Jump to content

కొమురం సూరు

వికీపీడియా నుండి
కొమురం సూరు
జల్-జంగిల్-జమీన్
జననంమార్చి 25, 1918
జోడేఘాట్, కెరమెరి మండలం, కొమరంభీం జిల్లా
మరణంఆగస్టు 10, 1997
శేకన్ గొంది, కొమరంభీం జిల్లా
ఇతర పేర్లుకుమ్రం సూరు
ప్రసిద్ధిగిరిజన ఉద్యమ నాయకుడు.
మతంహిందూ
భార్య / భర్తఆత్రం మారుబాయి, ఆత్రం భీంబాయి
తండ్రిచిన్ను
తల్లిమారుబాయి

కుంరం సూరు (మార్చి 25, 1918 - ఆగస్టు 10, 1997) గిరిజన ఉద్యమ నాయకుడు. నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆదివాసీ గిరిజన ఉద్యమాన్ని నడిపిన కొమురం భీమ్ ప్రధాన అనుచరుడిగా గెరిల్లా సైన్యం ఏర్పాటులో ప్రధానపాత్ర పోషించాడు.[1]


జననం

[మార్చు]

సూరు 1918, మార్చి 25న సూరుది కొలం తెగకు చెందిన చిన్నూ, మారుబాయి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లా, కెరమెరి మండలం, జోడేఘాట్ గ్రామంలో జన్మించాడు. సూరు తల్లిదండ్రులు 18 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసేవారు.

19వ ఏట ఆత్రం మారుబాయిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు పుట్టకపోవడంతో ఆత్రం భీంబాయిని చేసుకున్నాడు.

ఉద్యమ జీవితం

[మార్చు]

ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన తెగలపై వ్యాపారులు, పట్వారులు, గ్రామాధికారులు అనేక దౌర్జన్యాలు, దోపిడిలు, భూ ఆక్రమణాలు చేసేవారు. సాగుచేసుకున్న భూమిని అటవీ అధికారులు పంటలతో సహా ఆక్రమించుకొని గూడేంలను తగులబెట్టేవారు. చిన్ననాటినుండి ఇలాంటి సంఘటనలను చూస్తున్న సూరు, వాటికి ఎదురుతిరగాలి అనుకున్నాడు.[2]

1938-40ల మధ్యకాలంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా జోడేఘాట్‌ లో సాయుధ పోరాటం జరిగింది. గిరిజన పోరాట యోధుడు కొమురం భీమ్ అనుచరుడిగా, పోరాట వ్యూహకర్తగా ఉన్న సూరు ఆదివాసీ యువ సైనికులకు వెదురుతో ధనుస్సులు, బాణాలు తయారుచేయడం, ఉచ్చులు బిగించడం వంటి నేర్పించాడు. నిజాం రాజుకు తన డిమాండ్లను తెలుపడంకోసం భీమ్ తో కలిసి, కాలినడకన హైదరాబాదుకు వెళ్ళాడు. 1940, అక్టోబరులో జోడేఘాట్‌ గుట్టల్లో వీరి సైన్యంపై నిజాం సైనికులు దాడిచేయగా భీమ్ మరణించాడు, సూరు కుడిచేయి, కుడి కాలుకు, నడుముకు తూటాలు తగిలాయి. కొన్నాళ్ళపాటు అజ్ఞాత జీవితం గడపి, ఆతర్వాత సముతుల గుండం, యాపలతాటి, శేకన్‌ గొంది మొదలైన గ్రామాలలో తలదాచుకున్నాడు.[3] సూరుతోపాటు వెడ్మ రాము కూడా పోరాటంలో పాల్గొన్నాడు.[4]

కుంరం సూరు వర్థంతి

[మార్చు]

కొలాము తెగ సంప్రదాయం ప్రకారం దసరా పండగను పురస్కరించుకుని కొలాములు తమ పూర్వీకులను స్మరిస్తూ జెండా ఆవిష్కరణాలు,వర్థంతులు జరుపుతుంటారు.

