చర్చ:ప్రపంచ రక్త దాతల దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రపంచ రక్త దాతల దినోత్సవం వ్యాసమును జూన్ 14, 2014 న ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా YVSREDDY గారు సృష్టించడం జరిగింది.

జూన్ 14, 2014 న ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా YVSREDDY గారు వ్రాసిన ప్రపంచ రక్త దాతల దినోత్సవం వ్యాసంలోని సమాచారం
1,259 బైట్లతో YVSREDDY గారు సృష్టించిన ప్రపంచ రక్త దాతల దినోత్సవం వ్యాసంలోని సమాచారం
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవంను జరుపుకుంటారు. రక్తదాతలకు ధన్యవాదాలు తెలిపేందుకు, సురక్షితమైన రక్తం యొక్క ఆవశ్యకతను తెలియజేసేందుకు, రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని భద్రపరచే విధానాలను మెరుగు పరచుకునేందుకు 2005లో ఈ కార్యక్రమం ప్రారంభమయింది. ఎ, ఒ, బి, బ్లడ్ గ్రూపులను కనుగొన కార్ల్ లేండ్ స్టీనర్ జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజైన జూన్ 14న ప్రపంచ రక్త దాతల దినోత్సవమును జరుపుకుంటున్నారు.

vargam:రక్తదానం vargam:దినోత్సవాలు

అయితే Ch Maheswara Raju గారు ఈ వ్యాసాన్ని 14 జూన్ 2020‎ న 72 బైట్లతో ప్రారంభించి 5,494 బైట్లకు విస్తరించారు.

Ch Maheswara Raju గారు వ్రాసిన ప్రపంచ రక్త దాతల దినోత్సవం వ్యాసంలోని సమాచారం
14 జూన్ 2020‎ న Ch Maheswara Raju గారు సృష్టించిన ప్రపంచ రక్త దాతల దినోత్సవం వ్యాసంలోని సమాచారం
ప్రపంచ రక్త దాతల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రజలకు రక్తం విలువని తెలపాలనే ఉద్దేశంతో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఏటా జూన్‌14న నిర్వహిస్తున్నారు.

చరిత్ర

[మార్చు]

1901లో ఆస్ట్రేలియాకు చెందిన నోబెల్‌ విజేత కార్ల్‌ లాండ్‌స్టీనర్‌ మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించారు. దీంతో ఆయన జయంతి గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని 2004లో అన్ని దేశాల్లో నిర్వహించాయి.

ర‌క్త‌దానం

[మార్చు]

రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడానికి వీలుకాదు. అయితే రక్తదాతలు ఎవరైనా రక్తాన్ని దానం చేసి, మరొకరి ప్రాణాలను కాపాడవచ్చు. 18 సంవత్సరాలు నుండి 55ఏళ్ల లోపు ఉన్నవారు రక్తదానానికి అర్హులు. కనీసం రక్తదాతల శరీర బరువు 50 కిలోలు ఉండాలి. రోగ నివారణ కోసం, ప్రమాదాల సమయంలో బాధితుల శరీరంలో తగినంతగా రక్తం లేకపోతే మరొకరి నుంచి రక్తాన్ని ఎక్కిస్తుంటారు. ఇలా ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే విధానమే రక్తదానం. రక్తాన్ని తీసుకొనే వ్యక్తిని గ్రహీత అని, ఇచ్చే వ్యక్తిని దాత అని అంటారు. ‘ఓ’ గ్రూప్‌రక్తం కలిగిన వారిని విశ్వదాత అని, ‘ఏబీ’. గ్రూపుల రక్తం కలిగినవారిని విశ్వగ్రహీత అని అంటారు.

