అచ్యుతానంత గోవింద శతకములు
అచ్యుతానంత గోవింద శతకములు అద్దంకి తిరుమల సమయోద్దండకోలాహల లక్ష్మీనరసింహకుమార తిరువేంగడతాత దేశికాచార్యుల వారిచే రచించబడినవి. అచ్యుతానంత గోవిందా అనే మకుటంతో ఈ పద్యాలు రచించాడు. ఇవి శ్రీవైష్ణవ పత్రిక లో ప్రచురించబడి; తర్వాత చీరాలలోని ది సన్ ప్రింటింగ్ ప్రెస్ లో 1935లో ముద్రించబడినది.[1]
ఇందులోని స్తోత్రాలు, శతకాలు
[మార్చు]- శ్రీనృసింహ నవరత్నమాలికా స్తోత్రము
- దశావతార స్తవము
- అచ్యుత శతకము
- అనంత శతకము
- గోవింద శతకము
కొన్ని పద్యాలు
[మార్చు]శ్రీనృసింహ నవరత్నమాలికా స్తోత్రము
[మార్చు]సీ. బలిదైత్యు వాకిట బడిగాపువై ప్రోవ
నేర్తువు మము బ్రోవ నేరవొక్కొ
రక్షోధిపుని జీరి ప్రహ్లాదు గృప బ్రోవ
నేర్తువు మము బ్రోవ నేరవొక్కొ
అన్నంబు రహిమెక్కి యవ్విదురుని బ్రోవ
నేర్తువు మము బ్రోవ నేరవొక్కొ
అన్నింటి కీవయై యల పాండవుల బ్రోవ
నేర్తువు మము బ్రోవ నేరవొక్కొ
తే. ఉత్తరా గర్భమధ్య మం దున్న శిశువు
నేరుతువు ప్రోవ మము బ్రోవ నేరవొక్కొ
నేటిదా? సంశ్రియుల బ్రోచు మేటి బిరుదు
నీరు నెమ్మది పరయమో నీరజాక్ష
అచ్యుత శతకము
[మార్చు]చం.సిరియును భూమి నీళలును జేరువజేరి భజింపుచుంఛనొ
క్కరి తెనుజుంబనాంచితసు ఖంబున వేరొక తెన్ భుజాగ్రసం
గ రసరతిన్ మరొక్కతెను గారవమొప్ప గపోల పాలికా
కరపరిమర్శనిర్వృతిని గన్కని దేల్చెదుగాడెయచ్యుతా!
మూలాలు
[మార్చు]- ↑ అద్దంకి తిరుమల తిరువేంగడ తాతదేశికాచార్యులు (1935). అచ్యుతానంత గోవింద శతకములు.