కల్పన (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కల్పన
జననం
శరత్ లత

(1943-07-18) 1943 జూలై 18 (వయసు 80)
మరణం1979 మే 12(1979-05-12) (వయసు 35)
సంకేశ్వర్ , కర్ణాటక, భారత దేశం
ఇతర పేర్లు"మిణుకు తార"
వృత్తినటి
జీవిత భాగస్వామిబి.ఎన్.విశ్వనాథ్, గుడిగేరి బసవరాజ్

కల్పన (1943 – 1979) ఒక దక్షిణ భారతదేశపు చలనచిత్ర నటి. ఈమె అసలు పేరు శరత్‌లత. ఈమె ఎక్కువగా కన్నడ సినిమాలలో నటించింది. ఈమెను అభిమానులు "మిణుగు తారె" (మెరిసే నక్షత్రం) అని ముద్దుగా పిలుచుకుంటారు.

ఆరంభ జీవితం[మార్చు]

ఈమె శరత్ లత అనే పేరుతో కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలో తుళు భాష మాట్లాడే కుటుంబంలో కృష్ణమూర్తి, జానకమ్మ దంపతులకు 1943, జూలై 18వ తేదీన జన్మించింది.ఈమెకు బాల్యం నుండే నటన పట్ల ఆసక్తి ఉండేది. స్కూలులో జరిగే నాటక పోటీలలో పాల్గొనేది. ఈమె సినిమాలు, నాటకాలలో నటించడానికి అవకాశాలకోసం తన తల్లి, తమ్మునితో కలిసి ఉత్తర కన్నడ జిల్లాకు వెళ్ళింది. ఈమె దావణగెరెలో ఉన్నప్పుడు ఈమెకు శివకుమార్ పరిచయమై ఈమెను మద్రాసుకు తీసుకువెళ్ళి కన్నడ నటుడు నరసింహరాజుకు పరిచయం చేశాడు. దర్శకుడు బి.ఆర్.పంతులు ఈమె నటనకు ముగ్ధుడై ఈమెకు తొలి అవకాశం ఇచ్చాడు. అతిత్వరలోనే ఈమె అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుని నటిగా సినిమా పరిశ్రమలో నిలదొక్కుకుంది.[1]

వృత్తి[మార్చు]

ఈమె కన్నడ చలనచిత్ర పరిశ్రమలో 1963లో బి.ఆర్.పంతులు దర్శకత్వంలో వచ్చిన సాకు మగళు చిత్రం ద్వారా కథానాయికగా అడుగు పెట్టింది. తరువాత ఈమె తన పేరును "కల్పన"గా మార్చుకుంది. 1967లో పుట్టణ్ణ కనగాళ్ దర్శకత్వంలో విడుదలైన బెళ్ళి మోడ చిత్రం ఈమెకు గుర్తింపును తెచ్చిపెట్టింది. తరువాత ఈమె వరుసగా శరపంజర, గజ్జెపూజె, ఎరడు కనసు, కప్పు బిళుపు, బయలు దారి, గంధద గుడి, బంగారద హూవు వంటి విజయవంతమైన కన్నడ సినిమాలలో నటించింది. ఈమె కొన్ని తమిళ, తెలుగు, మలయాళ సినిమాలలో కూడా నటించింది.[2] కోటి చెన్నయ్య, మలెయ మక్కళు వంటి తుళు సినిమాలలో కూడా నటించింది. ఈమె సుమారు 80 సినిమాలకు పైగా నటించింది. ఈమె రాజ్‌కుమార్, గంగాధర్, ఉదయకుమార్, సుదర్శన్, రాజశంకర్, కళ్యాణ్ కుమార్, రంగా, అశ్వథ్, శ్రీనాథ్, రాజేష్, విష్ణువర్ధన్, లోకేష్, అనంత్ నాగ్ మొదలైన నటుల సరసన నటించింది. ఈమె నటించిన పాత్రలకు ఎక్కువగా పి.సుశీల, ఎస్.జానకి పాటలను పాడారు. జయంతి, భారతి, చంద్రకళ ఈమెకు సమకాలీన నటీమణులు.

ఈమెకు 1977నాటికి సినిమా అవకాశాలు తగ్గసాగాయి. దానితో ఈమె ఉత్తరకర్ణాటక డ్రామా కంపెనీలలో నటించడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా ఈమె గుడిగేరి బసవరాజు డ్రామా కంపెనీలో పనిచేసింది. సినిమాలలో అవకాశాలు తగ్గిపోవడం, ఆర్థిక సమస్యలతో ఈమె మానసికంగా కృంగిపోయింది. ఈమె 35 సంవత్సరాలు మాత్రం జీవించింది. అందులో 15 సంవత్సరాలు సినిమా పరిశ్రమలో పనిచేసింది.

మరణం[మార్చు]

ఈమె 1979, మే 12వ తేదీన మరణించింది. ఈమె ఆత్మహత్యకు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రేమ వైఫల్యం మొదలైన అనేక కారణాలు చెబుతారు కానీ ఏవీ నిరూపింప బడలేదు. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం ఈమె 56 నిద్రమాత్రలను మ్రింగినట్లు తెలుస్తుంది. ఈమె చివరి రోజులను బెళగావి జిల్లా సంకేశ్వర్ సమీపంలోని గోటూరు ఇన్‌స్పెక్షన్ బంగళాలో గడిపింది.

తెలుగు సినిమాలు[మార్చు]

ఈమె నటించిన కొన్ని తెలుగు సినిమాలు:

  1. అర్ధరాత్రి (1969)
  2. మద్రాస్ టు హైదరాబాద్ (1969)
  3. జగత్ మొనగాళ్ళు (1971)
  4. గూడుపుఠాని (1972)
  5. తులసి (1974)
  6. నీడలేని ఆడది (1974)
  7. కోటలోపాగా (1976)
  8. దేవుడు చేసిన బొమ్మలు (1976)
  9. నవయుగం

అవార్డులు[మార్చు]

దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు
కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు

మూలాలు[మార్చు]

  1. "Archived copy". Archived from the original on 17 May 2014. Retrieved 20 February 2012.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "Archived copy". Archived from the original on 17 May 2014. Retrieved 20 February 2012.{{cite web}}: CS1 maint: archived copy as title (link)