చర్చ:పరమాణు సిద్ధాంతం

వికీపీడియా నుండి
(చర్చ:అణు సిద్ధాంతం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పరమాణు సిద్ధాంతం వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2019 సంవత్సరం, 20 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


పరమాణు సిద్ధాంతం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2021 సంవత్సరం, 16 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

వ్యాస శీర్షిక[మార్చు]

రవిచంద్ర గారూ, atom అనగా 'పరామాణువు", molecule అనగా "అణువు" కదా. ఈ వ్యాసం ఆంగ్లంలో atomic theory అని ఉంది. అనగా "పరమాణు సిద్ధాంతం" అని ఉండాలి. వ్యాసంలో కూడా ప్రారంభంలో atom అనగా అణువు అని తెలియజేసారు. సరిచూడండి. K.Venkataramana(talk) 14:30, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వెంకట రమణ గారూ, Atom అంటే పరమాణువు అనే అర్థం మీద నిఘంటువుల్లో ఏకాభిప్రాయం లేదు.
  • బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1852 - అణువు, రేణువు, నలుసు.
  • ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008 - పరమాణువు
  • శంకరనారాయణ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1972 - అణువు; పరమాణువు; లేశము.
  • పారిభాషిక పదకోశము (ఆంధ్రగ్రంథమాల) 1936 - పరమాణువు
  • శాస్త్ర పరిభాష, వ్యవహారిక కోశము (దిగవల్లి వెంకట శివరావు) 1934 - పరమాణువు; అణువు; కణము; లేశము.

- రవిచంద్ర (చర్చ) 15:36, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నిఘంటువులో భిన్నాభిప్రాయాలుండవచ్చు. మనం దేనిని ప్రామాణికంగా తీసుకోవాలో ఆలోచించాలి. ప్రస్తుతం విద్యార్థులకు బోధించు 9వ తరగతి, 10వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం నకు సంబంధించిన పాఠ్య పుస్తకాలలో ఆంగ్ల, తెలుగు మాధ్యమాలను పరిశీలిస్తే అణువులు (molecules), పరమాణువుల (atoms) గూర్చి తెలుస్తుంది. కనుక పరమాణువులు కలిసి అణువులు ఏర్పడతాయి. రెండు ఆమ్లజని పరమాణువులలొ ఆక్సిజన్ అణువు, మూడు ఆక్సిజన్ పరమాణువులతో ఓజోన్ అణువు, రెండు ఉదజని పరమాణువులు ఒక ఆమ్లజన్ పరమాణువు కలిస్తే నీటి అణువు ఏర్పడతాయి కదా. కనుక పాఠకులకు యిబ్బంది కలుగ కుండా atom అనగా పరమాణువు అని, molecule అనగా అణువు అని మార్చితే బాగుంటుంది. హిందీ వికీపీడియాలో "परमाणुवाद" అనీ, కన్నడ వికీపీడియాలో "ಪರಮಾಣು ಸಿದ್ಧಾಂತ" అని రాసుకున్నారని గమనించండి. గూగుల్ అనువాదం కూడా "atomic theory"అనగా "పరమాణు సిద్ధాంతం" అని తెలుపుతుంది. చదువరులకు సరైన జ్ఞానాన్నందించే పదాలు, వాడుకలో ఉన్న పదాలు వాడాలి కనుక ఒక్కసారి ఆలోచించగలరు. చదువరి గారు కూడా ఒకసారి పరిశీలించగలరు. K.Venkataramana(talk) 16:15, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకటరమణ గారూ, మీరు చెప్పింది నిజమే. నేను పదో తరగతి దాకా తెలుగు మాధ్యమంలో చదువుకున్నాను. అప్పటి తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఆటం అంటే పరమాణువు అనే చదువుకున్నట్లు గుర్తు. కానీ అణువు అంటే ఎందుకో నాకు మాలిక్యూల్ అనే పదానికి సరైన పదంగా కనిపించడం లేదు. తెలుగు అకాడమీ వల్ల ఎందుకో ఆ పదం స్థిరపడిపోయి ఉండవచ్చు. మాలిక్యూల్ అనే మాటకు రసాయనిక బంధాల ద్వారా ఏర్పడ్డ ఆటమ్స్ గుంపు అనే అర్థం