● సూరు 1997, ఆగస్టు 10న శేకన్ గొంది గ్రామంలో మరణించాడు. మరణించిన తేదినాడు ఎలాంటి కార్యక్రమాలు జరుపుకోరు. దసర పండుగ సందర్భంగా సూరు జెండా ఆవిష్కరణాలు,వర్థంతులు కొలామ్ ప్రజలు వివిధ గ్రామాల్లో, మండల, జిల్లా కేంద్రాలలో జరుపుతుంటారు.

ఇతర వివరాలు

[మార్చు]
  1. కొమురం భీమ్ నాయకత్వంలో 1940లో జరిగిన గెరిల్లా పోరాటం గురించి బాహ్య ప్రపంచానికి తెలియజేశాడు.
  2. సూరు చెప్పిన రూపు రేఖల ఆధారంగానే ప్రస్తుతమున్న కొమురం భీమ్ ఛాయాచిత్రం రూపొందించబడింది.
  3. 1975లో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఏర్పడిన కొమురం భీమ్ వర్థంతి సభను ప్రభుత్వం తరుపున నిర్వహించే విధంగా కృషిచేశాడు.
  4. 1980లో కొలాం గ్రామంలో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల, కొలాం ఆశ్రమ పాఠశాల ఏర్పాటుకు కృషిచేశాడు.
  5. 1986లో ఐటీడీఏలో కొలాం అభివృద్ధి అధికారిగా నియమించబడ్డాడు.
  6. సూరు చేసిన సేవను గుర్తించిన ప్రభుత్వం కొలాం క్రాంతివీర్‌ బిరుదునిచ్చి సత్కరించింది.[5]
  7. గిరిజన ఐక్య వేదిక కొలాం వీర రత్న పురస్కారాని ప్రదానం చేసింది.
  8. కుంరం సూరు జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆత్రం భీంరావు సహకారంతో ఆత్రం మోతీరామ్ రాశారు.

మరణం

[మార్చు]

సూరు 1997, ఆగస్టు 10న శోకన్‌గొంది, గ్రామంలో మరణించాడు. ప్రతి సంవత్సరం గోండు, కొలాం, తోటి , గిరిజన తెగలవారు సూరు సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు.[6]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్ (5 November 2016). "జోడేఘాట్‌ వీరుడు కుమ్రం సూరు". www.andhrajyothy.com. గుమ్మడి లక్ష్మీనారాయణ. Archived from the original on 8 November 2016. Retrieved 22 October 2019.
  2. మనం న్యూస్, మధనం (ఎడిటోరియల్) (30 October 2018). "కొలాం వీరరత్న" (in ఇంగ్లీష్). ఆత్రం మోతీరామ్. Archived from the original on 22 October 2019. Retrieved 22 October 2019.
  3. మన తెలంగాణ, లైఫ్ స్టైల్ (5 November 2016). "జోడేఘాట్ వ్యూహకర్త కుమ్రం సూరు". గుమ్మడి లక్ష్మినారాయణ. Archived from the original on 2 అక్టోబరు 2018. Retrieved 22 October 2019.
  4. నమస్తే తెలంగాణ, ఎడిటోరియల్ (26 October 2016). "కుమ్రం భీము మెచ్చిన రాము". www.ntnews.com. డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ. Archived from the original on 7 November 2019. Retrieved 7 November 2019.
  5. నవతెలంగాణ, స్టోరి (28 October 2016). "ఆదివాసీ గుండెల్లో గూడు కట్టిన సూరు". NavaTelangana. Archived from the original on 22 October 2019. Retrieved 22 October 2019.
  6. పోరాట వీరుడు కుమ్రం సూరు, నమస్తే తెలంగాణ, ఆదిలాబాదు జిల్లా ఎడిషన్, 22 అక్టోబరు 2019, పుట.14