు. దిగ్గజ నటులు "కంచు కంఠం"గా పేరొందిన ప్రముఖ నటుడు కొంగర జగ్గయ్య ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి భారత లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన తొలి భారతీయ కళాకారునిగా కూడా చరిత్రకెక్కారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

ఒంగోలు పట్టణానికి ఎవరు వెళ్లినా అల్లూరయ్య స్వీట్ షాప్ లో మైసూర్ పాక్ కొనకుండా వెళ్ళరు. హైదరాబాద్ బిర్యానీకి,కాకినాడ కాజాలకు ప్రసిద్ధి అయితే ఒంగోలు మెత్తటి అల్లూరయ్య మైసూర్ పాక్ కి ప్రసిద్ధ అన్నమాట.ఒక్కసారి తింటే జీవితాంతం మర్చిపోలేము. అదేమన్నా పెద్ద దుకాణమా అంటే కాదు అతి చిన్న గదిలో నిర్వహించబడుతుంది కానీ రుచి దేశమంతా వ్యాపించింది. .....జయకృష్ణ

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Retrieved 1 April 2016.
 2. 2.0 2.1 2.2 "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 26 July 2014.
 3. Handbook of the Madras Presidency By Edward B. Eastwick, John Murray (Firm) పేజీ.329 [1]
 4. Imperial Gazetteer of India. Provincial series - Madras (1908) పేజీ.338 [2]
 5. "Commissioner Profile". ongolemunicipalcorporation.org. Retrieved 3 July 2016.
 6. "Bus Stations in Districts". Andhra Pradesh State Road Transport Corporation. Retrieved 8 March 2016.
 7. Krishnamoorthy, Suresh (22 April 2015). "Several bus stations lack CCTV surveillance". The Hindu. Hyderabad. Retrieved 8 March 2016.
 8. "Vijayawada division - A Profile" (PDF). South Central Railway. Retrieved 18 January 2016.
 9. "Ongole Airport Site Approved". Hindu Business Line. Retrieved 19 February 2014.
 10. "RIMS College - ONGOLE". Rimsongole.org. Retrieved 2013-09-29.
 11. "QIS College of Engineering & Technology :: Ongole". Qiscet.edu.in. 2013-07-12. Retrieved 2014-03-04.
 12. "Prakasam Engineering College". Prakasamec.com. 2013-04-06. Retrieved 2014-03-04.
 13. ఒంగోలులో నరకాసుర వధ, ఈనాడు ఆదివారం 27, అక్టోబరు 2013

వెలుపలి లింకులు[మార్చు]

[5] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015,మార్చ్-30; 1వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2015,జూన్-24; 8వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015,జూన్-25; 1వపేజీ. [8] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015,ఆగస్టు-29; 1వపేజీ. [9] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015,సెప్టెంబరు-2; 1వపేజీ. [10] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015,డిసెంబరు-7; 2వపేజీ. [11] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015,డిసెంబరు-12; 1వపేజీ. [12] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2016.ఫిబ్రవరి-15; 1వపేజీ. [13] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2016.ఫిబ్రవరి-19; 2వపేజీ. [14] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2016,మే-19; 1వపేజీ. [15] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2017,ఫిబ్రవరి-19; 1వపేజీ. [16] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2017,మార్చ్-1; 2వపేజీ. [17] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2017,మార్చ్-8; 4వపేజీ. [18] ఈనాడు ప్రకాశం; 2017,జులై-11; 8వపేజీ. [19] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2017,ఆగస్టు-8; 2వపేజీ. [20] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2017,ఆగస్టు-12; 2వపేజీ. [21] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2017,ఆగస్టు-22; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=ఒంగోలు&oldid=2530390" నుండి వెలికితీశారు