ఆల్విన్ కాలనీ
ఆల్విన్ కాలనీ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°29′N 78°25′E / 17.483°N 78.417°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 072 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
ఆల్విన్ కాలనీ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక పొరుగు ప్రాంతం.[1] ఇది హైదరాబాదు నగరానికి వాయవ్యంలో ఉన్న కూకట్‌పల్లికి సమీపంలో ఉంది. ఈ కాలనీ 1వ,[2] 2వ[3] ఫేజ్ లుగా విభజించారు. హైదరాబాదు ఆల్విన్ కంపెనీ తన ఉద్యోగుల కోసం 1980లలో ఈ కాలనీ నిర్మించింది.
2015 హైదరాబాదు మహానగరపాలక సంస్థ (జిహెచ్ఎంసీ) సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఆల్విన్ కాలనీ, కూకట్‌పల్లి జోన్ పరిధిలోని కొత్త కార్పోరేషన్ వార్డుగా ఏర్పడింది.
చరిత్ర
[మార్చు]ఆల్విన్ హౌసింగ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ అభివృద్ధి చేయబడింది. ఇందులో ఎ-టైప్, బి-టైప్, సి-టైప్ వంటి రకాలతో గృహాలను నిర్మించారు. ఎ-టైప్‌లో 120 గజాల భూమి ఉండగా, బి-టైప్ & సి-టైప్ క్వార్టర్స్‌లో 96 గజాలు ఉన్నాయి. లాటరీ పద్ధతి ఆధారంగా ఇవి కేటాయించబడ్డాయి. నిర్మాణం తరువాత, సొసైటీ దశ -1లో 600 ప్లాట్లను రూపొందించి, వీటిని 1987లో లాటరీ ద్వారా సభ్యులకు కేటాయించారు. 2011లో మంజీరా నీరు, విద్యుత్, రవాణా, దేవాలయాలు, వాణిజ్య సముదాయం, కళ్యాణ మండపం వంటి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా సొసైటీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఆల్విన్ కాలనీలో 1000 కంటే ఎక్కువ సొంత గృహాలు ఉన్నాయి.
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.
- 10ఎ/ఎస్: సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుకు వెళుతుంది (ఎర్రగడ్డ మీదుగా)
- 185ఎస్: కోఠి, సిబిఎస్‌కు వెళుతుంది (ఎర్రగడ్డ మీదుగా)
- 30ఎ: సికింద్రాబాదుకు వెళుతుంది (జగద్గిరిగుట్ట, బాలానగర్ మీదుగా)
- 19కె/ఎ: మెహిదీపట్నం వెళ్తుంది (కూకట్‌పల్లి, అమీర్‌పేట, బంజారా హిల్స్ మీదుగా)
- 10కె/జె: జగద్గిరిగుట్ట నుండి సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను వరకు (ఆల్విన్ కాలనీ, ఎర్రగడ్డ మీదుగా),
భరత్ నగర్ రైల్వే స్టేషను, బోరబండ రైల్వే స్టేషను ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.
సమీప ప్రాంతాలు
[మార్చు]వివేకానంద నగర్ కాలనీ, వెంకట్పపయ్య నగర్, సాయినగర్, కమల ప్రసన్న నగర్, మాధవరం నగర్, తులసి నగర్, భాగ్యనగర్ కాలనీ, జగద్గిరిగుట్ట, ఎల్లమ్మ బండ, వెంకటేశ్వర నగర్, కూకట్ పల్లి మొదలైనవి ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Allwyn Colony, Kukatpally Locality". www.onefivenine.com. Retrieved 2021-01-23.
- ↑ "1st Phase Allwyn Colony, Allwyn Colony, Kukatpally Locality". www.onefivenine.com. Retrieved 2021-01-23.
- ↑ "2nd Phase, Allwyn Colony, Kukatpally Locality". www.onefivenine.com. Retrieved 2021-01-23.