ఒక్కడినే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక్కడినే
ఒక్కడినే సినిమా పోస్టర్
దర్శకత్వంశ్రీనివాస్ రాగా
రచనచింతపల్లి రమణ
నిర్మాతసి. వి. రెడ్డి
తారాగణంనారా రోహిత్
నిత్యా మీనన్
ఛాయాగ్రహణంఆండ్రూ
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంకార్తీక్
నిర్మాణ
సంస్థ
గులాబీ మూవీస్
విడుదల తేదీ
ఫిబ్రవరి 14, 2013
సినిమా నిడివి
133 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఒక్కడినే 2013, ఫిబ్రవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. గులాబీ మూవీస్ పతాకంపై సి.వి. రెడ్డి నిర్మాణ సారథ్యంలో శ్రీనివాస్ రాగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నారా రోహిత్, నిత్యా మీనన్ నటించగా, కార్తీక్ సంగీతం అందించాడు.[1][2] ఈ చిత్రం ఔర్ ఏక్ దుష్మన్ పేరుతో హిందీలోకి, కనలట్టమ్ పేరుతో మలయాళంలోకి అనువదించబడింది.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

చిత్రీకరణ

[మార్చు]

ఈ చిత్రం 2012, జనవరి 5న హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభించబడింది.[3] అదే రోజు మొదటి షెడ్యూల్ ప్రారంభించబడి, 2012, జనవరి 9 వరకు హైదరాబాదులో చిత్రీకరణ కొనసాగింది.[4] 2012, ఫిబ్రవరి 24న అరకులో ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ప్రారంభించబడింది.[5] క్లైమాక్స్ దృశ్యాలు 2012, జూన్ 28 రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించబడ్డాయి.[6] రామోజీ ఫిల్మ్ సిటీలో రచనా మౌర్య, 70 మంది ఇతర నృత్యకారులతో ‘పుట్టింటొల్లు తరిమేసారు…’ (జయమాలిని సూపర్ హిట్ పాట రీమిక్స్) అనే ఐటమ్ సాంగ్ చిత్రీకరించబడింది.[7]

పాటలు

[మార్చు]
ఒక్కడినే
పాటలు by
Released22 అక్టోబరు, 2012
Recorded2012
Genreపాటలు
Length21:02
Labelఆదిత్యా మ్యూజిక్
Producerక్తారీక్
కార్తీక్ chronology
అరవన్
(2011)
ఒక్కడినే
(2012)
కొరియర్ బాయ్ కళ్యాణ్
(2015)

ఈ చిత్రానికి కార్తీక్ సంగీతం అందించాడు. తెలుగులో కార్తీక్ కు ఇది తొలి సినిమా. 2012, అక్టోబరు 22న హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ఈ చిత్ర ఆడియో విడుదలయింది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, కృష్ణంరాజు, కెఎల్ నారాయణ, సాగర్, ప్రసన్న కుమార్, శేఖర్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, గోపినాథ్ రెడ్డి, అశోక్ కుమార్ విచ్చేసారు.[8] నందమూరి బాలకృష్ణ ఆడియో ఆవిష్కరించారు.[9]

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "సీతాకోక నచ్చావే (రచన: రామజోగయ్య శాస్త్రి)"  కార్తీక్, కె.టి. దర్శన 3:56
2. "హేయ్ పో (రచన: కృష్ణ చైతన్య)"  శ్వేత మోహన్ 4:24
3. "డోలా డోలా (రచన: రామజోగయ్య శాస్త్రి)"  విజయ్ ప్రకాష్, పూజా, మాళవిక 4:24
4. "పుట్టింటోళ్ళు తరిమేసారు (రచన: సాహితి)"  రంజిత్, గీతా మాధురి, స్టీవ్ వట్జ్ 3:41
5. "హోలా హోలా (రచన: భాస్కరభట్ల రవికుమార్)"  కార్తీక్, ఎం.ఎం. మనస్వి 4:37
21:02

టివి హక్కులు

[మార్చు]

4 కోట్ల రూపాయలకు సన్ టివి నెట్వర్క్ వాళ్ళు శాటిలైట్ హక్కులు తీసుకున్నారు.[10]

విడుదల

[మార్చు]

ఈ చిత్రం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుండి U/A సర్టిఫికేట్ అందుకుంది.[11] ఈ చిత్రాన్ని 2012, డిసెంబరు 7న విడుదల చేయాలని అనుకున్నారు, కాని చాలాసార్లు వాయిదా పడింది.[12][13] చివరగా ఈ చిత్రం 2013, ఫిబ్రవరి 14న[14] ప్రేమికుల దినోత్సవం[15] రోజున విడుదలయింది.