ఉంది. అందుకనే వేమూరి వెంకటేశ్వరరావు గారు కూడా ఈ పదానికి బణువు (బహుళ అణువులు) అనే పదప్రయోగం చేశారు కూడా. కానీ పదం జన సామాన్యంలోకి వెళ్ళలేదు. అందుకనే ఆయన వికీలో ఆ పదం వాడినా మనం అంగీకరించలేదు. బణువు వ్యాసం చూడండి. రావు గారు తన అభిప్రాయాలే రాశారు, దాన్ని తిరగ రాయాలి. అలాగే అణువు అనే వ్యాసాన్ని చూడండి. ఈ వ్యాసంలో కూడా ప్రధాన భాగం రావుగారే రాశారు. కానీ ఆయన కణాదుడు ప్రతిపాదించిన సిద్ధాంతాలను పరిగణనలోకి తీసుకుని ఆటం అనే పదానికి అణువు అని అర్థం వస్తుందని చెప్పాడు. ఆయన అభిప్రాయాలు నన్ను ఆలోచింపజేశాయి. అకాడమీ పాఠ్యపుస్తకాల్లో ఈ పదాల సృష్టించేటపుడు ఇంత చర్చ జరిగిందో లేదో మరి. శాస్త్రీయ పదజాలానికి ఏదో ఒకటి ప్రామాణికంగా ఉండాలన్న మీ వాదనతో ఏకీభవిస్తున్నాను. ప్రస్తుతం మనకు ప్రామాణికంగా ఉన్నవి పాఠ్యపుస్తకాలే గనుక దానికి తగ్గట్లు పదాలను మార్చడం నాకు సమ్మతమే. కానీ, మాలిక్యూల్ అనే పదానికి అణువు అనే పదం సరిపోదనిపిస్తోంది. ఎందుకంటే అనేక పరమాణువులు కలిసి ఏర్పడ్డది అనే అర్థం స్ఫురించడం లేదు. నేను మధ్యే మార్గంగా అణుసముదాయం అని వాడాను. ఇదేమీ నేను సృష్టించిన పదం కాదు కానీ రెండు పదాల కలయిక. అర్థమవుతుందనే నమ్మకం. అంతే. - రవిచంద్ర (చర్చ) 17:11, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మూడు విభిన్న మూలాలను చూద్దాం:
  1. పాఠ్య పుస్తకాల్లో ఏం రాసారు: ఏటమ్ అంటే పరమాణువు, మాలిక్యూల్ అంటే అణువు (ఇంటరు దాకా తెలుగు లోనే చదివాను గానీ, పాఠ్య పుస్తకాల్లో ఏం చదివానో నాకు గుర్తులేదు. వెంకటరమణ గారు చెప్పారు కాబట్టి దాన్నే నేను పరిగణిస్తున్నాను.)
  2. ప్రస్తుతం ప్రజా బాహుళ్యంలో ఎలా ఉంది: పత్రికల్లో గానీ సాధారణ ప్రజల్లో గానీ ఇలా ఉంది? ఏటం బాంబ్ అంటే అణు బాంబు; అటామిక్ పవర్ ప్లాంట్\న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే అణువిద్యుత్కేంద్రం; న్యూక్లియర్ సబ్‌మెరీన్ అంటే అణు జలాంతర్గామి; న్యూక్లియర్ మిస్సైల్ అంటే అణు క్షిపణి ఇలా వాడతారు. ఎక్కడైనా సరే, ఏ సందర్భమైనా సరే.. న్యూక్లియర్ / ఏటమ్ అనే పదాలు వస్తే అణు అని వాడేస్తారు. కేంద్రక సంలీనం, కేంద్రక విచ్ఛిత్తి అనేవి అక్కడక్కడా ఏక్యురేట్‌గా ఉదహరిస్తారు -అవి మినహాయింపు. పత్రికలు ఏమి వాడితే ప్రజలం సహజంగా అదే వాడతాం. 90% ఇలాగే జరుగుతుంది. మన వార్తాపత్రికల్లో భాషా ఖచ్చితత్వాన్ని - ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక విషయాల్లో - ఆశించడం అత్యాశ అవుతుంది.
  3. మూడోది మానవ చరిత్రలో ఏటమ్ / అణువు అనేవి శతాబ్దాలుగా అత్యంత సూక్ష్మ పరిమాణానికి సూచిక. ఇక్కడ "అణువు" అనేది ప్రాథమిక కొలమానం. అంటే "మీటరు" లాంటి దన్నమాట. కొన్ని అణువులు కలిసి "మాలిక్యూలు"గా ఏర్పడతాయి. అంటే అది కిలోమీటరు లాంటిదన్న మాట. అణువు కంటే చిన్నవి ఉన్నాయని వాటితో అణువు ఏర్పడిందని కనుగొన్నాక వాటికి ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ అని పేర్లు పెట్టి వాటన్నిటినీ కలిపి సబ్-ఎటామిక్ పార్టికిల్స్ అన్నారు. అంటే మిల్లీ మీటరు లాగా అన్నమాట. అదే పద్ధతిలో అణువు కంటే పెద్దవాటిని పెద్దణువులు, బృహదణువులు, బహుళాణువులూ అనాలి. చిన్నవాటిని చిన్నణువులు, సూక్ష్మాణువులు, పరమాణువులూ అనాలి. అణువు మారకుండా ఉండాల్సింది. ఇది నా లాజిక్. ఇప్పుడు..
