Jump to content

URL

వికీపీడియా నుండి

యూనిఫాం రిసోర్స్ లొకేటర్ (Uniform Resource Locator - URL) అనేది ఒక కంప్యూటర్ నెట్వర్క్ మీద రిసోర్స్ (వనరు) ఎక్కడ ఉందో తెలిపే వెబ్ చిరునామా, ఇంకా దాన్ని ఎలా పొందాలో తెలిపే పద్ధతి. URL అనేది ఒకరకమైన యూనిఫాం రిసోర్స్ ఐడెంటిఫయర్ (URI).[1][2] చాలామంది ఈ రెండింటినీ కలిపి వాడుతుంటారు.[3][a] URL అనేవి తరచుగా వెబ్ పేజీలను (HTTP/HTTPS) సూచిస్తాయి. అంతే కాకుండా ఇవి ఫైల్ ట్రాన్స్‌ఫర్ (FTP), ఈమెయిల్ (mailto), డేటాబేస్ యాక్సెస్ (JDBC) లాంటి వాటిని కూడా సూచిస్తాయి.

చాలా వరకు జాల విహరిణులు (వెబ్ బ్రౌజర్లు) URL ని వెబ్ పేజీపైన కనిపించే చిరునామా పట్టీ (అడ్రెస్ బార్) లో చూపిస్తాయి). ఒక సాధారణ URL రూపం http://www.example.com/index.html ఇలా ఉంటుంది. ఇందులో http అనేది నియమావళి (ప్రోటోకాల్), www.example.com అనేది హోస్ట్ పేరు. index.html అనేది ఫైలు.

చరిత్ర

[మార్చు]

URL ని 1994 లో RFC 1738 ద్వారా వరల్డ్ వైడ్ వెబ్ ని ప్రతిపాదించిన టిమ్ బెర్నర్స్ లీ రూపొందించాడు.

గమనికలు

[మార్చు]
  1. A URL implies the means to access an indicated resource and is denoted by a protocol or an access mechanism, which is not true of every URI.[4][3] Thus http://www.example.com is a URL, while www.example.com is not.[5]

మూలాలు

[మార్చు]
  1. "Forward and Backslashes in URLs". zzz.buzz. Archived from the original on 2018-09-04. Retrieved 19 September 2018.
  2. RFC 3986 (2005).
  3. 3.0 3.1 Joint W3C/IETF URI Planning Interest Group (2002).
  4. RFC 2396 (1998).
  5. Miessler, Daniel. "The Difference Between URLs and URIs". Archived from the original on 2017-03-17. Retrieved 2017-03-16.
"https://te.wikipedia.org/w/index.php?title=URL&oldid=4316818" నుండి వెలికితీశారు