గరిమెళ్ళపాడు
గరిమెళ్ళపాడు | |
---|---|
Coordinates: 17°19′24″N 80°22′57″E / 17.3233°N 80.3826°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | భద్రాద్రి కొత్తగూడెం |
• Rank | 7.7 |
జనాభా (2011) | |
• Total | 6,296 |
భాష | |
• అధికార భాష | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 507101 |
Vehicle registration | టిఎస్ |
గరిమెళ్ళపాడు, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలంలోని జనగణన పట్టణం, రెవెన్యూ గ్రామం.[1] 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ 6296 మంది ఉన్నారు. ఈ పట్టణం కొత్తగూడెం పురపాలక సంఘం లో ఒక భాగంగా ఉంది.2011 జనగణన సమాచారం ప్రకారం గరిమెళ్ళపాడు గ్రామ లొకేషన్ కోడ్ (గ్రామం కోడ్) 579390.[2] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం అవిభక్త ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. [3]
భౌగోళికం
[మార్చు]ఈ పట్టణం 17°19′24″N 80°22′57″E / 17.3233°N 80.3826°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. ఇది 7.7 చకిమీల విస్తీర్ణంలో ఉంది.
సమీప గ్రామాలు
[మార్చు]సీతంపేట, గరీబ్ పేట, పెనగడప, లక్ష్మీదేవిపల్లె, చుంచుపల్లె, బోడు, కొప్పురాయి, బేతంపూడి, కొత్తగూడెం మొదలైన గ్రామాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.[2]
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, గరిమెళ్ళపాడులో 6,296 జనాభా ఉంది. ఇందులో పురుషులు 3,098 మంది కాగా, మహిళలు 3,198 మంది ఉన్నారు.[4] గరిమెళ్ళపాడు సగటు అక్షరాస్యత రేటు 77.91% కాగా, ఇది దేశ సగటు 67.02% కంటే ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత 84.99% కాగా, స్త్రీల అక్షరాస్యత 71.13%గా ఉంది.
రవాణా
[మార్చు]ఇక్కడికి సమీపంలోని భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాలలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కొత్తగూడెం నుండి గరిమెళ్ళపాడుకి రోడ్డు కనెక్టివిటీ ఉంది.
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- వెంకటేశ్వరస్వామి దేవాలయం
- రామాలయం
- సాయిబాబా దేవాలయం
- కట్ట మైసమ్మ దేవాలయం
- మస్జిద్-ఇ-గౌసియా
- మస్జిద్-ఎ-మొహమ్మదియా
విద్యాసంస్థలు
[మార్చు]- సిద్ధార్థ ఒకేషనల్ జూనియర్ కళాశాల
- ప్రభుత్వ కాలేజీ జూనియర్
- ఎస్ఆర్ డిజి స్కూల్
- సెయింట్ ఆండ్రూస్ ఉన్నత పాఠశాల
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల
ఇతర వివరాలు
[మార్చు]2021, మార్చి 3న ఈ పట్టణంలో 39.8 డిగ్రీల సెల్సియస్‌గా గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Garmilellapadu Village". www.onefivenine.com. Archived from the original on 2021-11-08. Retrieved 2021-11-08.
- ↑ 2.0 2.1 "Garimellapadu Village in Kothagudem (Khammam) Telangana | villageinfo.in". villageinfo.in. Archived from the original on 2021-11-08. Retrieved 2021-11-08.
- ↑ "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived from the original on 2022-01-06. Retrieved 2022-07-23.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Garimellapadu Census Town City Population Census 2011-2021 | Telangana". www.census2011.co.in. Retrieved 2021-11-08.
- ↑ "Garimellapadu in Bhadradri-Kothagudem district records 39.8 degree Celsius". Deccan Chronicle. 2021-03-04. Archived from the original on 2021-05-20. Retrieved 2021-11-08.