Jump to content

కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం (అమెరికా)

అక్షాంశ రేఖాంశాలు: 33°10′43″N 96°44′54″W / 33.178510°N 96.748377°W / 33.178510; -96.748377
వికీపీడియా నుండి
కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం
ప్రదేశం
దేశం:యునైటెడ్ స్టేట్స్
రాష్ట్రం:టెక్సస్
ప్రదేశం:ఫ్రిస్కో
అక్షాంశ రేఖాంశాలు:33°10′43″N 96°44′54″W / 33.178510°N 96.748377°W / 33.178510; -96.748377
ఇతిహాసం
సృష్టికర్త:గణపతి సచ్చిదానంద స్వామీజీ

కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం, అమెరికా టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఈ ప్రాంతంలోని అతిపెద్ద దేవాలయాలలో, ఫ్రిస్కోలోని రెండు హిందూ దేవాలయాలలో ఇదీ ఒకటి.

చరిత్ర

[మార్చు]

డల్లాస్-ఫోర్ట్ వర్త్ ప్రాంతంలోని ప్రవాస భారత హిందువుల కోసం 2007లో ఈ దేవాలయ నిర్మాణం ప్రారంభమై, 2009లో[1] పూర్తయింది. ఈ దేవాలయంలోని ప్రధాన దైవం హనుమంతుడు. 2015, జూలై 23న ఈ దేవాలయం తెరవబడింది. ఒక వారం తర్వాత, ఆగస్టు 1న 24 గంటలపాటు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పింది.[2] గణపతి సచ్చిదానంద స్వామీజీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం స్వామీజి 3వ ప్రపంచ రికార్డు.

సౌకర్యాలు

[మార్చు]

$11 మిలియన్ ఖర్చుతో ఈ దేవాలయంలో యోగా, కర్ణాటక సంగీతం, భారతీయ నృత్యం, భారతీయ మంత్రోచ్ఛారణలు, హిందూ మతంపై తరగతులతోపాటు పూజా సేవలు నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ హిందీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, గుజరాతీ భాషలలో శిక్షణ తరగతులు కూడా ఉంటాయి.[3] ఆలయంలో ప్రార్థనా మందిరం, ఫలహారశాల, భోజనశాల, ఆడిటోరియం, వేదిక ఉన్నాయి. దేవాలయానికి 72 అడుగుల ఎత్తైన "రాజగోపురం" నిర్మించబడింది. సూర్యకాంతి ఒక చివర నుండి మరొక చివరకి వెళ్ళేలా ఈ గోపురాన్ని నిర్మించారు.[4] ఆలయం వారంలో ప్రతిరోజు తెరిచి ఉంటుంది.[5]

మూలాలు

[మార్చు]
  1. "Construction of $7.5 million Karya Siddhi Hanuman temple to serve growing Hindu community". August 9, 2013. Archived from the original on 2018-07-10. Retrieved 2022-03-11.
  2. Blumberg, Antonia (August 11, 2015). "Texas Hindu Temple Sets Guinness Record For Longest Chant". Huffington Post.
  3. Dallasnews Administrator (12 August 2015). "24-hour chanting marathon at Frisco temple sets Guinness record". DallasNews. Retrieved 2022-03-11.
  4. "architectmagazine". Retrieved 2022-03-11.
  5. "Karya Siddhi Hanuman Temple in Frisco". Retrieved 2022-06-27.