వినుకొండ

వికీపీడియా నుండి
(Vinukonda నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

వినుకొండ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాలోని ముఖ్య పట్టణం. వినుకొండ మండలానికి ప్రధాన కేంద్రం.

వినుకొండ

విష్ణుకుండినపురం
Town
వినుకొండ నంద్యాల రైలు మార్గం, నల్లమల అడివి హద్దు దగ్గర
వినుకొండ నంద్యాల రైలు మార్గం, నల్లమల అడివి హద్దు దగ్గర
వినుకొండ is located in Andhra Pradesh
వినుకొండ
వినుకొండ
Location in Andhra Pradesh, India
నిర్దేశాంకాలు: 16°03′N 79°45′E / 16.05°N 79.75°E / 16.05; 79.75Coordinates: 16°03′N 79°45′E / 16.05°N 79.75°E / 16.05; 79.75
Countryభారతదేశం
Stateఆంధ్రప్రదేశ్
Districtగుంటూరు
పట్టణం29 May 2015
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంపురపాలక సంఘం
విస్తీర్ణం
 • మొత్తం22.82 కి.మీ2 (8.81 చ. మై)
సముద్రమట్టం నుండి ఎత్తు95 మీ (312 అ.)
జనాభా
(2011)[3][4]
 • మొత్తం59,725
 • సాంద్రత2,600/కి.మీ2 (6,800/చ. మై.)
Languages
 • Officialతెలుగు
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
PIN
522 647
వాహనాల నమోదు కోడ్AP-07
జాలస్థలిvinukonda.cdma.ap.gov.in


చరిత్ర[మార్చు]

వినుకొండ అన్న పేరు ఈ గ్రామంలో శ్రీరాముడు సీతాదేవి అపహరణ గురించి వినడం జరిగింది కాబట్టి విను అన్న క్రియను బట్టి ఆ పేరు వచ్చిందని లోకనిరుక్తి ఉంది. ఈ నిరుక్తిని అనుసరించి తెలుగు, సంస్కృత పండితులు ఈ పేరును సంస్కృతీకరించి శృతగిరి పురం (శృత= విను, గిరి= కొండ, పురం= పట్టణం/నగరం) అన్న పదం కల్పించారు.[5] [నోట్ 1]

మెగాలిథిక్ కట్టడాలు పట్టణం చుట్టుప్రక్కల కనుగొనబడ్డాయి.[ఉల్లేఖన అవసరం] 1000–1400 CE నాటి శిలాశాసనాలు చాలా పురాతన దేవాలయాలలో వున్నాయి. విష్ణుకుండినులనబడే రాజులు ఈ ప్రాంతాన్ని 1000 CE కాలంలో పరిపాలించారు.[ఉల్లేఖన అవసరం] మధ్యయుగంలో కొండపై కోట వుండేది. 1640 లో నిర్మించిన జామియా మసీదు మహమ్మదీయ పాలకుల గుర్తుగా మిగిలివుంది[6].

రవాణా సౌకర్యం[మార్చు]

Map

పట్టణం రోడ్ల మొత్తం నిడివి106.70 km (66.30 mi).[7] ఈ పట్టణం గుంటూరు -కర్నూలు -బళ్లారి ప్రధాన రహదారిపై వుంది. రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే లోని గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో గుంటూరు - గుంతకల్ రైలు మార్గం పై వుంది. మాచర్ల నాగార్జున సాగర్ మీదుగా హైదరాబాదు చేరుటకు దగ్గర మార్గం వుంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

 1. సాయి డిగ్రీ కళాశాల.
 2. గీతాంజలి జూనియర్ కళాశాల.
 3. గీతాంజలి విద్యా వికాస్ ఉన్నత పాఠశాల.
 4. నారాయణ పాఠశాల.
 5. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
 6. కృష్ణవేణి జూనియర్ కళాశాల.

