చర్చ:స్థానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సమాచార నాణ్యత[మార్చు]

ఈ వ్యాసం లోని సమాచారం దోష భూయిష్టంగా ఉంది. ఉదాహరణలు: 1. "స్థానం లేదా స్థలం (Place) మొదలైనవి ఒక నిర్ధిష్టమైన గుర్తించదగినది." మొట్టమొదటి వాక్యం ఇది. స్థానాన్ని నిర్వచించడం ఈ వాక్యపు ఉద్దేశం. కానీ నిర్వచనమేమీ లేదిందులో. ఆ "గుర్తించదగినది" ఏమిటి? 2. "వీని ఆధారంగా చాలా విషయాలు తెలుస్తాయి." - వేని ఆధారంగా? 3. "స్థానికులు అనగా ఒక ప్రాంతానికి చెందినవారు. ఒక ఊరిలో చాలాకాలంగా నివసించేవారు ఆ ఊరికి స్థానికులుగా భావిస్తారు." - 4. "వారు నివసించే ప్రాంతానికి చెందిన సంస్థలను స్థానిక సంస్థలుగా పరిగణిస్తారు." చాలా అసంబద్ధమైన స్టేట్‌మెంటిది.

పైవాటిలో ఏ ఒక్క దానిక్కూడా మూలాల్లేవు. "స్థానం", "స్థలం" ల మధ్య ఉన్న భేదాన్ని సూచించి ఉండాల్సింది.

ఇక రెండో విభాగానికొస్తే నిఘంటువుల్లో ఏముందో రాసారు. ఒక పెద్ద వ్యాసంలో ఇలాంటి విభాగం ఒకటుంటే కొంతవరకు సమంజసంగా ఉంటుంది. ఇంత చిన్నపాటి వ్యాసంలో ఇది సహ్యంగా లేదు. దీని కారణంగా ఇది విక్షనరీ వ్యాసానికి దగ్గరగా కనిపిస్తోంది.

ఇక మూడో పేరా - శాస్త్రాల్లో ఏముందో చెప్పారు. మూలాల్లేవు.

పేజీ మొత్తాన్ని తగుమూలాలతో తిరగరాయాలి. __చదువరి (చర్చరచనలు) 02:54, 3 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@ రాాజశేఖర్ గారూ, చదువరి గారి అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నాను.అసలు ఈ శీర్షిక సార్వజనిక పదం.దీనికి ప్రత్వేక వ్యాసం అవసరంలేదు. దీని లింకు కూడా వికీడేటా లింకుకు కలిపి ఉంది. కావున దీనిని అయోమయనివృత్తికి అనుగుణంగా మార్చాలని నా అభిప్రాయం. చర్చలలో స్పందనకు ఎంత కాలం తీసుకుంటుందో ఈ చర్చను ఉదాహరణగా మనం పరగణించవచ్చు. యర్రా రామారావు (చర్చ) 16:48, 18 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసంలోని చిత్రానికి కూడా ఎటువంటి సంబంధంలేదు.. యర్రా రామారావు (చర్చ) 16:57, 18 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]