రక్తదానం అపోహలు-వాస్తవాలు

[మార్చు]
  • రక్తదానం చేస్తే బలహీనపడి, నీరసించిపోతారు ఒక అపోహ ఉంది కానీ రక్తదానం తర్వాత ఎటువంటి బలహీనత సంభవించదు.ఎప్పటిలా ఆరోగ్యంగా ఉంటారు.
  • శ్రమతో కూడిన కష్టమైన పనులు చేసుకునేవారు ఇంతకుముందులా పనిచేసుకోలేరు ఒక అపోహ ఉంది కానీ రక్తదానం తర్వాత యధావిధిగా అన్నిరకాల శ్రమతో కూడిన పనులు చక్కగా చేసుకోవచ్చు.
  • రక్తదానం చేసే సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది అని ఒక అపోహ ఉంది కానీ రక్తదానం సమయంలో ప్రత్యేకమైన సూది గుచ్చేటప్పుడు కలిగే చిన్నపాటి నొప్పి తప్పించి ఎటువంటి తీవ్రమైన నొప్పి ఉండదు.
  • రక్తదానం వల్ల ఎయిడ్స్‌ సంక్రమించవచ్చు అని ఒక అపోహ ఉంది. వాస్తవానికి రక్తదానం పూర్తి శాస్ర్తీయమైన, సురక్షితమైన పద్దతులలో ఏ రకమైన వ్యాధి క్రిములు సోకే అవకాశంలేని విధంగా జరుగుతుంది.