పరిపాలన[మార్చు]

1952లో వినుకొండ శాసనసభ్యులుగా గెలుపొందిన పులుపుల వెంకటశివయ్య, 1953లో వినుకొండ పంచాయతీ సర్పంచిగా ఎన్నికైనాడు. రెండు పదవులలో 1955 దాకా ఉన్నాడు. సర్పంచిగా 1964 వరకూ పనిచేశాడు. 1962లో మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికలలో గెలుపొంది శాసనసభ్యులుగా 8 ఏళ్ళు పనిచేశాడు. సర్పంచిగా 11 ఏళ్ళు పనిచేశాడు. నిరాడంబరుడైన ఇతని స్మృతి చిహ్నంగా పట్టణం నడిబొడ్డున స్మారకస్థూపం ఏర్పాటుచేశారు.[1]

2005 మే 29 న మూడవ గ్రేడ్ పురపాలక పట్టణం గా గుర్తింపు పొందింది.2018 లో రెండవ గ్రేడ్ పురపాలక పట్టణం గా మార్చబడింది. పరిపాలన కమీషనర్ చే ప్రజలచే ఎన్నుకొనబడిన అధ్యక్షుని అజమాయిషీలో నిర్వహించబడుతుంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

వందేళ్ల చరిత్ర ఉన్న చెట్లు[మార్చు]

 • వినుకొండ పట్టణానికి అతి చేరువగా ఉన్న విఠంరాజుపల్లె వాటి పుట్టిల్లు. నరసరావుపేట రోడ్డు అంచున గుబురుగా కనిపిస్తాయి. చెరువు గట్టు మీద ఉండటంతో చల్లటి ఆహ్లాదాన్నిస్తుంది. గ్రామస్థులు, ప్రయాణికులు ఏ మాత్రం ఖాళీ ఉన్నా ఈ చెట్టు నీడలో సేదదీరుతారు. వేసవిలో ఖాళీ ఉండకుండా ఉంటారు.
 • వివాహానికి ముందు వెంకటేశ్వర స్వామికి ఎదురు నడిచే ప్రతి ఒక్కరూ మార్కాపురం రోడ్డులో ఉన్న రావిచెట్టుకు పూజలు చేయాల్సిందే. ఇక్కడ పూర్వకాలం నుంచి వేపచెట్టు, రావిచెట్టు కలిసి ఉండేవి. రెండింటినీ కలిపి పూజించి వాటికి పెళ్ళిచేస్తే కొత్త దంపతులకు దోషాలు అన్నీ పోతాయన్నది ఇక్కడి వారి నమ్మకం. ఇటీవల రోడ్డు విస్తరణలో వేపచెట్టు మాయమైంది. మిగిలిన ఒక్క చెట్టుకు ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి.
 • ఏనుగుపాలెం రోడ్డులో గోనుగుంట్లవారిపాలెం ఉంది. గతంలో ఇక్కడ ఊరు ఉండేది కాదు. హసన్నాయునిపాలెం, పెదకంచర్ల గ్రామాల నుంచి వలస వచ్చి ఇళ్లు కట్టుకున్నారు. ఆర్‌.అండ్‌.బి. రోడ్డు అంచున పెద్ద రావి చెట్టు ఉంది. పక్క గ్రామాల ప్రజలు అక్కడే బస్సు దిగి వెళ్లే వారు. .
 • పట్టణంలోని అంకాళమ్మ గుడి ముందు ఏపుగా ఎదిగిన రావిచెట్టుకు వందేళ్లు ఉన్నాయి. నరసరావుపేట జమీందారు కాలంలో నిర్మించిన ఈ గుడికి నిత్యం వచ్చే భక్తులు అమ్మవారితోపాటు చెట్టును కూడా పూజించడం విశేషం. 108 సార్లు ప్రదిక్షణం చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్నది ఇక్కడి వారి విశ్వాసం. చెట్టు కింద ఎత్త్తెన అరుగు వేశారు. అటు దానికి రక్షణ ఇటు ప్రజలకు ఉపయోగం ఒనగూరుతోంది.
 • ముళ్లమూరు బస్టాండులో శృంగారవనం ముందు మహాలక్ష్మమ్మ చెట్టు ఉంది. దీనికి నిత్య పూజలు చేస్తారు. ప్రారంభంలో వేప చెట్టు వరకు ఉండేది. ఇప్పుడు చుట్టుపక్కల వ్యాపారులు, ప్రజలు అరుగు కట్టించి అక్కడ అమ్మవారికి చిన్న గుడి కట్టించారు. ఏటా తొలిఏకాదశి నాడు చెట్టుకు విద్యుత్తు బల్బులు అలంకరిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