ఏది ప్రామాణికం: ఈ విషయంలో మనం పాఠ్య పుస్తకాలనే ప్రామాణికంగా తీసుకోవాలి. పాఠ్యపుస్తకాలను మించిన ప్రామాణికత మరొక దానికి ఉంటుందనుకోను. పాఠ్య పుస్తకాలు ఏటంని పరమాణువు అంటే మనమూ అలానే అనాలి. మాలిక్యూలును అణువు అనాలి.
వేమూరి గారి వాదన: పైన రవిచంద్ర గారు చెప్పిన అణువు వ్యాసంలో ఈ విషయాన్ని వేమూరి వెంకటేశ్వరరావు గారు చర్చించారు. ఆయన ఏటమ్ అంటే అణువు, సబ్-ఎటామిక్ పార్టికిల్స్ అంటే పరమాణువులు అని అంటున్నారు. అయితే ఈ సంగతి చెప్పేటపుడు ఆయన పాఠ్యపుస్తకాలను పరిగణన లోకి తీసుకోలేదు.
మరో సంగతి: ప్రజా బాహుళ్యంలో ప్రాచుర్యంలో ఉన్నదాన్నే వికీలో వాడాలనే నియమం ఒకటి మనకుంది. అంచేత అణువే వాడాలి అనే వాదన ఒకటి వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ వాదన ఇక్కడ వర్తించదు. ఇక్కడ ఒక శాస్త్రాంశాన్ని చర్చిస్తున్నాం. శాస్త్రీయంగానే చర్చించాలి. అంచేత ఏటంని పరమాణువు అనే అనాలి.
ఇదీ నా అభిప్రాయం. పెద్దలు పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 09:19, 4 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, వెంకట రమణ గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు. మిగతా సభ్యులెవరైనా తమ అభిప్రాయాలు చెబుతారేమో. మరో మూడు రోజులు ఎదురు చూస్తాను. ఆ తర్వాత Atom = పరమాణువు, Molecule = అణువు అనే నిర్వచనానికి స్థిరపడిపోదాం. అణువు, పరమాణువు పదాలు వాడుకలో ఎలా కలగలిసి పోయాయో తెలియజేయడానికి పదజాలం వాడుక అనే విభాగం పెట్టి అందులో రాయవచ్చు అనుకుంటా. ఈ నిర్ణయాన్ని బట్టి ఈ వ్యాసంలోనే కాక మరిన్ని వ్యాసాల్లో కూడా మార్పు చేయవలసి ఉంటుంది. - రవిచంద్ర (చర్చ) 17:17, 4 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పైన జరిగిన చర్చ ఆధారంగా ఈ వ్యాసాన్ని పరమాణు సిద్ధాంతం అనే పేరుకు దారి మారుస్తున్నాను. అలాగే ఆటం అంటే పరమాణువు, మాలెక్యూల్ అంటే అణువు అని మారుస్తాను. - రవిచంద్ర (చర్చ) 10:16, 10 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మార్పులు పూర్తయినాయి. - రవిచంద్ర (చర్చ) 12:40, 10 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం మీద అభిప్రాయాలు[మార్చు]

పైన పేర్కొన్న పదజాలం విషయాన్ని మినహాయించి అసలు ఈ వ్యాసం ఎలా ఉందో మీ అభిప్రాయాలు తెలుసుకోవాలని ఉంది. సైన్సు కు అత్యంత ప్రాథమైన అంశాలలో ఈ పరమాణు సిద్ధాంతం ఒకటి. అందుకని ఈ వ్యాసాన్ని చాలా జాగ్రత్తగా, ఓర్పుగా రాశాను. ఇది ఆంగ్ల వికీలో విశేష వ్యాసం. పేరుకు అనువాద వ్యాసమే అయినా సహజమైన తెలుగు పదాలు ఉండటం కోసం సమయం వెచ్చించి స్వేచ్ఛగా అనువాదం చేశాను. నేను తెవికీలో రాసిన ఉత్తమ వ్యాసాల్లో దీన్ని ఒకటిగా భావిస్తాను. చదువరి గారు, ముఖ్యంగా వెంకట రమణ గారూ మీరు భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు గనుక ఈ వ్యాసం మీద మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. మిగతా సభ్యులెవరైనా ఆసక్తి ఉన్నవారు కూడా మీ అభిప్రాయాలు పంచుకోగలరు. - రవిచంద్ర (చర్చ) 17:29, 4 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర వ్యాసం బాగా అనువాదం చేసి రాసారు. అందుకని దీనిని 2020 38వ వారం వ్యాసంగా ప్రచురించాను. నేను గత 20 సంవత్సరాలుగా భౌతిక రసాయన శాస్త్రాలను