ఐరావతం
Appearance
ఐరావతం | |
---|---|
ఐరావతం అనగా భారీకాయంతో, తెల్లటి మేనిఛాయతో మెరిసిపోయే ఏనుగు. క్షీరసాగర మథన సమయంలో పుట్టిన ఈ ఏనుగును దేవరాజు ఇంద్రుడు తన వాహనంగా చేసుకున్నాడు. దీనిని మేఘాల ఏనుగు, పోరాట ఏనుగు, సూర్యుని సోదరుడిగా కూడా పిలుస్తారు.[1]
పుట్టుక
[మార్చు]ఐరావతం పుట్టుక గురించి పురాణాల్లో రకరకాల కథలు ప్రాచూర్యంలో ఉన్నాయి.[2]
- పాలసముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీ దేవి, కల్పవృక్షము, కామధేనువులతో పాటు ఈ ఐరావతం ఉద్భవించింది.
- మాతంగలీల గ్రంథం ప్రకారం బ్రహ్మ వరంతో ఎనిమిది మగ ఏనుగులూ, ఎనిమిది ఆడ ఏనుగులూ ఉద్భవించాయి. మగ ఏనుగులకు ఐరావతం ప్రాతినిధ్యం వహించగా, ఆడ ఏనుగులకి ‘అభరాము’ అనే ఏనుగు నాయకత్వం వహించింది.
- కద్రు, కశ్యపల కుమార్తె అయిన ఐరావతికి ఐరావతం జ`న్మించింది.
ఇతర వివరాలు
[మార్చు]జైన, బౌద్ధ మతాలలో కూడా ఐరావత ప్రస్తావన ఉంది. థాయిలాండ్, లావోస్ వంటి దేశాలలో ఐరావతాన్ని ఆరాధిస్తారు. అంతేకాకుండా అక్కడి ప్రాచీన రాజ్యాల పతాకాల మీద మూడు తొండాలతో ఉండే ఐరావతం బొమ్మ చిత్రించబడివుంటుంది.
మూలాలు
[మార్చు]- ↑ Dowson, John (1870). A Classical Dictionary of Hindu Mythology and Religion, Geography, History, and Literature. London: Trübner & Company. p. 180.
- ↑ తెలుగువన్. "దేవ గజం ఐరావతం". www.teluguone.com. Archived from the original on 1 ఫిబ్రవరి 2018. Retrieved 7 November 2018.