కాకతీయ వైభవ సప్తాహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాకతీయ వైభవ సప్తాహం
కాకతీయ వైభవ సప్తాహం లోగో
కాకతీయ వైభవ సప్తాహం పోస్టర్ ఆవిష్కరిస్తున్న మంత్రి కేటీఆర్, తదితరులు
ప్రక్రియతెలంగాణ సంస్కృతి
ప్రారంభం2022 జూలై 7 (2022-07-07)
ముగింపు2022 జూలై 13 (2022-07-13)
ప్రదేశంవరంగల్, తెలంగాణ
దేశంభారతదేశం
పాల్గొనువారుతెలంగాణ ప్రజలు
బడ్జెట్50 లక్షల రూపాయలు
నిర్వహణతెలంగాణ ప్రభుత్వం

కాకతీయ వైభవ సప్తాహం (ఆంగ్లం: Kakatiya Vaibhava Sapthaham) అనేది తెలంగాణ ప్రభుత్వం 7 రోజులపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహించిన్న సాంస్కృతిక ఉత్సవం. 2022 జూలై 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన ఈ కాకతీయ వైభవ సప్తాహంలో కాకతీయుల అలనాటి విశిష్టతను, గొప్పతనాన్ని నేటి తరాలకు చాటిచెప్పేలా పలు కార్యక్రమాలను రూపొందించారు.[1] ప్రభుత్వం 50 లక్షల రూపాయలు కేటాయించి ఈ సప్తాహాన్ని ఘనంగా నిర్వహించింది.[2] ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బస్తర్‌లో ఉన్న 22వ కాకతీయ వారసుడైన కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేశాడు.

ప్రణాళిక[మార్చు]

2022 జూలై 3న ప్రభుత్వ చీఫ్​ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్​ కాన్ఫరెన్స్​ హాలులో ‘కాకతీయ వైభవ సప్తాహం’ సన్నాహక సమావేశం జరిగింది. ఉత్సవాలకు సంబంధించి ఆఫీసర్లు వారం రోజుల ప్రణాళిక తయారుచేయగా, అందులో చేయాల్సిన మార్పులు, చేర్పులపై ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, పర్యాటక, సాంస్కృతిక​, ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అందరి సూచన మేరకు కాకతీయ సప్తాహానికి బదులు ‘కాకతీయ వైభవ సప్తాహం’ పేరుతో ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించబడింది. ఈ సమావేశంలో వరంగల్ నగర మేయర్​ గుండు సుధారాణి, కుడా చైర్మన్​ సుందర్​ రాజు, వరంగల్ సీపీ డా. తరుణ్​ జోషి, ఉమ్మడి వరంగల్​లోని ఆరు జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్​ కమిషనర్​ ప్రావీణ్య, అడిషనల్​ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.[3]

కాకతీయ వంశం, చరిత్ర, ఇక్కడి ప్రాంతాలపై అవగాహన ఉన్నవాళ్ళతో ఉత్సవాలకు కమిటీలు ఏర్పాటుచేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన అన్నివర్గాల మేధావులు - కవులు - సాహితీవేత్తలను గౌరవించుకోవడం, సాహితీ-సాంస్కృతిక-కళా కార్యక్రమాలు-మేథో చర్చల నిర్వహణ, వరంగల్‌ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా-పండుగ వాతావరణం నెలకొనేలా విద్యుత్‌ దీపాలతో అలంకరించడం, కాకతీయుల వైభవంపై ఎన్ఐటీ-కాకతీయ- కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉంటాయి.

