అశ్విని (రుద్ర)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అశ్విని
జననం
రుద్ర

జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లుఆర్.వి. అశ్విని
వృత్తినటి, నృత్యకారిణి
క్రియాశీల సంవత్సరాలు1991-ప్రస్తుతం

అశ్విని భారతీయ చలనచిత్ర, టివి నటి. తెలుగు, తమిళ, మళయాల సినిమాల్లో, సీరియళ్ళలో నటించిన అశ్వినికి, ఈటీవీలో వచ్చిన అంతరంగాలు, కళంకిత సీరియళ్ళతో మంచి గుర్తింపు వచ్చింది.[1] సింగపూర్ లో సెటిల్ అయిన అశ్విని ప్రస్తుతం అక్కడి సీరియళ్ళలో నటిస్తోంది.

జీవిత విషయాలు[మార్చు]

అశ్విని కేరళలోని హిందూ కుటుంబంలో జన్మించింది. పాఠశాల చివరి సంవత్సరంలో తన స్నేహితురాళ్ళతో కలిసి మలయాళ పత్రిక కోసం మోడలింగ్ చేసింది.

సినిమారంగం[మార్చు]

1991లో తమిళ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించిన పుదు నెల్లు పుదు నాతు సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[2] తరువాత తమిళ, మళయాల చిత్రాలు ఎక్కువగా చేసింది. తెలుగులో 1995లో జయసుధతో ఆంటీ సినిమా, 1997లో చిరంజీవి చెల్లెలిగా హిట్లర్ సినిమా, శ్రీహరితో కలిసి 1999లో పోలీస్, 2000లో గణపతి చిత్రాలలో నటించింది. 1991 నుండి 2000 సంవత్సరం వరకు దాదాపు 25 చిత్రాలలో నటించింది.[3]

మణిచిత్రతాజు (1993), కిజక్కు చీమాయిలే (1993), ధ్రువం (1993), పిడక్కోజి కూవున్న నూట్టాండు (1994), కుడుంబకోదతి (1996) చిత్రాలలోని పాత్రలతో గుర్తింపుపొందింది.[4][2]

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
1991 పుదు నెల్లు పుదు నాతు మరికోజుందు తమిళం తొలిచిత్రం
1991 పోస్ట్ బాక్స్ నెం. 27 విజి మళయాలం
1992 తూరతు సొంతం ధనలక్ష్మీ తమిళం
1992 ఆయుష్కాలం సుజాత మళయాలం
1992 కౌరవర్ శ్రీదేవి మళయాలం
1993 మణిచిత్రతాజు అల్లి మళయాలం
1993 కిజక్కు చీమాయిలే పేచిi తమిళం
1993 బటర్ ఫ్లైస్ మాయ దాస్ మళయాలం
1993 ధ్రువం మాయ మళయాలం
1993 పిడక్కోజి కూవున్న నూట్టాండు వసుంధర మళయాలం
1994 పవిత్రమ్ రీటా మళయాలం
1994 పుదుపట్టి పొన్నుతాయి రుక్కు తమిళం
1994 ముతల్ పయాణం రాధ తమిళం
1995 ససినాస్ డింగడి డింగూస్ మళయాలం
1995 ఆంటీ కానీ తెలుగు
1996 మళయాల మాసం చింగం ఓనిను రేణు మళయాలం
1996 కుడుంబకోదతి పౌర్ణమి మళయాలం
1997 రామన్ అబ్దుల్లా అయిశా తమిళం
1997 పేరియా తంబి మీనా తమిళం
1997 హిట్లర్ శారద తెలుగు
1997 పెళ్ళి చేసుకుందాం రాధిక తెలుగు
1997 నజర్ పింకీ హిందీ
1999 కల్లాజహర్ సైరా తమిళం
1999 పోలీస్ సుజాత తెలుగు
2000 ఎన్నవాలే సీత తమిళం
2000 గణపతి తమిళం

టివిరంగం[మార్చు]

తెలుగు
  • అమ్మకానికో అమ్మాయి
  • అంతర్నేత్రం
  • అంతరంగాలు (ఈటీవి)
  • కళంకిత (ఈటీవి)
  • తొలి రోజులు
తమిళం
సంవత్సరం సీరియల్ పేరు పాత్ర పేరు ఛానల్
1999 చిన్ని చిన్ని ఆశై మక్కల్ టీవి
2001 టెక్ ఇట్ ఈజీ వాజ్కై దుర్గ సన్ టీవి
2005–2007 నిమ్మతి ఉంగల్ ఛాయిస్ నిర్మల
2017 అతియాయం నందిని మీడియా క్రాప్ వసంతం
మసాలా
2019–ప్రస్తుతం మగరాసి గోమతి సన్ టీవి
మళయాలం
సంవత్సరం సీరియల్ పేరు పాత్ర పేరు ఛానల్
2005 కాదమట్టుతు కథనార్ మైథిలి ఏసియానెట్

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-10-25. Retrieved 2020-06-14.
  2. 2.0 2.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-03-02. Retrieved 2020-06-14.
  3. చాయ్ పకోడి, సినిమాలు (4 May 2019). "నటి అశ్విని గుర్తు ఉందా... ఇప్పుడు ఎలా ఉందో చూస్తే గుర్తు పట్టలేరు". www.chaipakodi.com. Archived from the original on 14 జూన్ 2020. Retrieved 14 June 2020.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-14. Retrieved 2020-06-14.

ఇతర లంకెలు[మార్చు]