జూన్ 14, 2014 న YVSREDDY గారు ప్రారంభించిన ఈ వ్యాసం చాలా చక్కగా ఉన్నప్పటికి తొలగించడం జరిగింది. ఈ వ్యాసాన్ని తొలగించుటకు నిర్వహకులు ఉపయోగించినంత సమయాన్ని ఈ వ్యాసం యొక్క విస్తరణకు ఉపయోగించివుంటే ఈ వ్యాసం యొక్క చరిత్ర పాడుగాకుండా వుండేది. నిర్వాహకులు ఈ వ్యాసాన్ని పొరపాటుగా తొలగించినా Ch Maheswara Raju గారు ఈ వ్యాసాన్ని చాలా చక్కగా వ్రాసారు. YVSREDDY (చర్చ) 07:11, 12 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@YVSREDDY గారూ, మీరు ఈ చర్చల్లో తొలగించిన పేజీల్లోని సమాచారాన్ని కాపీ పేస్టు చేయడం, దాని మీద వ్య్తాఖ్యలు రాయడం లాంటి పనులు చేసేబదులు తొలగింపు ప్రతిపాదనలు వచ్చినపుడే వ్యాసాలను తగు విధంగా మెగుపరచి ఉంటే, ఇక్కడ మీరు పడుతున్న శ్రమ,వెచ్చిస్తున్న సమయం వృథా అయ్యేవి కాదు, ఈ కాపీ పేస్టు బైట్లతో వికీ పరిమాణాన్ని అనవసరంగా పెంచకుండానూ నివారించగలిగే వాళ్ళు. ఒకసారి ఆయా తొలగింపు ప్రతిపాదనలపై జర్ఫిగిన చర్చలను కూడా చూడండి. మీరు వాటిలో పాల్గొనక పోయినా చర్చలు మాత్రం జరిగాయి. మెరుగుపరచేందుకు తగు సమయం ఇచ్చారు. మెరుగుపరచని సందర్భంలో మాత్రమే తొలగించారు. గమనించండి. __చదువరి (చర్చరచనలు) 07:26, 12 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసాల తొలగింపులే లక్ష్యంగా మాత్రం చర్చలు జరిగాయి. వ్యాసాలను మెరుగుపరచేందుకు అసాయం ఇచ్చారు. నేను ప్రారంభించిన ప్రతి వ్యాసం ఖచ్చితంగా పునఃస్థాపించబడతాయి. ఎందుకంటే నేను వ్రాసిన ప్రతి వ్యాసం నిర్వాహకుల పొరపాటుల వలన తొలగించబడినవి. ఎవరైనా న్యాయవాదులు, నిర్వాహకుల పొరపాటుల వలన తొలగించబడిన నేను వ్రాసిన వ్యాసాలను చూసినప్పుడు వారు కోర్టు ద్వారా నైనా న్యాయంగా వాదించి నా తొలగించబడిన వ్యాసాలను పునఃస్థాపిస్తారు. నేను వ్రాసిన వ్యాసాలు నిజమైనవి, నిజాయితీ గలవి. నిజం నిప్పు లాంటిది దానిని ఎక్కువ సేపు అరచేతిలో బంధించలేరు. YVSREDDY (చర్చ) 09:18, 12 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
తొలగింపు ప్రతిపాదనలు వచ్చినపుడు సదరు వాడుకరి నుండి ఎలాంటి స్పందన రాలేదు. అప్పుడే వ్యాసాలను తగు విధంగా మెగుపరచి ఉంటే వ్యాసాల తొలగింపు జరిగుండేది కాదు. తొలగింపు ప్రతిపాదనలపై చర్చలు జరిగిన తరువాతనే వాటిని తొలగించడం జరిగింది. అంతా జరిగిన తరువాత ఇప్పుడు వచ్చి నిర్వాహకులను నిందించడం మంచి పద్ధతికాదు. ఇది ఇలానే కొనసాగిస్తే సదరు వాడుకరిపై శాశ్వత చర్యలు తీసుకోవడం అనివార్యం అనిపిస్తోంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:21, 12 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  • నేను ఇక్కడ ఏ నిర్వాహకులను నిందించలేదు. నేను సృష్టించిన వ్యాసాలు నిజమైనవి, నిజాయితీ అయినవి అయితే తిరిగి పునఃస్థాపించబడతాయి అని తెలియజేస్తున్నాను. 09:36, 12 ఫిబ్రవరి 2023 (UTC)
మీరు సృష్టించిన వ్యాసాలు నిజమైనవి, నిజాయితీ అయినవి అయితే అప్పుడే ఎందుకు చర్చలో పాల్గొనలేదు?. గతంలో తొలగించబడిన వ్యాసాలు మీరే మళ్ళీ అదే సమాచారంతో మళ్ళీ సృష్టిస్తూ, తిరిగి పునఃస్థాపించబడతాయి అని మీకుమీరే చెప్పుకుంటున్నారు. తొలగించబడిన వ్యాసాలు నిజమైనవి, నిజాయితీ అయినవి అయితే అదే చర్చాపేజీలో రాయాలిగానీ, అదే పేరుతో-అదే సమాచారంతో మరో వ్యాసాన్ని సృష్టించి ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:49, 12 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  • మీ టీం వ్యాసాలను రక్షించే ఉద్ధేశ్యంతో చేసిన చర్చలు అయితే నేను పాల్గొనకపోయినా ఖచ్చితంగా ఇతర నిర్వాహకులు పాల్గొనేవారు. కానీ చర్చల ఫలితాన్ని ముందే నిర్ణయించుకొని చేసిన చర్చలు అవి. అందుకే నేను పాల్గొనలేదు ఇతర నిర్వాహకులు పాల్గొనలేదు. YVSREDDY (చర్చ) 10:05, 12 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
    "చర్చల ఫలితాన్ని ముందే నిర్ణయించుకొని చేసిన చర్చలు అవి." అని మీరు ఆరోపించారు. దానికి ఆధారం చూపండి. __చదువరి (చర్చరచనలు) 10:13, 12 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
    ఒకవేళ ఆ ఆరోపణ తొందరపడి చేసినట్లుగా మీరు గుర్తిస్తే, ఇప్పుడు అంత మునిగిపోయిందేమీ లేదు, దాన్ని వెనక్కి తీసుకోండి. __చదువరి (చర్చరచనలు) 10:26, 12 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
    మరొక్క సంగతి.. టీం అనే మాటను మీరు ఈరోజు రెండో సారి (నిర్వాహకుల నోటీసు బోర్డులో కూడా వాడారు) ఉపయోగించారు. వ్యాసాలను తొలగించేందుకు ప్రత్యేకంగా టీం అంటూ వికీలో ఏదీ లేదు. అయినా మీరు టీం అనే మాటను వాడుతున్నారు. ఇకపై దాన్ని - ఏ అర్థంలోనైనా సరే - వాడకండి. మళ్ళీ మళ్ళీ వాడితే దాన్ని నిందగా భావించే అవకాశం ఉంది. గమనించగలరు. __చదువరి (చర్చరచనలు) 10:22, 12 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
    వైవిఎస్ రెడ్డి గారి పంథాలో ఏమి మార్పులేదు.ఎంత సేపటికి నిర్వాహకులపై నిందలు వేయటం, నిరాధారఆరోపణలు చేయటం పనిగాపెట్టుకున్నట్లుఉంది.సానుకూల ధోరణి ఏ మాత్రం లేదు.నిర్వాహకులను దరుద్దేశంతో టీం అనే మాటను వాడటం ఏ మాత్రం బాగాలేదు. ఇది ఇంకా పదపదే వాడితే దానికి తగిన చర్యలు తీసుకోవటంలో ఏ మాత్రం తప్పులేదు.ఆ స్థితికి రాకూడదని వైవిఎస్ రెడ్డి గారిని కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 04:07, 18 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]