ఉషారాణి భాటియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉషారాణి భాటియా
జననంఉషారాణి భాటియా
చెన్నై
మరణండిసెంబరు 28, 2020
ఢిల్లీ
ప్రసిద్ధితెలుగు కథా రచయిత్రి, స్త్రీవాద రచయిత
మతంహిందూ

ఉషారాణి భాటియా, ఒక తెలుగు రచయిత్రి. ఈమె పలు పేరు పొందిన రచనలు చేశారు.[1]

నేపధ్యం[మార్చు]

ఈమె తల్లి దండ్రులు కూడా కళలకు సంబంధించినవారె. ఈమె పెదనాన్న గుడిపాటి వెంకట చలం ఒక పేరుగల తెలుగు రచయిత. తల్లి నటి, రచయిత్రి కొమ్మూరి పద్మావతీదేవి. ఈ దంపతులకు ఉషారాణి భాటియా చిన్న కుమార్తె. ఈమె బంధుత్వ రీత్యా కొడవటిగంటి కుటుంబరావుకు మరదలు అవుతారు.[1]

బాల్యం-విద్యాభ్యాసం[మార్చు]

ఈవిడ బాల్యం అంతా చెన్నైలో గడిచింది. అక్కడే న్యాయ విద్యను అభ్యసించింది. ఆంధ్రపత్రిక లో కొంతకాలం పని చేసి, దుర్గాబాయి దేశ్‌ముఖ్ సలహా మేరకు ఢిల్లీలోని సెంట్రల్‌ సోషల్‌ వెల్‌ఫేర్‌ బోర్డు వారి ఆంగ్లపత్రిక సంపాదకవర్గంలో చేరింది. ఆ తరువాత నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా తెలుగుశాఖకు, తొలి ఎడిటర్‌గా 1990 వరకు పదవీబాధ్యతలు నిర్వహించింది.[1]

రచనా వ్యాసాంగం[మార్చు]

నవలలు[మార్చు]

  • చిన్నారి
  • తండ్రి కూతురు
  • ప్రతీకారం
  • అరుణోదయం

కథలు[మార్చు]

  • క్షణం శాంతి లేదు
  • దేవుడి ఇల్లు
  • నిర్ణయం
  • ఆ లోకం నుంచీ ఆహ్వానం
  • ఆరోజు సాయంత్రం
  • తెల్లవారింది
  • ఓ ముగ్గురి కథ
  • ఎవరైనా చెప్పండి

మరణం[మార్చు]

ఉషారాణి 2020, డిసెంబరు 28న ఢిల్లీలోని స్వగృహంలో మరణించింది.[2]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్ (2 January 2021). "ఉషారాణి భాటియా: సాహిత్యమే వృత్తీ,ప్రవృత్తీ". www.andhrajyothy.com. విహారి. Archived from the original on 2 January 2021. Retrieved 2 January 2021.
  2. ఆంధ్రజ్యోతి, హైదరాబాదు (29 December 2020). "నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌..తొలి తెలుగు ఎడిటర్‌..ఉషారాణి కన్నుమూత". www.andhrajyothy.com. Archived from the original on 2 January 2021. Retrieved 2 January 2021.

బయటి లంకెలు[మార్చు]