అంకణము (భూమి కొలత)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అంకణము అనేది భూవైశాల్యాన్ని కొలవడానికి వాడే ఒక దేశీయ ప్రమాణం (ఎకరం లాగా). ఇది ఎక్కువగా ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరూ, తిరుపతీ ప్రాంతాల్లో, అలాగే కర్ణాటకలోని అనేకల్ (Anekal (en)), బెంగళూరు ప్రాంతాలలో వాడబడుతుంది. ఈ కొలతతో భూమి వెలను తేలిగ్గా అంచనా వెయ్యగలగడము బహుశ దీని వాడకానికి కారణమయ్యుండొచ్చు .

వ్యుత్పత్తీ, నిఘంటు నిర్వచనాలు[మార్చు]

అంకణము అనే పదము అడుగు/అంగ పదాల నుండి వచ్చింది.

  • రెవ్. ఫెర్డినాండ్ కిట్టెల్ (Ferdinand kittel (en)) తన కన్నడ-ఆంగ్ల నిఘంటువులో అంకణాన్ని రెండు స్తంభాల మధ్యన లేదా దూలాల మధ్య ఉండే చోటుగా నిర్వచించారు.[1]
  • కిట్టెల్ నిఘంటువును మూలముగా చూపుతూ బ్రౌణ్య నిఘంటువులో కూడా ఇదే అర్థము ఇవ్వబడింది. అదనంగా దీని ఆంగ్ల సమానార్థకముగా intercolumniation (en) ఇవ్వబడింది.[2]
  • హిందూ ఆలయ నిర్మాణ శాస్త్రములో అంకణమును అనేది రెండు స్తంభాల మధ్య దూరంగా, అలాగే స్తంభానికీ మరొక (గోడకూ) మధ్య దూరంగా చెప్పబడింది. కనుక ఇది ఒక కచ్చితమైన ప్రమాణము కాదు

ఇతర కొలమానాలతో పోలిక[మార్చు]

నెల్లూరూ, ఇతర ప్రాంతాల్లో ఒక అంకణము అంటే 72 sq ft (6.7 m2). తిరుపతిలో మాత్రము ఒక అంకణము అంటే 36 sq ft (3.3 m2). దీన్నే తిరుపతి అంకణము అని కూడా అంటారు.

1 ఎకరం = 100 సెంట్లు = 0.405 హెక్టార్లు = 605 అంకణాలు

1 సెంటు = 6.05 అంకణాలు = 48 చ.గజాలు

1 అంకణము = 8 చదరపు. గజాలు = 72 చదరపు. అడుగులు

1 తిరుపతి అంకణము = 4 చ.గజాలు = 36 చ. అడుగులు (తిరుపతిలో)

1 చదరపు. గజము= 9 చదరపు. అడుగులు.

1 గజం = 3 అడుగులు.

మూలాలు[మార్చు]

  1. Kannada-English Dictionary by Rev. F. Kittel, page no .7.
  2. Brown, Charles Philip, A Telugu-English dictionary, new ed., thoroughly rev. and brought up to date ... 2nd ed. Madras: Promoting Christian Knowledge, 1903. page 2

వెలుపలి లంకెలు[మార్చు]

  • [1] కిట్టెల్ కన్నడ-ఆంగ్ల నిఘంటువులో అంకణము.
  • [2] బ్రౌణ్య నిఘంటువులో అంకణము