Jump to content

అమర్‌నాథ్

వికీపీడియా నుండి

అమర్నాథ్ గుహ హిందువుల పుణ్యక్షేత్రం. ఈ గుడి భారత్ లోని  జమ్మూ కాశ్మీర్ లో ఉంది. హిమాలయాల్లో దక్షిణ కశ్మీర్‌ కొండల్లో 3,888 మీటర్ల ఎత్తులో జమ్మూ కాశ్మీర్ రాజధానికి 141 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి పహల్ గాం గ్రామం నుంచి వెళ్ళాలి. హిందువులకు ఈ పుణ్యక్షేత్రం అతి పవిత్రమైనది. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు వారు.[1][2] ఈ గుహ చుట్టూ ఎత్తైన మంచుకొండలు ఉంటాయి. వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడే ఉంటాయి అమర్నాథ్ కొండలు. ఆ కాలంలోనే వేలల్లో భక్తులు కొండలు ఎక్కి అమర్నాథ్ గుహను చేరుకుంటారు. ఈ గుహలో ఉండే శివుడు మంచు రూపంలో ఉంటాడు. ఈ మంచు శివలింగాన్ని చూసేందుకు ఎన్నో సవాళ్ళతో కూడిన ప్రయాణం చేస్తారు భక్తులు.

అపురూపమైన మంచు శివలింగం

[మార్చు]
అమర్నాథ్ గుహలోని మంచు శివలింగం

40మీటర్ల ఎత్తుండే అమర్నాథ్ గుహ లోపల నీటి చుక్కలతో నిలువుగా లింగాకారంలో మంచు గడ్డ కడుతుంది.[3] పంచ భూతాల రూపాల్లో శివుడు ఉంటాడనే హిందువుల నమ్మకం. అందుకే ఇక్కడ శివుడు జలరూపంలో ఉన్నాడని భక్తులు అంత శ్రమకోర్చీ ఈ పుణ్యక్షేత్రానికి వస్తారు. మే నుంచి ఆగస్టు వరకు హిమాలయాలలో మంచు కరగడం  వల్ల ఈ పుణ్యక్షేత్రం మంచు నుంచి బయటకు వచ్చి, సందర్శనకు వీలుగా ఉంటుంది.[4]  ఈ లింగం వేసవిలో చంద్రుని కళల ప్రకారం పెరుగుతూ,  తగ్గుతూ ఉంటుందని విశ్వసిస్తారు హిందువులు.[5]

హిందూ పురాణాల ప్రకారం తన భార్య పార్వతీ దేవి కి ఈ గుహ  దగ్గరే జీవితం గురించి వివరించాడని ప్రతీతి.[6][7] ఇక్కడ ఉండే మరో రెండు మంచు ఆకారాలు పార్వతీదేవి, వినాయకునిగా భక్తులు కొలుస్తారు.

ఈ గుహలో ఏర్పడే మంచు లింగాన్ని దర్శించేందుకే ప్రతీ సంవత్సరం  అమర్నాథ్ యాత్ర చేస్తుంటారు భక్తులు.

చరిత్ర

[మార్చు]

300 బిసికి చెందిన రాజు ఆర్యరాజా ఈ లింగాన్ని అర్చించినట్టు చెబుతారు. కాశ్మీర రాజుల కథలను వివరించే రాజతరింగిణి పుస్తకంలో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. రాణి సూర్యమతి అమరనాథ్ స్వామికి త్రిశూలం, బాణలింగాలు సమర్పించినట్టు ఈ పుస్తకంలో వివరించారు.[8]  ప్రజయభట్టుడు రాసిన రాజవ్లిపతకాలో కూడా అమర్నాథ్ యాత్ర గురించి వివరించారు. ప్రాచీన గ్రంధాల్లో ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి ఇంకా ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి.

అమర్నాథ్ గుహ ఆవిష్కరణ

[మార్చు]

మధ్యయుగంలో ఈ క్షేత్రం గురించి మర్చిపోయినట్టూ, తిరిగి ఒక గొర్రెల కాపరి 15వ శతాబ్దం లో తిరిగి కనుక్కున్నట్టు ఒక నమ్మకం.[8]

ఇవీ చదవండి

[మార్చు]

References

[మార్చు]
  1. "New shrine on Amarnath route". The Hindu. Chennai, India. 30 May 2005. Archived from the original on 18 జూన్ 2007. Retrieved 7 ఏప్రిల్ 2011.
  2. "The pilgrimage to Amarnath". BBC News. 6 August 2002. Retrieved 5 May 2012.
  3. "Stalactites and Stalagmites - Cave, Water, Caves, and Growth - JRank Articles". Science.jrank.org. Retrieved 2013-04-15.
  4. "Amarnathji Yatra - a journey into faith". Official Web Site of Jammu and Kashmir Tourism. Archived from the original on 2006-06-16. Retrieved 2011-04-07.
  5. Ortner, Jon.
  6. Page 84, The Holy Himalayas By Shantha N. Nair
  7. "Amarnath Cave - The legend". Bhole Bhandari Charitable Trust.
  8. 8.0 8.1 "Amarnath Yatra: In Search Of Salvation". Shriamarnathyatra.net. Archived from the original on 2013-06-17. Retrieved 2013-04-15.