కర్నాటిక్ బ్యాంక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కర్నాటిక్ బ్యాంక్
రకంప్రైవేట్ రంగం
పరిశ్రమబ్యాంకింగ్, ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్లు అనుబంధ పరిశ్రమలు
స్థాపన1 ఏప్రిల్ 1788 (1788-04-01) బెంగాల్ బ్యాంక్ గా
స్థాపకుడుజోసియాస్ డు ప్రీ పోర్చర్
క్రియా శూన్యత31 మార్చి 1843 (1843-03-31)
విధివిలీనం బ్యాంక్ ఆఫ్ మద్రాస్
వారసులుబ్యాంక్ ఆఫ్ మద్రాస్
ప్రధాన కార్యాలయం,
Number of locations
మద్రాస్ ప్రెసిడెన్సీ
సేవ చేసే ప్రాంతము
భారతదేశం
కీలక వ్యక్తులు
జోసియాస్ డు ప్రీ పోర్చర్
ఉత్పత్తులుడిపాజిట్లు, పర్సనల్ బ్యాంకింగ్ పథకాలు, సి & ఐ బ్యాంకింగ్ పథకాలు, అగ్రి బ్యాంకింగ్ పథకాలు, ఎస్ఎంఇ బ్యాంకింగ్ పథకాలు
సేవలుబ్యాంకింగ్, ట్రేడ్ ఫైనాన్స్
మాతృ సంస్థస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

కర్ణాటిక్ బ్యాంక్ (The Carnatic Bank) 1788 సంవత్సరంలో బ్రిటిష్ ఇండియాలో స్థాపించబడిన బ్యాంకు. ఈ బ్యాంకు భారతదేశంలో ఆరవ పురాతన బ్యాంకు.[1]

ఈ బ్యాంకు 1843 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ లో విలీనం చేయబడింది.

చరిత్ర

[మార్చు]

మద్రాసు ప్రెసిడెన్సీలో స్థాపించబడిన మొదటి బ్యాంకు కర్నాటిక్ బ్యాంకు దక్షిణ భారతదేశంలోని అనేక నగరాలకు సేవలందించింది.[2] ఈ బ్యాంకు స్థాపకులు జోసియాస్ డు ప్రే పోర్చర్, థామస్ రెడ్ హెడ్, ఇరువురు కలకత్తాకు చెందిన యూరోపియన్ వర్తకులు.[3] 1788 సంవత్సరంలో స్థాపించబడిన కర్ణాటిక్ బ్యాంకు, తరువాత 1795 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ మద్రాస్,1804 సంవత్సరంలో ఏషియాటిక్ బ్యాంక్ ఉన్నాయి. ఈ బ్యాంకులను విలీనం చేసి 1843 సంవత్సరంలో ఫోర్ట్ ఎక్స్చేంజ్ లో రూ.3 మిలియన్ల పెట్టుబడితో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ జాయింట్ స్టాక్ బ్యాంకుగా ఏర్పాటు చేశారు. 1876 సంవత్సరం వరకు ప్రభుత్వం ఈ ప్రెసిడెన్సీ బ్యాంకులో వాటాలను కలిగి ఉంది. 1921 సంవత్సరంలో బొంబాయి, బెంగాల్ బ్యాంకులతో విలీనమై ఇంపీరియల్ బ్యాంకుగా మారింది. 1955 సంవత్సరంలో ఇంపీరియల్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా అవతరించింది, శాఖలవారీగా నేడు ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. అప్పుడు బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ప్రధాన కార్యాలయం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మద్రాసు ప్రెసిడెన్సీ ప్రధాన కార్యాలయంగా మారింది.[4]

యాజమాన్యం

[మార్చు]

ఈ బ్యాంకులో ప్రధానంగా ఈస్టిండియా కంపెనీ నుండి వచ్చిన బ్రిటిష్ జాతీయులు ఎక్కువగా ఉన్నారు.[5] మద్రాసు ప్రెసిడెన్సీలో ఈ బ్యాంకుకు చాలా కార్యాలయాలు, శాఖలు ఉన్నాయి.[2]

విలీనం

[మార్చు]

1843 సంవత్సరంలో లో మద్రాసు బ్యాంక్, కర్ణాటిక బ్యాంక్, బ్రిటిష్ బ్యాంక్ ఆఫ్ మద్రాస్ (1795), ఏషియాటిక్ బ్యాంక్ (1804) ఈ నాలుగు బ్యాంకులను విలీనం చేయబడి, ఒకటి బ్యాంక్ ఆఫ్ మద్రాస్, తరువాత ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చివరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్వగాములలో ఒకటి గా ఉన్నది.[2]

మూలాలు

[మార్చు]
  1. "Reserve Bank of India - Museum". rbi.org.in. Retrieved 2022-08-29.
  2. 2.0 2.1 2.2 "Before Madras". The Hindu (in Indian English). 2016-08-22. ISSN 0971-751X. Retrieved 2022-08-29.
  3. Love, Henry Davidson. Indian Records Series Vestiges of Old Madras (in ఇంగ్లీష్). Mittal Publications.
  4. "Madras Musings - We care for Madras that is Chennai". madrasmusings.com. Retrieved 2022-08-29.
  5. Columbus, Indian (2018-01-07). "Indian Columbus: The Banking Heritage Building of Madras". Indian Columbus. Retrieved 2022-08-29.