రెండు మాధ్యమాలలో బోధిస్తున్నాను. దానికోసం ఒక బ్లాగు కూడా నిర్వహిస్తున్నాను. ఈ వ్యాసాన్ని బాగా పరిశీలించినపుడు atom, molecule అర్థాలు మారిపోయి కనిపించాయి. ఈ వ్యాసాన్ని విజ్ఞానశాస్త్రం బోధించే ఉపాధ్యాయులు, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు చదివితే తప్పుగా అర్థం చేసుకుంటారని ఈ వారం వ్యాసంలోని అంశాన్ని తొలగించాను. ఈ వ్యాసం శుద్ధి చేసిన తరువాత మరల అదే వారంలో ప్రచురించవచ్చునని ఈ చర్చ లేవదీసాను. సాధారణంగా గ్రామాలలో పిల్లలు తెలుగు మాధ్యమంలో 10వ తరగతి వరకు చదివి తరువాత ఆంగ్లమాధ్యమంలో ఇంటర్ చదువుతుంటారు. రసాయనశాస్త్రంలో atomic structure అనేది కీలకమైన పాఠ్యాంశం. దాని మీద ఆధారపడి మిగతా పాఠాలు ఉంటాయి. కనుక విద్యార్థులు అంతర్జాలంలో ఈ వ్యాసం చూస్తే ఈ అర్థాలను తప్పుగా అర్థం చేసుకుంటారని మార్చమని తెలియజేసాను. పైన నేను తెలియజేసిన మార్పులు చేస్తే వ్యాసం బాగుంటుంది. ఏదేమైనా మంచి వ్యాసం రాసినందుకు మీకు ధన్యవాదాలు. మార్పులు చేసిన తదుపరి వ్యాసాన్ని మొత్తం చదివి ఏవైనా దోషాలుంటే శుద్ధి చేసే ప్రయత్నం చేస్తాను. K.Venkataramana(talk) 17:42, 4 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
User:K.Venkataramana గారూ మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇక ఒకటి రెండురోజుల్లో పైన జరిగిన చర్చను ముగించిమీరు సూచించిన మార్పులు చేస్తాను. - రవిచంద్ర (చర్చ) 17:22, 7 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ, వ్యాసం చాలా చక్కగా వచ్చింది. క్లిష్టమైన శాస్త్ర పరిభాష ఉండే వ్యాసాన్ని చక్కగా సరళంగా తెలుగులో రాసారు. అభినందనలు. వెంకట రమణ గారూ వ్యాసం ఈ రూపు తీసుకోవడంలో మీరు పోషించిన పాత్రకు కూడా ధన్యవాదాలు.
పోతే, ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ మేఘం లాగా ఉంటాయని రూదర్‌ఫోర్డ్ మోడల్ చెబుతోందని (ధనావేశం కలిగిన కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు మేఘాలవలె చుట్టుముట్టి ఉంటాయని భావించాడు.) రాసారు. ఈ మేఘ భావన ఈనాటి ఆధునిక భావన గానీ, రూదర్‌ఫోర్డుది కాదుగదా, అతడిది కక్ష్యల భావన గదా అని నాకు సందేహం వచ్చింది. మీరిద్దరూ దాన్ని పరిశీలించవలసినది. ఆపై ఇక ఇది ఈవావ్యాకు సిద్ధమేనని నా ఉద్దేశం. __చదువరి (చర్చరచనలు) 05:38, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, రూథర్ ఫర్డు పరికల్పన కక్ష్యలకు సంబంధించినది మాత్రమే. ఈ మేఘ భావన ఆధునిక భావన. సరిచేయవచ్చు.-- K.Venkataramana -- 05:59, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, నేనంతా బాగా అనువదించానే అనుకున్నా కానీ ఈ లోపం నాకు తట్టలేదు. ఇప్పుడు ఆంగ్ల వికీకి వెళ్ళి చూస్తే నేను అనువదించిన వ్యాసానికి, ప్రస్తుత రూపుకు తేడా ఉన్నట్లుంది. దానికి తగ్గట్లు వ్యాసాన్ని మారుస్తాను. అన్నట్లు ఆంగ్ల వికీలో ఒకసారి FA, GA గా ముద్ర పడ్డాక సమూలమైన మార్పులు ఉండవనుకున్నాను కానీ, బాగానే మార్పులు చేశారు. - రవిచంద్ర (చర్చ) 10:18, 30 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
తాజా ఆంగ్ల వికీ వ్యాసానికి అనుగుణంగా మార్పులు చేశాను. రవిచంద్ర (చర్చ) 11:19, 30 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]