Jump to content

ఖుషి

వికీపీడియా నుండి
ఖుషి
(2001 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.జె.సూర్య
నిర్మాణం ఏ.ఎం.రత్నం
కథ ఎస్.జె.సూర్య
చిత్రానువాదం ఎస్.జె.సూర్య
తారాగణం పవన్ కళ్యాణ్,
భూమిక,
సుధాకర్,
విజయకుమార్,
ఆలీ,
శివాజీ,
ముంతాజ్,
నాజర్,
సుధ
సంగీతం మణి శర్మ
నేపథ్య గానం హరిణి,
కవితా కృష్ణమూర్తి,
మనో,
ఉదిత్ నారాయణ్,
శ్రీనివాస్
సంభాషణలు రాజేంద్ర కుమార్
ఛాయాగ్రహణం పి.సి.శ్రీరాం
నిర్మాణ సంస్థ శ్రీ సూర్య ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఖుషి తెలుగు చిత్రానికి తమిళంలో విజయవంతమైన కుశి చిత్రం మూలం. దీనికి కూడా ఎస్. జె. సూర్య దర్శకుడు.[1] ఈ చిత్రం 2001 ఏప్రిల్ 26న విడుదలైంది.

"ఖుషీ బ్యాగ్" అంటే ఇదే!

కలకత్తా లోని ఒక ధనిక కుటుంబానికి చెందిన సిద్ధూ సిద్ధార్థ రాయ్. ఉన్నత విద్య కోసమై కెనడా బయలు దేరుతాడు. ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే దారిలో రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. విదేశీ విద్యావకాశం చేజారటంతో హైదరాబాదులో నే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరతాడు. కైకలూరు లోని ఉన్నత కుటుంబానికి చెందిన మధుమితకి జరగవలసిన పెళ్ళిచూపుల్లో వరుడు తాను ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోతున్నాని లేఖ రాయటంతో ఆ పెళ్ళి చూపులు రద్దు అవుతాయి. ఉన్నత విద్య అంటే ఎంతో ఇష్టపడే మధు కూడా అదే విశ్వవిద్యాలయంలో సిద్ధుకి పరిచయం అవుతుంది. వీరిరువురి స్నేహితులు ప్రేమికులు కావటంతో వారి ప్రేమకి సాయపడటంలో సిద్ధూ, మధు ఒకరికొకరు దగ్గరవుతారు. మనసులో ఒకరి పై ఒకరికి ప్రేమ ఉన్నా దానిని ఒకరికొకరు వ్యక్తీకరించుకోని గంభీర స్వభావులు వీరిరువురు. తన దూకుడు స్వభావం వలన సిద్ధూ మధు మనసులో స్థానం కోల్పోతాడు. మాటా మాటా పెరిగి తన లాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకోవలసి వస్తే, తనకి ఆ పెళ్ళి ఇష్టం లేదని ఉత్తరం రాసి పారిపోతానన్న సిద్ధు మాటలకి నొచ్చుకొంటుంది మధు. మొండితనంతో మధు సిద్ధూకు మరింత దూరం అవుతుంది. తాము స్నేహితులు కామని, తమ మధ్య ఎటువంటి సంబంధం లేదని ప్రేమ జంటని కలపటానికి మాత్రమే తాము ప్రయత్నిస్తున్నామని మాటి మాటికి సిధ్ధుకు గుర్తు చేస్తు ఉంటుంది మధు. ఇరువురి తోడ్పాటుతో ప్రేమ జంట ఏకం అవుతుంది. విడదీసిన విధే సిద్ధూ, మధు లను ఎలా కలిపింది? సిద్ధూ, మధులు వారి వారి స్వభావాలని అధిగమించారా, లేదా? వివాహానంతరం సిద్ధూ, మధులు జీవితాన్ని ఎలా గడపబోతారు?? అన్న ప్రశ్నలకు సమాధానమే చిత్రానికి శుభం కార్డు.

ఈ చిత్రంలోని గీతాలు

[మార్చు]

ఈ చిత్రంలోని అన్ని గీతాలు విశేష జనాదరణ పొందాయి.

