గంగుల కమలాకర్
గంగుల కమలాకర్ | |||
పదవీ కాలం 9 సెప్టెంబర్ 2019 – 6 డిసెంబర్ 2023 | |||
గవర్నరు | తమిళిసై సౌందరరాజన్ | ||
---|---|---|---|
ముందు | జోగు రామన్న (బీసీ సంక్షేమ) ఈటెల రాజేందర్ (ఆహారం & పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల) | ||
తరువాత | పొన్నం ప్రభాకర్ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2 జూన్ 2014 | |||
ముందు | తెలంగాణ శాసనసభ – సృష్టించబడింది | ||
నియోజకవర్గం | కరీంనగర్ | ||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | మేనేని సత్యనారాయణ | ||
నియోజకవర్గం | కరీంనగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కరీంనగర్, భారతదేశం | 1968 మే 8||
రాజకీయ పార్టీ |
| ||
ఇతర రాజకీయ పార్టీలు |
| ||
తల్లిదండ్రులు | మల్లయ్య, లక్ష్మీ నర్సమ్మ | ||
జీవిత భాగస్వామి | రజిత | ||
సంతానం | 2 | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
గంగుల కమలాకర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఈయన 2009, 2014, 2018, 2023 నుంచి కరీంనగర్ నియోజకవర్గ శాసనసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.[2] తెలంగాణ ప్రభుత్వంలో పౌరసరఫరాలు, బిసి వెల్ఫేర్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[3]
జీవిత విషయాలు
[మార్చు]కమలాకర్ 1968, మే 8న మల్లయ్య, లక్ష్మీ నర్సమ్మ అనే దంపతులకు కరీంనగర్ లో జన్మించాడు. తన వృత్తి విద్యా ను సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో పూర్తి చేసాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]కమలాకర్ కు రజితతో వివాహం జరిగింది.[4] వారికి ఒక కుమారుడు హరిహరణ్,[5] ఒక కుమార్తె.
రాజకీయ విశేషాలు
[మార్చు]గంగుల కమలాకర్ 2000లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 2000 - 2005 మధ్యకాలంలో కరీంనగర్ మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా గెలిచి తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశాడు. ఆయన 2006 - 2007 మధ్యకాలంలో కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ, ఉపాధ్యక్షుడిగా పని చేసి 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో టిడిపికి రాజీనామా చేసి 2013లో టీఆర్‌ఎస్‌లో చేరాడు. కమలాకర్ 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పై 24,000వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6]
గంగుల కమలాకర్ 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి 14,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పై గెలుపొందాడు.[7] 2019 సెప్టెంబరు 8న ముఖ్యమంత్రి కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. ఆయనకు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖలను కేటాయించారు.[8][9][10][11] ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పై 3,163 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[12]
ఇతర వివరాలు
[మార్చు]మలేషియా, సింగపూర్, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదలైన దేశాలు పర్యటించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-04-27. Retrieved 2019-04-27.
- ↑ "Gangula Kamalakar". www.myneta.info. Retrieved 2021-08-19.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Eenadu (17 November 2023). "మంత్రులు ముగ్గురు.. మాజీలు ముగ్గురు". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
- ↑ Eenadu (21 November 2023). "ప్రచార భాగస్వాములు". Archived from the original on 21 November 2023. Retrieved 21 November 2023.
- ↑ Sakshi (1 August 2022). "ఉద్యమాల పురిటిగడ్డకు వారసులొస్తున్నారు.. ఎమ్మెల్యే రేసులో నేతల పిల్లలు". Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.
- ↑ Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ "Karimnagar Assembly Election Result 2018: Gangula Kamalakar of TRS wins by 14,974 votes". టైమ్స్ నౌ. టైమ్స్ నౌ. Retrieved 27 April 2019.
- ↑ నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (8 September 2019). "ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం". ntnews.com. Archived from the original on 8 September 2019. Retrieved 8 September 2019.
- ↑ సాక్షి, తెలంగాణ (8 September 2019). "శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ". Sakshi. Archived from the original on 8 September 2019. Retrieved 8 September 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు (9 September 2019). "వెలమల కోటలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్". www.andhrajyothy.com. Archived from the original on 9 September 2019. Retrieved 9 September 2019.
- ↑ Eenadu (15 November 2023). "మళ్లీ మంత్రిస్తారా?". Archived from the original on 15 November 2023. Retrieved 15 November 2023.
- ↑ Election Commission of India (2023). "Telangana General Legislative Election 2023 - Statistical Report" (PDF). Retrieved 23 June 2024.
- CS1 maint: url-status
- జీవిస్తున్న ప్రజలు
- తెలంగాణ రాజకీయ నాయకులు
- తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు
- తెలంగాణ శాసన సభ్యులు (2014)
- తెలంగాణ శాసన సభ్యులు (2018)
- కరీంనగర్ జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు
- కరీంనగర్ జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2009)
- కరీంనగర్ జిల్లా రాజకీయ నాయకులు
- కరీంనగర్ జిల్లా వ్యక్తులు
- తెలంగాణ శాసన సభ్యులు (2023)