గంటి జోగి సోమయాజి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంటి జోగి సోమయాజి చిత్రపటం. అక్టోబరు 7, 1900 - జనవరి 1987

గంటి జోగి సోమయాజి (అక్టోబర్ 11, 1900 - 1987) ప్రముఖ తెలుగు భాషా శాస్త్రవేత్త, కవి, కులపతి, కళాప్రపూర్ణ,

బాల్యం[మార్చు]

ఈయన విశాఖపట్నం జిల్లా లోని అనకాపల్లిలో అక్టోబరు 7, 1900 సంవత్సరంలో జన్మించాడు. వీరి తల్లిదండ్రులు సూరమ్మ, అప్పల నరసింహంగార్లు.

విద్యాభ్యాసం, ఉద్యోగం[మార్చు]

  • ఈయన ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను విజయనగరంలో పూర్తి చేసారు.
  • ఇంటర్ కాకినాడ పిఠాపురం రాజా కళాశాలలో చదివారు.
  • విజయనగరం మహారాజా కళాశాలలో రసాయన శాస్త్రంలో బీఎస్సీ డిగ్రీ (1917-19) పూర్తి చేసారు.
  • తన 21వ సంవత్సరంలోనే ఆదోని ఉన్నత పాఠశాలలో రసాయన శాస్త్ర ఉపాధ్యాయునిగా ఉద్యోగాన్ని చేపట్టారు. ఆదోనిలో ఏడేళ్ళకు పైగా ఉద్యోగం చేసారు. ఈ సమయంలోనే తన పినతండ్రి గంటి సూర్యనారాయణ శాస్త్రి వద్ద సంస్కృతం అభ్యసించారు. సంస్కృతం, కన్నడ భాషలలో విద్వాన్ పట్టాను సాధించారు. ఇంతే కాక ఈయన ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, మొదలయిన భాషలలో నిష్ణాతులు.
  • ఆంధ్ర విశ్వకళా పరిషత్ మాజీ వైస్ ఛాన్సలర్ ఎ.ఎల్.నారాయణ గారి శిష్యరికంలో ఎల్.టి. డిగ్రీని రాజమండ్రిలో సంపాదించారు.
  • ఆదోనిలో ఉద్యోగానంతరం మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ సంస్కృతం (1928) పూర్తి చేసారు.
  • తరువాత చెన్నైలోని పచ్చయప్ప కళాశాలలో సంస్కృతోపన్యాసకుడుగా మూడు సంవత్సరాలు పనిచేసాడు. ఈ సమయంలోనే రామస్వామి ముదలియారు, లక్ష్మణ ముదలియారు, సర్వేపల్లి రాధాకృష్ణయ్య మొదలగు వారితో పరిచయం ఏర్పడింది. రాధాకృష్ణయ్య అప్పట్లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తుకు వైస్ ఛాన్సలర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. గంటి జోగి సోమయాజి ప్రతిభా పాటవాన్ని రాధాకృష్ణ గుర్తించి తెలుగు శాఖలో లెక్చరర్ గా 1933లో అవకాశం ఇచ్చారు. గంటి 1944లో రీడర్ అయ్యారు.1950లో ప్రొఫెసర్ పదవీ బాధ్యతలు చేపట్టారు. 1963లో ఈయన పదవీ విరమణ చేసారు.

ఆంధ్ర విశ్వకళాపరిషత్ లో చేసిన పనులు[మార్చు]

ఆంధ్రవిశ్వకళాపరిషత్తులో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నారు. ద్రావిడ భాషలపై తులనాత్మక వివేచన చేసారు. ఈ సందర్భంలోనే తెలుగు శాఖలో బి.ఏ. ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టారు. అంతేకాక బి.ఏ డిగ్రీలో తెలుగును ఒక కోర్సుగా ప్రవేశపెట్టారు. తరువాత ఎం.ఏ. తెలుగు కోర్సును ప్రవేశపెట్టారు. ఈ కోర్సులలో గంటి తెలుగు, సంస్కృతం భాషా సాహిత్యాల్ని బోధించేవారు. తెలుగు శాఖలో ముప్పై సంవత్సరాలు పనిచేసి తెలుగు భాషకి ఎనలేని సేవను అందించారు.

భారత ప్రభుత్వ సేవలు[మార్చు]

ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ నుండి ఉద్యోగ విరమణ చేసిన తరువాత వీరిని భారత సర్కారు వారు ప్రిన్‌సిపల్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌గానూ, తదుపరి Chairman of the Commission for Scientific and Technical Terminology, Ministry of Education, Government of India గాను నియమితులయారు. తరువాత 1972 లో నిజంగా ఉద్యోగ విరమణ చేసేరు.

పురస్కారాలు[మార్చు]

వీరు చేసిన సేవలకు గానూ, ఆంధ్రవిశ్వకళాఅరిషత్తు 1963లో వీరికి కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది. భాషా శాస్త్ర చతురానన అనే బిరుదు కూడా వీరికి ఉంది.

రచనలు[మార్చు]

వీరి రచనలు :

  1. అల్లాహో అక్బర్ - నవల
  2. రామచంద్రుని హంపీ యాత్ర - ఖండకావ్యం
  3. మేఘ సందేశం - కావ్యం ఆంగ్లానువాదం
  4. ద్రావిడ భాషలు, ఆంధ్ర భాషా వికాసము
  5. ఆంధ్ర భాషా వికాసము
  6. తెలుగు వ్యుత్పత్తి పదకోశం - మొదలుపెట్టారు