పాట రచయిత సంగీతం గాయకులు విశేషాలు
యే మేరా జహాన్ మణి శర్మ కే కే దేశభక్తిని చాటే పూర్తి నిడివి హిందీ గీతం. కలకత్తాలో చిత్రీకరించబడినది.
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే మణి శర్మ మురళీధర్ మిస్సమ్మ చిత్రంలోని పాట రీ-మిక్స్ చేయబడినది.
ప్రేమంటే సుళువు కాదు రా మణి శర్మ దేవన్, కల్పనా రాఘవేంద్ర
గజ్జ ఘల్లుమన్నాది రో మణి శర్మ మనో, స్వర్ణలత ముంతాజ్తో పవన్ జానపద చిందులు
అమ్మాయే సన్నగా మణి శర్మ కవితా కృష్ణమూర్తి, ఉదిత్ నారాయణ్
చెలియ చెలియా మణి శర్మ హరిణి, శ్రీనివాస్

సంభాషణలు

[మార్చు]
మధుతో వితండవాదం చేస్తూ
  • నన్ను చూడు, ప్రేమా గీమా లాంటి తొక్కలో సెంటిమెంట్లు పెట్టుకోలేదు, అందుకే, ఎంత ఆనందంగా ఉన్నానో
  • లోకంలో ఎవడో ఒకడు దమ్ము కొట్టాడని మందు తాగాడని నేనెందుకు బాధ పడాలి?
  • సిద్ధు: మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగితే ఇన్ని కష్టాలెందుకు?

మధు: ఇన్ని కష్టాలంటే?
సిద్ధు: ఇన్ని కష్టాలంటే ఇన్ని కష్టాలే!

విశేషాలు

[మార్చు]
"రాయల్ బెంగాల్ టైగర్" సిద్ధూ సిద్ధార్థ్ రాయ్
  • తమిళ మూలంలో నాయికానాయకుల పాత్రల తీవ్రత, ప్రాముఖ్యాలు సమానంగా ఉంటాయి. కానీ తెలుగులో నాయకుడి పాత్రే పై చేయి.
  • కే కేతో మణి శర్మ పాడించిన పూర్తి నిడివి హిందీ గీతం యే మేరా జహాన్ తెలుగు చిత్ర రంగంలో నే మొట్టమొదటి ప్రయోగం.
  • ద్వితీయార్థంలో జరిగే కార్నివాల్ ఫైట్ కి పవన్ స్వయంగా దర్శకత్వం వహించారు. దీని చిత్రీకరణకి ఉపయోగించిన కెమేరా పనితనం మరియుమార్షల్ ఆర్ట్స్ అతనిలోని సృజనాత్మకతకి పరాకాష్టలు.
  • మిస్సమ్మ లోని ఆడువారి మాటలకు అర్ధాలే వేరులేని ఈ చిత్రంలో రీ-మిక్స్ చేశారు.
  • సిద్ధూ, మధులు పసిపాపలుగా ఉన్నప్పుడు వారిని వెంటేసుకుని వారి తల్లిదండ్రులు హైదరాబాదులో ఒకే చీరల దుకాణానికి వస్తారు. ప్రక్కప్రక్కనే కూర్చున్న ఆ తల్లుల ఒళ్ళలో ఉన్న ఆ పసిపాపలు ఒకరినొకరు చేతులతో స్పృశించుకొని పరవశంతో కేరింతలు కొడతారు. ఆ దృశ్యం, అప్పుడు వినిపించే నేపథ్య సంగీతం అత్యంత రమణీయంగా ఉంటాయి.
  • బై బై యే బంగారు రమణమ్మ, రంగబోతి ఓ రంగబోతి వంటి జానపద గీతాలను ఈ చిత్రంలో పవన్ స్వయంగా ఆలపించటం విశేషం. (ఇవి కేవలం చిత్రానికే పరిమితం. ఆడియో క్యాసెట్/సిడి లలో ఇవి లేవు.) రంగబోతి ఓ రంగబోతి గీతం ఉదయ్ కిరణ్ నటించిన శ్రీ రాం చిత్రంలో ఒక ముఖ్య గీతం.
  • ఎయిర్ పోర్టుకు వెళ్ళే దారిలో కథానాయకుడు ఎదుర్కొనే దుర్ఘటనకి కారకుడు అయిన అయోమయ చక్రవర్తి పాత్ర రెండు భాషల్లోనూ ఎస్. జే. సూర్య నే పోషించటం విశేషం.
  • ఈ చిత్రం రూ. 20 కోట్లను వసూలు చేసి బాక్స్ ఆఫీసు రికార్డుని సృష్టించినది.
  • ఈ చిత్రానికి కాస్ట్యూం లను రేణు దేశాయ్ రూపొందించింది.
  • తమిళ చిత్రంలోని చాలా గీతాలు జూనియర్ ఎన్.టి.ఆర్ నటించిన నాగ చిత్రంలో అనువదించారు.

కొసమెరుపు

[మార్చు]

విడుదలకు ముందు చాలాకాలం ఈ చిత్రం పేరు చెప్పాలని ఉంది. మొదట అమీషా పటేల్ను నాయికగా అనుకున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "19 వసంతాల 'ఖుషి'". సితార. Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
"https://te.wikipedia.org/w/index.php?title=ఖుషి&oldid=4203899" నుండి వెలికితీశారు