కందుల శివానంద రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కందుల శివానంద రెడ్డి
కందుల శివానంద రెడ్డి

నియోజకవర్గం కడప నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1989 - 1994

వ్యక్తిగత వివరాలు

జననం 15 ఏప్రిల్‌ 1949
టీ.వెలమవారిపల్లె, వేంపల్లె మండలం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం 4 నవంబర్ 2020
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు ఓబుల్‌రెడ్డి
జీవిత భాగస్వామి రాజేశ్వరమ్మ
సంతానం కందుల చంద్ర ఓబుల్‌రెడ్డి
వృత్తి రాజకీయ నాయకుడు

కందుల శివానంద రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్త, విద్యావేత్త, రాజకీయ నాయకుడు. ఆయన 1989లో కడప నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. శివానంద రెడ్డికి కందుల గ్రూప్స్‌ పేరుతో పలు విద్యాసంస్థలు ఉన్నాయి.

జననం, విద్యాభాస్యం[మార్చు]

కందుల శివానంద రెడ్డి 15 ఏప్రిల్‌ 1949లోఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, వేంపల్లె మండలం, టీ.వెలమవారిపల్లె గ్రామంలో జన్మించాడు.ఆయన కడపలోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ నుండి బి.కామ్ పూర్తి చేశాడు. ఆయన కెఎస్ఆర్‌ఎం, కేవోఆర్‌ఎం, కేఎల్‌ఎం ఇంజనీరింగ్‌ కళాశాలలను, ఐటీఐ కళాశాలలను స్థాపించాడు.

రాజకీయ జీవితం[మార్చు]

కందుల శివానంద రెడ్డి 1981లో కాంగ్రెస్ పార్టీ తరపున శాసనమండలి సభ్యునిగా ఎంపికయ్యాడు. ఆయన 1989లో కడప నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాడు. ఆయన 1996లో టీడీపీలో చేరి 2004, 2009 ఎన్నికల్లో కడప ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యునిగా, పార్టీ జిల్లా అధ్యక్షునిగా పని చేశాడు. కందుల శివానంద రెడ్డి 2011లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి పార్టీకి రాజీనామా చేసి తరువాత రాజకీయ పునరేకీకరణలో భాగంగా కొద్దికాలం వైసీపీలో పని చేశాడు.[1]

మరణం[మార్చు]

కందుల శివానంద రెడ్డి గుండెపోటుతో 4 నవంబర్ 2020న మరణించాడు.[2][3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (26 April 2014). "వైఎస్ఆర్ సిపిలో చేరిన కందుల సోదరులు" (in ఇంగ్లీష్). Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.
  2. TV9 Telugu (4 November 2020). "కడప మాజీ ఎమ్మెల్యే కందుల శివానంద రెడ్డి కన్నుమూత". Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Andhrajyothy (5 November 2020). "మాజీ ఎమ్మెల్యే కందుల ఆకస్మిక మృతి". Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.