కొమ్మారెడ్డి సురేందర్‌రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొమ్మారెడ్డి సురేందర్‌రెడ్డి
వ్యక్తిగత వివరాలు
జననం1944
కొర్రేముల్ గ్రామం, ఘటకేసర్ మండలం, మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా
మరణంఫిబ్రవరి 2, 2020
యశోద ఆసుపత్రి, హైదరాబాదు
రాజకీయ పార్టీ1982-2001 తెలుగుదేశం పార్టీ
2001-2004 తెలంగాణ రాష్ట్ర సమితి
2004-2014 భారతీయ జనతా పార్టీ
సంతానంఇద్దరు కుమార్తెలు

కొమ్మారెడ్డి సురేందర్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అటవీ, పశుసంవర్ధక శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.

జీవిత విషయాలు[మార్చు]

సురేందర్‌రెడ్డి 1944లో మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా, ఘటకేసర్ మండలం, కొర్రేముల్ గ్రామంలో జన్మించాడు. నాలుగు సంవత్సరాల క్రితం సురేందర్ రెడ్డి భార్య చనిపోయింది. పెద్దకూతురు విదేశాల్లో స్థిరపడింది, చిన్నకూతురు విదేశాల నుంచి వచ్చి మాదాపూర్‌లో ఉంటున్నది.

రాజకీయ నేపథ్యం[మార్చు]

కొమ్మారెడ్డి సురేందర్‌రెడ్డి తొలిసారిగా 1981లో కొర్రెముల సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. 1982లో ఎన్టీరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరాడు. 1985లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (1985)లో టీడీపీ టికెట్‌పై మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి జి. సంజీవ రెడ్డిపై 24,993 ఓట్ల తేడాతో గెలుపొంది తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. 1985లో తొలిసారిగా ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో అటవీ, పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేశాడు. 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (1989)లో టీడీపీ టికెట్‌పై పోటిచేసి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి సింగిరెడ్డి ఉమావెంకట్రాంరెడ్డి చేతిలో 20,823 ఓట్లతో ఓడిపోయాడు. 2001లో కెసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితిలో వ్యవస్థాపక సభ్యుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (2004)లో తెలంగాణ రాష్ట్ర సమితి టికెట్‌పై పోటిచేసి టీడీపీ అభ్యర్థి టి.దేవేందర్ గౌడ్ చేతిలో 25,707 ఓట్లతో ఓడిపోయాడు. అనంతరం టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరాడు.[1][2]

మరణం[మార్చు]

దీర్ఘకాలికవ్యాధితో బాధపడుతున్న సురేందర్‌రెడ్డి యశోద ఆసుపత్రిలో చికిత్సపొందుతూ 2020, ఫిబ్రవరి 2 ఆదివారంనాడు మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, తెలంగాణ (3 February 2020). "మాజీ మంత్రి సురేందర్‌రెడ్డి అస్తమయం". ntnews.com. Archived from the original on 3 ఫిబ్రవరి 2020. Retrieved 3 February 2020.
  2. ఆంధ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు (3 February 2020). "మాజీ మంత్రి కొమ్మిరెడ్డి సురేందర్‌ రెడ్డి మృతి". www.andhrajyothy.com. Archived from the original on 3 ఫిబ్రవరి 2020. Retrieved 3 February 2020.