కార్యక్రమ వివరాలు[మార్చు]

తేది వేదిక సమయం కార్యక్రమం
07.07.2022 భద్రకాళి దేవాలయం - భద్రకాళి ఆలయ దర్శనం
పోచమ్మ మైదాన్ - రాణి రుద్రమాదేవి విగ్రహానికి పూలమాలలతో సత్కారం
ఖిలా వరంగల్ - ఖిలా వరంగల్ సందర్శన
వేయి స్తంభాల గుడి - వేయి స్తంభాల గుడి దర్శనం
అగ్గలయ్య గుట్ట - అగ్గలయ్య గుట్ట దగ్గర కాకతీయ తోరణం సందర్శన
స్టేట్ ఆర్ట్ గ్యాలరీ

మాదాపూర్

- ఛాయా చిత్ర ప్రదర్శన ఆవిష్కరణోత్సవం
08.07.2022 అంబేద్కర్ భవన్ ఉ. 10:00 గం.లకు కవి సమ్మేళన కార్యక్రమం
08.07.2022

నుండి

13.07.2022

నేరేళ్ళ వేణుమాధవ్

ఆడిటోరియం

సా. 5:00 గం.లకు నాటక సప్తాహం (ప్రతి రోజు రెండు నాటకాలు)
08.07.2022

నుండి

13.07.2022

ఖుష్ మహాల్, ఖిలావరంగల్ సా. 5:00 గం.లకు స్థానిక కళాకారులచే శాస్త్రీయ సంగీతం, నృత్యం
08.07.2022

నుండి

12.07.2022

వేయి స్తంభాల గుడి సా. 5:00 గం.లకు సాంస్కృతిక కార్యక్రమాలు
08.07.2022

నుండి

10.07.2022

భద్రకాళి బండ్ సా. 6:00 గం.లకు ఫుడ్ ఫెస్టివల్
08.07.2022

నుండి

13.07.2022

టౌన్ హాల్

పబ్లిక్ గార్డెన్

ఉ. 10:00 గం.లకు పెయింటింగ్ వర్క్ షాప్
11.07.2022 అంబేద్కర్ భవన్ ఉ. 10:00 గం.లకు షార్ట్ ఫిలిమ్స్ ఫెస్టివల్
పానగల్లు దేవాలయం ఉ. 10:30 గం.లకు ప్రముఖ చరిత్రకారులు, మేధావులతో పానగల్లు ఆలయ సందర్శన
11.07.2022

నుండి

12.07.2022

నిట్ వరంగల్ ఉ. 10:00 గం.లకు మిషన్ కాకతీయ, కాకతీయ 3TS భావజాలంపై చర్చా గోష్ఠి
12.07.2022 ఖిలావరంగల్ సా. 5:00 గం.లకు కార్నివాల్, ఫుడ్ ఫెస్టివల్
13.07.2022 రామప్ప దేవాలయం సా. 6:00 గం.లకు ముగింపు వేడుక

వాల్ పోస్టర్ ఆవిష్కరణ[మార్చు]

2022 జూన్ 5న ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు కాకతీయ వైభవ సప్తాహం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో పర్యాటక-సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, మహిళాశిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.[4]

రోజువారి కార్యక్రమాలు[మార్చు]

మొదటిరోజు
  • 22వ కాకతీయ వారసుడైన కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ 700 ఏళ్ళ తర్వాత వరంగల్లుకు వచ్చాడు. 777 మంది జానపద గిరిజన కళాకారులు, 111 మంది పేరిణి కళాకారులు, ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శనతో స్వాగతం పలికారు. ఏడురోజులపాటు జరిగే ఉత్సవాలను ప్రారంభించిన కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌, అనంతరం వరంగల్‌లోని భద్రకాళి దేవాలయాన్ని సందర్శించాడు.[5] వరంగల్‌లోని పోచమ్మమైదాన్‌ జంక్షన్‌లో రాణిరుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేశాడు. కాకతీయుల నాటి వైభవాన్ని తలపించేలా సుందరంగా అలంకరించిన రథంపై అశ్వదళం, కళాకారుల ఆటపాటలు, డప్పు, డోలు, తాళాలు, ఇతర వాయిద్యాల సందడితో కాకతీయ రాజధాని కేంద్రం ఖిలా వరంగల్‌ను సందర్శించిన కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ను సాదరంగా కోటలోకి తీసుకెళ్ళి చేతికి ఖడ్గాన్ని అందించారు. మధ్యకోటలోని స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయానికి చేరుకొని స్వామివారికి రుద్రాభిషేకం చేశాడు. పూజల అనంతరం, ప్రత్యేక వేదికపై నుంచి బెలూన్లు ఎగురవేసి కాకతీయ వైభవ సప్తాహం ప్రారంభమైనట్లు ప్రకటించాడు.[6] వెయ్యి స్తంభాల ఆలయాన్ని, అగ్గలయ్య గుట్టను సందర్శించాడు.[7]
  • కాకతీయుల విశిష్టతను తెలిపేలా హైదరాబాదు మాదాపూర్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో యువ చ‌రిత్ర‌కారుడు అర‌వింద్ ఆర్య‌ ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌, కేటీఆర్, వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.[8]
రెండవరోజు

