Jump to content

ఏలేటి మహేశ్వర్ రెడ్డి

వికీపీడియా నుండి
ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023 - ప్రస్తుతం
ముందు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నియోజకవర్గం నిర్మల్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 - 2014
ముందు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
తరువాత అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నియోజకవర్గం నిర్మల్

వ్యక్తిగత వివరాలు

జననం సెప్టెంబర్ 21
గాజుల్‌పేట్, నిర్మల్ మండలం, నిర్మల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ బీజేపీ
ఇతర రాజకీయ పార్టీలు ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు పద్మనాభ రెడ్డి
జీవిత భాగస్వామి కవిత
వృత్తి రాజకీయ నాయకుడు

ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2023 ఎన్నికలలో నిర్మల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ఏలేటి మహేశ్వర్ రెడ్డి 1968లో తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, నిర్మల్ మండలం, గాజుల్‌పేట్ గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి 1990లో బిఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

మహేశ్వర్ రెడ్డి 2006లో మహేశ్వర ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు ప్రారంభించి నిర్మల్ నియోజకవర్గం అంతా పాదయాత్రలు చేపట్టి ప్రజలకు దగ్గరై 2009లో ప్రజా రాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున నిర్మల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పై 2545 ఓట్లతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాడు.

ఏలేటి మహేశ్వర్ రెడ్డి అనంతరం ఆదిలాబాద్‌ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఆయన 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతిలో 9271 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[1] ఆయన 2015లో ఆదిలాబాద్​ డీసీసీ అధ్యక్షుడయ్యారు. ఆయన ఆధ్వర్యంలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ నిర్మల్ జిల్లాలో పాదయాత్ర చేశారు.

ఏలేటి మహేశ్వర్ రెడ్డి 2021 జూన్ 26న తెలంగాణ రాష్ట్రంలో ఏఐసీసీ కార్య‌క్ర‌మాల అమ‌లు క‌మిటీ చైర్మ‌న్‌గా నియ‌మితుల‌య్యాడు.[2] ఆయన 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యాడు.[3]. ఏలేటి మహేశ్వర్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ జారీ చేయడంతో 2023 ఏప్రిల్ 13న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి[4] ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[5]

ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో నిర్మల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి[6], కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీని ప్రొటెం స్పీకర్‌గా చేయడం, ఆయన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడానికి బీజేపీ నిరాకరించి, డిసెంబర్ 14న గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై అనంతరం ఆయన శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడుశాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.[7]

ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని 2024 జనవరి 08న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి బీజేపీ పార్టీ నియమించింది.[8] ఆయనను ఫిబ్రవరి 14న బీజేపీ శాసనసభ పక్ష నేతగా నియమించింది.[9]

మూలాలు

[మార్చు]
  1. Business Standard (2018). "Nirmal Election Result 2018: Nirmal Assembly Election 2018 Results | Nirmal Vidhan Sabha MLA Result". Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
  2. Namasthe Telangana (26 June 2021). "టీపీసీసీ ఏఐసీసీ కార్య‌క్ర‌మాల అమ‌లు క‌మిటీ చైర్మ‌న్‌గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి". Namasthe Telangana. Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.
  3. Andhra Jyothy (11 December 2022). "టీపీసీసీ కార్యవర్గం నుంచి.. కోమటిరెడ్డి ఔట్‌". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
  4. Eenadu (13 April 2023). "కాంగ్రెస్‌కు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి రాజీనామా". Archived from the original on 14 April 2023. Retrieved 14 April 2023.
  5. Andhra Jyothy (14 April 2023). "బీజేపీలో చేరిన కాంగ్రెస్‌ నేత ఏలేటి". Archived from the original on 14 April 2023. Retrieved 14 April 2023.
  6. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  7. NTV Telugu (14 December 2023). "ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం." Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
  8. Andhrajyothy (9 January 2024). "17 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఇన్‌చార్జిలు". Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.
  9. Andhrajyothy (14 February 2024). "బీజేపీఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి". Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.