గట్టుప్పల్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గట్టుప్పల్ మండలం
—  మండలం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రం గట్టుప్పల్
గ్రామాలు 9
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా
 - మొత్తం {{{population_total}}}
 - పురుషులు {{{population_male}}}
 - స్త్రీలు {{{population_female}}}
పిన్‌కోడ్ {{{pincode}}}


గట్టుప్పల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, నల్లగొండ రెవెన్యూ డివిజన్ పరిథిలోని మండలం.[1][2] తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 జూలై 23న ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది.[3][4] ఆ తరువాత ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974లోని సెక్షన్ 3) ప్రకారం 2022 సెప్టెంబరు 26న 09 గ్రామాలతో నూతనంగా గట్టుప్పల్ మండలాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.[5][6]

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మండలాల పునర్విభజనలో భాగంగా గట్టుప్పల్‌ను మండలంగా ప్రకటించిన ప్రభుత్వం తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ప్రత్యేక మండలం కోసం 892 రోజుల పాటు గ్రామస్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.[7]

మండలంలో చేరిన గ్రామాలు[మార్చు]

గట్టుప్పల్‌ మండలం మొత్తం 9 గ్రామాలతో ఏర్పాటైంది. చండూరు మండలం నుండి కొండాపురం, తేరట్‌పల్లి, గట్టుప్పల్, సిర్దేపల్లి, కుమందానిగూడ గ్రామాలు, మర్రిగూడ మండలం నుండి నామాపూర్, అంతంపేట, సోమరాజుగూడా గ్రామాలు, మునుగోడు మండలం నుండి వెలమకన్నె గ్రామాలను కలిపి మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[8]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

క్ర.సం. గ్రామం పేరు పూర్వ మండలం జిల్లా
1 వెలమకన్నె మునుగోడు మండలం నల్గొండ జిల్లా
2 కొండాపురం చండూరు మండలం నల్గొండ జిల్లా
3 తేరట్‌పల్లి చండూరు మండలం నల్గొండ జిల్లా
4 గట్టుప్పల్ చండూరు మండలం నల్గొండ జిల్లా
5 సిర్దేపల్లి చండూరు మండలం నల్గొండ జిల్లా
6 కుమందానిగూడ చండూరు మండలం నల్గొండ జిల్లా
7 నామాపూర్ మర్రిగూడ మండలం నల్గొండ జిల్లా
8 అంతంపేట మర్రిగూడ మండలం నల్గొండ జిల్లా
9 సోమరాజుగూడా మర్రిగూడ మండలం నల్గొండ జిల్లా

మూలాలు[మార్చు]

  1. "Wayback Machine" (PDF). web.archive.org. Archived from the original on 2023-12-29. Retrieved 2023-12-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Wayback Machine" (PDF). web.archive.org. Archived from the original on 2023-12-30. Retrieved 2023-12-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. 10TV Telugu (23 July 2022). "తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు.. ఏఏ జిల్లాల్లో అంటే." Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Wayback Machine" (PDF). web.archive.org. Archived from the original on 2023-12-30. Retrieved 2023-12-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. Namasthe Telangana (27 September 2022). "రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు". Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
  6. Andhra Jyothy (27 September 2022). "కొత్తగా మరో 13 రెవెన్యూ మండలాలు" (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
  7. Disha (23 July 2022). "కల సాకారం..ఫలించిన గట్టుపల్ మండల సాధన సమితి పోరాటం". Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
  8. "GOVERNMENT OF TELANGANA ABSTRACT" (PDF). GOVERNMENT OF TELANGANA. 22 July 2022. Archived from the original (PDF) on 30 September 2022. Retrieved 30 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]