చర్చ:సూరం సుందరరామయ్య (సుందరరామయోగి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:Jevanmukti cover.jpg

సుందరారయ్య 50 ఏళ్ళ క్రితం రాసిన ఆధ్యాత్మిక గ్రంథం అచ్చువేయించాము. వారంలో వారి కృషి గురించి రాష్ట్రము.[మార్చు]

సుందరారయ్య 50 ఏళ్ళ క్రితం రాసిన ఆధ్యాత్మిక వచన గ్రంథం జీవన్ముక్తిని ఆయన కుమారుడు 2022లో అచ్చువేయించారు. , ఈయన జననం 1908, మరణం 1994, తల్లి భువనేశ్వరి, తండ్రి సూరం వెంకటసుబ్బయ్య. ఈ దంపతులకు సుందరారయ్య రెండవ కుమారుడు. ఈయన 12వ ఏట తల్లి మరణించింది, కోర్టు వ్యాజ్యాలలో భూస్థితి దాయాదుల స్వాధీనమైన తర్వాత, తల్లి పట్టపుటేనుగుమీద తనను కూర్చోబెట్టుకొని, పసిడిపళ్లెంలో కాసులు అందించి అదృశ్యమైనట్లు స్వప్నం, ఆ తర్వాతనే, దత్తతద్వారా తుమ్మగుంట గ్రామంలో ఆస్తి స్వాధీనమై నిలద్రొక్కుకొన్నాడు. సుందరరామయ్య ఆస్తి తగాదాలల్లో వైరాగ్యంతో ఇంట్లోనుంచి పారిపోయాడు. తండ్రి ఇతను భద్రాచలంలో ఉన్నట్లు పోవిడి తెలుసుకొని, ఇంటికి తీసికొనివచ్చి శారదాంబతో వివాహం జరిపించాడు. సుందరరామయ్య 16 సంవత్సరాల వయసులో మెట్రిక్టిక్యూలేషన్ పాసయి, నెల్లూరులో శ్రీ రాధాకృష్ణాలయం స్కూల్లో కొంతకాలం పనిచేసాడు. అప్పుడు సంవత్సరానికి జీతం 120/రూపాయలు మాత్రమే. మహోపాసకులు నోముల అప్పారావు నెల్లూరు వచ్చి గురుశుశ్రూషచేసి ఆధ్యాత్మిక శిక్షణ పొందేసమయం,లో అప్పారావుతో స్నేహం సుందరరామయ్యను ఆధ్యాత్మికతవైపుకు ఆకర్షించింది. అప్పారావు వేదాంత ఉపన్యాసాలు నెల్లూరు టౌన్ హాల్లొ నెలరోజులు జరిగాయి. సుందరరామయ్య ఆ ఉపన్యాసాలు సకుటుంబంగా వింటూ, వాశిష్ఠ రామాయణం వంటి ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ, క్రమంగా వైరాగ్యంవైపు మళ్లాడు. 1950లో, జీవన్ముక్తి గ్రంథాన్ని ఆరంభించి 1985 ప్రాంతంలో పూర్తిచేసాడు. 1992లో భార్య గతించిన తర్వాత, ఈయన 1994లో వ్యాసపూర్ణిమనాడు సద్గతి పొందాడు. అర్థ శతాబ్దం తర్వాత సుందరరామయ్య కుమారులు 2022లో ఈ వేదాంత గ్రంథాన్ని ముద్రించి సాధకులకు అందించారు. ఈ గ్రంథం కొంత యాత్రాచరిత్ర, ఇంటినుంచి పారిపోయిన సుందరరామయ్య భద్రాచలం ప్రయాణం ఆసక్తికరంగా సాగింది. కొంత సాఘిక చరిత్ర, దేశ, సమాజ స్థితిగతులు ఇందులో వర్ణించబడినవి. ఆధ్యాత్మిక అన్వేషణ, మహిమలు, యంత్రతంత్రాలు, గురుభక్తి ఇట్లా ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. ఈయన జీవితకాలంలో సుందరరామయోగిగా భక్తులకు సుపరిచితుడు. మరొక విశేషం, ఈయన సర్వమత సమానత్వం, మత సహనం హర్షించదగినవి.

ఆకరాలు: జీవన్ముక్తి(ఆధ్యాత్మిక రచన), రచయిత: సూరం సుందరరామయ్య, ప్రథమ ముద్రణ 2022, శ్రీ లక్ష్మి గణపతి ప్రింటర్స్, గుంటూరు. ప్రచురణకర్త: సూరం ఉమామహేశ్వరం, నెల్లూరు. [వాడుకరి:Purushotham9966|Purushotham9966]] (చర్చ) 07:05, 16 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]