కిరణ్ దేశాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిరణ్ దేశాయ్

2007లో కిరణ్ దేశాయ్
జననం: (1971-09-03) 1971 సెప్టెంబరు 3 (వయసు 52)
న్యూఢిల్లీ, భారతదేశం
వృత్తి: నవలా రచయిత
జాతీయత:భారతీయురాలు
రచనా కాలము:1998 - ప్రస్తుతం
ప్రభావాలు:అనితా దేశాయ్ (తల్లి)

కిరణ్ దేశాయ్ (జననం: 1971 సెప్టెంబరు 3 ) [1] భారతదేశ రచయిత్రి. భారతదేశ పౌరురాలైన ఆమె అమెరికా సంయుక్త రాష్ట్రాలలో స్థిర నివాసం ఏర్పరుచుకుంది. ఆమె నవల ది ఇన్‌హెరిటెన్స్ ఆఫ్ లాస్ 2006 మ్యాన్ బుకర్ ప్రైజు[1]ను, "నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్" కాల్పనిక అవార్డును గెలుచుకుంది. ఆమె భారతదేశ రచయిత్రి అనితా దేశాయ్ కుమార్తె

జీవితచరిత్ర[మార్చు]

కిరణ్ దేశాయ్ భారతదేశంలోని న్యూఢిల్లీ నగరంలో జన్మించింది. 14 ఏళ్ల వయసు వరకు ఆమె అక్కడే నివసించింది. తర్వాత ఆమె తన తల్లితో పాటు ఇంగ్లాండులో ఒక సంవత్సరం నివసించారు. చివరకు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్లారు. అక్కడ హోలిన్స్ యూనివర్శిటీకి చెందిన బెన్నింగ్టన్ కళాశాల, కొలంబియా యూనివర్శిటీలలో సృజనాత్మక రచనలపై ఆమె ఆభ్యాసం చేసింది.[2] జనవరి, 2010లో కిరణ్ దేశాయ్‌తో తనకు సంబంధం ఉన్నట్లు నోబెల్ బహుమతి గ్రహీత ఓరన్ పాముక్ వెల్లడించాడు.[3]

వృత్తి[మార్చు]

1998లో ప్రచురించబడిన ఆమె తొలి నవల హుల్లాబాలూ ఇన్ ది గువా ఆర్చర్డ్ సల్మాన్ రష్దీ వంటి రచయితల ప్రశంసలను అందుకుంది.[4] అలాగే 35 ఏళ్ల లోపు ఉన్న కామన్వెల్త్ దేశాల పౌరులు రచించిన ఉత్తమ సృజనాత్మక నవలలకు రచయితల సంఘం అందించే బెట్టీ ట్రాస్క్ అవార్డు, [5]ను కూడా అది గెలుచుకుంది.[6]

ఆమె రెండో నవల ది ఇన్‌హెరిటెన్స్ ఆఫ్ లాస్, (2006) కు ఆసియా, ఐరోపా, అమెరికా సంయుక్త రాష్ట్రాల వ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలను విశేషంగా దక్కించుకుంది. అంతేకాక 2006 మ్యాన్ బుకర్ ప్రైజు,[1] 2006 నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ కాల్పనిక అవార్డును కూడా గెలుచుకుంది.[7]

సెప్టెంబరు, 2007లో BBC రేడియో 3లో మైఖేల్ బర్కిలీ నిర్వహించిన జీవితచరిత్ర సంబంధ సంగీత చర్చా కార్యక్రమం ప్రైవేట్ ప్యాషన్స్‌కు ఆమె అతిథిగా హాజరయింది.[8] మే 2007లో ప్రారంభ ఆసియా హౌస్ ఫెస్టివల్ ఆఫ్ ఆసియన్ లిటరేచర్‌లో ఆమె విశిష్ట రచయిత్రి.

గ్రంథసూచిక[మార్చు]

  • హుల్లాబాలూ ఇన్ ది గువా ఆర్చర్డ్, ఫేబర్, ఫేబర్, 1998, ISBN 0-571-19336-6
  • ది ఇన్‌హెరిటెన్స్ ఆఫ్ లాస్, హమీష్ హామిల్టన్ లిమిటెడ్, 2006, ISBN 0-241-14348-9

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "The Inheritance of Loss Wins the Man Booker Prize 2006" (Press release). Booker Prize Foundation. 10 October 2006. Archived from the original on 2006-10-13. Retrieved 2006-10-10.
  2. "Bold Type: Interview with Kiran Desai". Random House. Retrieved 2007-09-04.
  3. 'పాముక్: ఇట్స్ నో సీక్రెట్, కిరణ్ ఈజ్ మై గర్ల్‌ఫ్రెండ్', టైమ్స్ ఆఫ్ ఇండియా , 1 ఫిబ్రవరి 2010.
  4. "Hullabaloo In The Guava Orchard". BookBrowse. Retrieved 2006-10-10.
  5. "Society of Authors — Prizes, Grants and Awards". Society of Authors. Archived from the original on 2007-02-11. Retrieved 2006-10-10.
  6. "The Betty Trask Prize and Awards". Christchurch City Libraries. Retrieved 2006-10-10.
  7. Skloot, Rebecca (2007-03-08). "And the 2006 NBCC Award for Fiction Goes to ..." Critical Mass. The National Book Critics Circle. Retrieved 2007-05-11.
  8. BBC - రేడియో 3 - ప్రైవేట్ ప్యాషన్స్

బయటి లింకులు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.