Coordinates: 15°52′17.3″N 78°07′22.8″E / 15.871472°N 78.123000°E / 15.871472; 78.123000

ఆలంపూర్ పాపనాశి దేవాలయాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆలంపూర్ పాపనాశి దేవాలయాలు
ఆలంపూర్ పాపనాశి దేవాలయాల సమూహం
మతం
అనుబంధంహిందూ
జిల్లాజోగులాంబ జిల్లా
దైవంశివుడు, దేవి, విష్టువు, ఇతర దేవతలు
ప్రదేశం
ప్రదేశంఆలంపూర్
రాష్ట్రంతెలంగాణ
దేశంభారతదేశం
ఆలంపూర్ పాపనాశి దేవాలయాలు is located in India
ఆలంపూర్ పాపనాశి దేవాలయాలు
తెలంగాణలో దేవాలయ ప్రాంతం
ఆలంపూర్ పాపనాశి దేవాలయాలు is located in Telangana
ఆలంపూర్ పాపనాశి దేవాలయాలు
ఆలంపూర్ పాపనాశి దేవాలయాలు (Telangana)
భౌగోళిక అంశాలు15°52′17.3″N 78°07′22.8″E / 15.871472°N 78.123000°E / 15.871472; 78.123000
వాస్తుశాస్త్రం.
శైలినగార
పూర్తైనది9వ-11వ శతాబ్ధం
దేవాలయాలు23

ఆలంపూర్ పాపనాశి దేవాలయాలు, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, ఆలంపూర్ సమీపంలోని పాపనాశంలో ఉన్న దేవాలయాల సమూహం. ఇక్కడ ఒకేచోట ఇరవైమూడు దేవాలయాలు ఉన్నాయి. 9, 11వ శతాబ్దాల మధ్యకాలంలో ఈ దేవాలయాలు నిర్మించబడ్డాయి. వీటికి సమీపంలో తుంగభద్ర నది, కృష్ణ నది కలిసే ప్రదేశం ఉంది.[1][2][3] ఇవి రాష్ట్రకూటులు, తరువాత చాళుక్యులు ద్వారా కొన్ని శతాబ్దాల తరువాత పూర్తిచేయబడ్డాయి.

చరిత్ర[మార్చు]

నవబ్రహ్మ దేవాలయాలతో కలిపి, పాపనాసి సమూహం శైవ మతంలోని కాలముఖ, పశుపత విభాగానికి సంబంధించినది. ఈ ప్రాంతంలోని అదనపు దేవాలయాలు ఈ ప్రదేశాన్ని శక్తిమతం పీఠంగా మార్చాయి. ఇక్కడి దేవాలయాలన్నీ వైష్ణవ ఇతివృత్తాలను కలిగి ఉన్నాయి. హిందూ గ్రంథాలలో వివరించబడ్డాయి. బ్రహ్మేశ్వర స్థాన తీర్థం (క్షేత్రం) గా ఏర్పడ్డిన ఈ ప్రాంతం 14వ, 15వ శతాబ్దాలలో ఢిల్లీ సుల్తానేట్ దండయాత్రలు, ముస్లిం-హిందూ సంఘర్షణల సమయంలో కొంతభాగం నాశనమయ్యాయి.[4] కొన్ని చారిత్రాత్మక హిందూ, బౌద్ధ సాహిత్యం కర్నూలు సమీపంలోని ఈ ప్రదేశాన్ని శ్రీశైలం లేదా శ్రీపర్వత అని సూచిస్తుంది.[5][6] డేవిడ్ వైట్ ప్రకారం, 12వ శతాబ్దంలో ఈ సైట్ కూడా శైవమత శాఖ అయిన విరశైవ లేదా లింగాయత్‌లతో ముడిపడి ఉందని తెలుస్తోంది.[6]

నిర్మాణం[మార్చు]

పాపనాసి దేవాలయాలు చతురస్ర ప్రణాళికతో నాగర నిర్మాణాన్ని కలిగివున్నాయి.[1][3] ఈ దేవాలయాల్లో పాపనాశీశ్వర దేవాలయం పెద్దదిగా ఉంటుంది. చతురస్రాకారంగా, బ్రహ్మచ్చంద- గ్రివ శిఖరంతో కూడిన ఒక ఫమ్సానా సూపర్‌స్ట్రక్చర్, లోపల బయటి గోడలు, లోపల రంగమండపం మొదలైనవి ఉన్నాయి. శివుని నృత్యం చేయడానికి ఈ దేవాలయం అంకితం చేయబడింది.[1]

పరిశోధనలు[మార్చు]

పాపనాసి దేవాలయ సమూహం అసలు ప్రదేశంలో లేదని 1980 తర్వాత భారత పురాతత్వ సర్వే సంస్థ వారిచే శిథిలాల నుండి తరలించబడిందని, పునరుద్ధరించబడిందని చరిత్రకారుల అభిప్రాయం. శ్రీశైలం హైడ్రోఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్ నుండి కాపాడడానికి ఉన్నత ప్రదేశాలకు తరలించి, బ్యారేజీని నిర్మించి వాటిని మరింత నష్టం నుండి కాపాడారు.[3] దేవాలయాల మార్పిడితో సంబంధం ఉన్న త్రవ్వకాలలో ఆలయ నిర్మాణ ఆచారాలకు సంబంధించిన ఆధారాలు లభించాయి.[7]

ప్రదేశం[మార్చు]

తుంగభద్ర, కృష్ణా నదుల సంగమమైన ఆలంపూర్ గ్రామంలో ఈ దేవాలయాలు ఉన్నాయి. హైదరాబాద్‌కు దక్షిణాన 215 కి.మీ (134 మైళ్లు) దూరంలో, నాలుగు లైన్ల 44వ జాతీయ రహదారి 44 (ఆసియన్ హైవే 43), హంపి స్మారక కట్టడాలకు ఈశాన్యం వైపున దాదాపు 240 కి.మీ (150 మైళ్లు) దూరంలో, బాదామికి తూర్పున 325 కి.మీ (202 మైళ్లు) దూరంలో ఉన్నాయి. 7వ శతాబ్దంలో దీనిని నిర్మించిన రాజుల రాజధానిగా ఉండేది.[3]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Harsh K. Gupta (2000). Deccan Heritage. Universities Press. pp. 177–181. ISBN 978-81-7371-285-2.
  2. Odile Divakaran (1971), Les temples d'Ālampur et de ses environs au temps des Cāḷukya de Bādāmi, Arts Asiatiques, Vol. 24, No. 1, pp. 51-101
  3. 3.0 3.1 3.2 3.3 George Michell (2013). Southern India: A Guide to Monuments Sites & Museums. Roli Books. pp. 318–321. ISBN 978-81-7436-903-1.
  4. Himanshu Prabha Ray (2010). Archaeology and Text: The Temple in South Asia. Oxford University Press. pp. 32–33. ISBN 978-0-19-806096-3.
  5. David N. Lorenzen (1972). The Kāpālikas and Kālāmukhas: Two Lost Śaivite Sects. University of California Press. pp. 51–52. ISBN 978-0-520-01842-6.
  6. 6.0 6.1 David Gordon White (2012). The Alchemical Body: Siddha Traditions in Medieval India. University of Chicago Press. pp. 110–111, 238. ISBN 978-0-226-14934-9.
  7. MS Nagaraja Rao (1985), Indian Archaeology: A Review Archived 20 సెప్టెంబరు 2010 at the Wayback Machine, Vol. 1982-83, ASI, pages 9-13

బయటి లింకులు[మార్చు]