ఆందోల్-జోగిపేట పురపాలకసంఘం
ఆందోల్-జోగిపేట | |
---|---|
Coordinates: 17°50′N 78°04′E / 17.833°N 78.067°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి |
విస్తీర్ణం | |
• Total | 21.61 కి.మీ2 (8.34 చ. మై) |
జనాభా (2011)[2] | |
• Total | 18,494 |
• జనసాంద్రత | 860/కి.మీ2 (2,200/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 502270 |
Vehicle registration | టిఎస్ |
ఆందోల్-జోగిపేట పరపాలక సంఘం, సంగారెడ్డి జిల్లా చెందిన పురపాలకసంఘం. రెండు పట్టణాలను కలిపి పురపాలకసంఘంగా ఏర్పాటుచేయడంతో ఆందోల్-జోగిపేట పేరుతో పిలువబడుతుంది. 2020 జూలైలో ఇది రెవెన్యూ డివిజన్‌గా మారింది.[3] ఈ పట్టణం తెలంగాణా శాసనసభలోని ఆందోల్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.
చరిత్ర
[మార్చు]1955 నుంచి 1965 వరకు జోగిపేట పురపాలక సంఘంగా ఉండేది. 1965లో రెండీంటిని కలిపి పంచాయతీగా ఏర్పాటుచేశారు. ఈ రెండు పట్టణాలు ప్రక్కప్రక్కనే ఉన్నాయి. 1998లో రెండింటినీ విడదీసి వేర్వేరు పంచాయతీలుగా ఏర్పాటుచేశారు. ఆదాయం విషయంలో ఈ రెండింటి మధ్యన తగాదాలు జరుగుతుండేవి. 2013లో ఈ రెండు పట్టణాలను కలిపి నగర పంచాయతీగా ఏర్పాటుచేశారు. జోగిపేటకు ఐదుగురు, ఆందోలుకు ఎనిమిది సర్పంచులు ఎన్నికయ్యారు. ఇది ఆందోల్, జోగిపేట్ అనే రెండు పట్టణాల సమ్మేళనం. ఇది 2013లో నగర పంచాయతీగా ఏర్పడి, 2018లో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయబడింది.[4]
జనాభా గణాంకాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ 18,496 జనాభా ఉంది. దీని అధికార పరిధి 21.61 కి.మీ2 (8.34 చ. మై.) విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
2014 ఎన్నికలు
[మార్చు]నగర పంచాయతీగా ఏర్పాటైన పిదప తొలిసారిగా 2014 మార్చి 30న ఎన్నికలు జరిగాయి. 2014 మార్చి నాటికి ఈ నగరపంచాయతి పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. వార్డులలో ఎన్నికైన కౌన్సిలర్లు పరోక్ష పద్ధతిలో చైర్‌పర్సన్‌ను ఎన్నుకుంటారు.
ఇతర వివరాలు
[మార్చు]సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన 1930లో ఆంధ్ర మహాసభ మొదటి సదస్సు జోగిపేటలో జరిగింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 2016-06-15. Retrieved 28 June 2016.
- ↑ "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 12, 44. Retrieved 11 June 2016.
- ↑ "Andole-Jogipet is 74th revenue division in Telangana: Harish". Telangana Today. Retrieved 2021-03-14.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Mahesh, Koride (25 March 2018). "21 nagar panchayats now elevated as municipalities | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-03-14.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Sundarayya, Puccalapalli (1972). Telangana People's Struggle and Its Lessons (in ఇంగ్లీష్).