కాకతీయ వైభవ సప్తాహం వేడుకలలో రెండోరోజు సాహితీవేత్తలు, కవులతో సమ్మేళనం నిర్వహించబడింది.

వేడుకలు వాయిదా

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే మృతిపట్ల దిగ్భ్రాంతిని వ్యక్తంచేస్తూ కేంద్ర ప్రభుత్వం సంతాపదినంగా ప్రకటించడంతో మూడోరోజు వేడుకలు రద్దు చేయబడ్డాయి.[9] ఆ మరుసటి రోజు నుంచి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూలై 13 వరకు కొనసాగాల్సిన కాకతీయ వైభవ సప్తాహం వేడుకలను తాత్కాలికంగా వాయిదా వేశారు.[10]

మూలాలు[మార్చు]

  1. telugu, NT News (2022-07-04). "తెలంగాణ పునర్వైభవాన్ని చాటేలా కాకతీయ ఉత్సవాలు : మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌". Namasthe Telangana. Archived from the original on 2022-07-04. Retrieved 2022-07-05.
  2. "చరిత్రలో నిలిచిపోయేలా 'కాకతీయ వైభవ సప్తాహం' వేడుకలు". ETV Bharat News. 2022-07-04. Archived from the original on 2022-07-05. Retrieved 2022-07-05.
  3. Velugu, V6 (2022-07-04). "చరిత్రలో నిలిచిపోయేలా 'కాకతీయ వైభవ సప్తాహం'". V6 Velugu. Archived from the original on 2022-07-05. Retrieved 2022-07-05.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "కాకతీయ వైభవ సప్తాహం పోస్టర్.. ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్". Prabha News. 2022-07-05. Archived from the original on 2022-07-05. Retrieved 2022-07-05.
  5. telugu, NT News (2022-07-07). "ఓరుగల్లుకు కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌.. ఘనంగా స్వాగతం పలికిన మంత్రులు". Namasthe Telangana. Archived from the original on 2022-07-07. Retrieved 2022-07-07.
  6. telugu, NT News (2022-07-08). "కాకతీయ సప్తాహం వారసత్వ వైభవం". Namasthe Telangana. Archived from the original on 2022-07-09. Retrieved 2022-07-09.
  7. telugu, NT News (2022-07-08). "తెలంగాణలో సుపరిపాలన". Namasthe Telangana. Archived from the original on 2022-07-09. Retrieved 2022-07-09.
  8. telugu, NT News (2022-07-07). "కాక‌తీయ వైభ‌వం ఫొటో ఎగ్జిబిష‌న్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌". Namasthe Telangana. Archived from the original on 2022-07-07. Retrieved 2022-07-07.
  9. Velugu, V6 (2022-07-09). "ఇవాళ్టి కాకతీయ వైభవ సప్తాహం వేడుకలు రద్దు". V6 Velugu. Archived from the original on 2022-07-09. Retrieved 2022-07-14.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  10. "కాకతీయ సప్తాహం వేడుకలు వాయిదా". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-07-12. Archived from the original on 2022-07-14. Retrieved 2022-07-14.