దేవాలయాలు[మార్చు]

 • శ్రీ ప్రసన్న రామలింగేశ్వరస్వామివారి ఆలయం:- కొండమీద ఉంది
 • శ్రీ మదమంచిపాటి వీరాంజనేయస్వామివారి ఆలయం:-వినుకొండకు ఏడు కి.మీ.దూరంలో, గుండ్లకమ్మ నదీ తీరాన కొలువైయున్న ఈ స్వామివారిని భక్తులు మహిమాన్వితుడిగా కొలుస్తున్నారు. ప్రతి సంవత్సరం చైత్ర బహుళ పంచమినాడు, స్వామివారి తిరునాళ్ళను వైభవంగా నిర్వహించుచున్నారు. ఈ తిరునాళ్ళకు భక్తులు వేలాదిగా తరలి వచ్చెదరు. ఈ తిరునాళ్ళ సందర్భంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసెదరు. ఈ తిరునాళ్ళకు ఆర్.టి.సి. వారు ప్రత్యేక బస్సులను నడిపెదరు.[3]

ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

ప్రముఖులు[మార్చు]

విశేషాలు[మార్చు]

వినుకొండ పాలు, స్వీట్స్[మార్చు]

హైదరాబాద్‌ పుల్లారెడ్డి స్వీట్లంటే రాష్ట్రంలో ఎంత గుర్తింపు ఉందో వినుకొండ పాలకు, స్వీట్స్ కు మార్కెట్లో అంత గిరాకీ ఉంది. నాణ్యత, రుచిలో ఈ పాలకు పెట్టింది పేరు. వినుకొండ ప్రాంతం పాలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. మెట్ట ప్రాంతం కావడంతో పాలు నాణ్యంగా, అత్యంత ప్రత్యేకంగా ఉంటాయని పశు వైద్యాధికారులు నిర్ధారించారు. పాలలో వెన్న, ఇతర పదార్థాలు (ఎస్‌.ఎన్‌.ఎఫ్‌.) అత్యధికంగా ఉండటంతో 90 శాతం డెయిరీలు ఇక్కడి పాలను సేకరించేందుకు మక్కువ చూపుతున్నాయి. ఇక్కడి పాలు గది ఉష్ణోగ్రతలో ఎక్కువ సేపు నిల్వ ఉంటాయి. వినుకొండలో ప్రసిద్ధి చెందిన సంగం డెయిరీ, హెరిటేజ్‌, తిరుమల, జెర్సీతోపాటు మొత్తం ఆరు పాల శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.అన్ని గ్రామాల్లో కలిపి 30వేల మంది పాలు విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు.

నోట్స్[మార్చు]

 1. వినుకొండకు చెందిన జాషువా కవితలో "రఘురామ వీరవరుడు పృథివి జాతాపహరణంబు విన్నచోటు శృతగిరి పురంబు నాది" అని ఈ ఊరి గురించి చెప్పుకోవడంలో ఈ లోకనిరుక్తి, సంస్కృతీకరించిన గ్రామనామం రెండూ కనిపిస్తాయి.

మూలాలు[మార్చు]

 1. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 2. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 3. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 4. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 5. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 6. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 7. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వినుకొండ&oldid=2990087" నుండి వెలికితీశారు