స్పందన

[మార్చు]

ఈ చిత్రం విమర్శకుల నుండి ప్రతికూలంగా మిశ్రమ సమీక్షలను అందుకుంది.

  • టైమ్‌సోఫాప్.కామ్ రేటింగ్ - 2.25/5[16]
  • వన్ఇండియా ఎంటర్టైన్మెంట్ రేటింగ్ - 2.5/5[17]
  • టైమ్స్ ఆఫ్ ఇండియా రూటింగ్ - 2/5[18]
  • రెడిఫ్ - 1.5/5[19]

పురస్కారాలు

[మార్చు]
  1. నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలులో ఉత్తమ ఫైట్ మాస్టర్ (గణేష్) విభాగంలో అవార్డు వచ్చింది.[20][21][22][23]

మూలాలు

[మార్చు]
  1. "ఆంగ్లములో చిత్ర సమీక్ష". Telugumirchi.com. 14 February 2013. Archived from the original on 14 ఫిబ్రవరి 2013. Retrieved 14 February 2013.
  2. "'Okkadine' is the title for Nara Rohit's new movie". supergoodmovies.com. 5 January 2012. Archived from the original on 30 June 2016. Retrieved 23 July 2020.
  3. "Nara Rohit-Nitya Menon's film launched". ragalahari.com. 5 Jan 2012. Retrieved 23 July 2020.
  4. "Nara Rohit's new movie launched". supergoodmovies.com. 5 January 2012. Archived from the original on 4 March 2016. Retrieved 23 July 2020.
  5. "Nara Rohit's Okkadine at Araku". ragalahari.com. 19 February 2012. Retrieved 23 July 2020.
  6. "Okkadine climax at RFC". ragalahari.com. 28 June 2012. Retrieved 23 July 2020.
  7. "Rachana Mourya making the item girls run for their money". ragalahari.com. 2 August 2012. Retrieved 23 July 2020.
  8. "Okkadine audio released with fanfare". www.indiaglitz.com. Archived from the original on 23 అక్టోబరు 2012. Retrieved 23 July 2020.
  9. "Balakrishna unveils Okkadine audio". article.wn.com. Retrieved 23 July 2020.
  10. "Okkadine Satellite Rights". blogspot.in. 8 December 2012. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 23 July 2020.
  11. "Crisp run time for Nara Rohith's 'Okkadine'". 123telugu.com. Retrieved 23 July 2020.
  12. "Nara Rohit Okkadine Movie Release On Dec 14". timesofap.com. Archived from the original on 7 డిసెంబరు 2012. Retrieved 23 July 2020.
  13. "Nara Rohit's Okkadine postponed". 123telugu.com. Retrieved 23 July 2020.
  14. "Okkadine – A messed up revenge saga". 123telugu.com. 14 February 2013. Retrieved 23 July 2020.
  15. "Nara Rohit-s Okkadine release On Valentine's day". timesofap.com. 4 February 2013. Archived from the original on 8 ఫిబ్రవరి 2013. Retrieved 23 July 2020.
  16. "Okkadine Movie Review". timesofap.com. Archived from the original on 17 ఫిబ్రవరి 2013. Retrieved 23 July 2020.
  17. "Okkadine". entertainment.oneindia.in. Retrieved 23 July 2020.[permanent dead link]
  18. "Okkadine". timesofindia.indiatimes.com. Retrieved 23 July 2020.
  19. "Okkadine isn't appealing". rediff.com. Retrieved 23 July 2020.
  20. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 30 June 2020.
  21. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
  22. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
  23. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.

ఇతర లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఒక్కడినే&oldid=4203853" నుండి వెలికితీశారు