గుమ్మడి సంధ్యా రాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుమ్మిడి సంధ్యారాణి
గుమ్మడి సంధ్యా రాణి


ఎమ్మెల్సీ
పదవీ కాలం
2015 – 2021

వ్యక్తిగత వివరాలు

జననం 1973 మార్చి 15
విజయనగరం, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు జన్ని ముత్యాలు
జీవిత భాగస్వామి జయ కుమార్
సంతానం పృద్వి, ప్రణతి
నివాసం 16-22, తెలుగు స్ట్రీట్, సాలూరు, విజయనగరం
పూర్వ విద్యార్థి బి.ఎస్.సి (ఎం.ఆర్. మహిళ కళాశాల, విజయనగరం), టి.టి.సి (డి.ఐ.ఈ.టి. కాలేజీ, విజయనగరం)

గుమ్మడి సంధ్యా రాణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2015 నుండి 2021 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహించింది.

జననం, విద్యాభాస్యం[మార్చు]

సంధ్యారాణి 1973 మార్చి 15నఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, విజయనగరంలో జన్ని ముత్యాలు, పార్వతమ్మ దంపతులకు జన్మించింది. ఆమె విజయనగరంలోని ఎం.ఆర్. మహిళ కళాశాల నుండి బి.ఎస్.సి పూర్తి చేసింది.

రాజకీయ జీవితం[మార్చు]

సంధ్యారాణి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వివిధ హోదాల్లో పని చేసింది. ఆమె 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సాలూరు నియోజక వర్గం నుండి పోటీ చేసి తన సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాజేంద్ర ప్రతాప్ భంజ్ దేవ్ చేతిలో 14,970 ఓట్ల మెజారితో ఓడిపోయింది. సంధ్యారాణి 1999 ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరింది.

సంధ్యారాణి 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున సాలూరు నియోజక వర్గం నుండి పోటీ చేసి తన సమీపకాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పీడిక రాజన్నదొర చేతిలో 1656 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆమె 2014లో అరకు లోక్‌సభ నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అనంతరం 2015లో తెలుగుదేశం పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికై, 2021 వరకు ఎమ్మెల్సీగా పని చేసింది.[1] ఆమె 2020లో టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యురాలిగా,[2] [3] అరకు పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా నియమితురాలైంది.[4]

మూలాలు[మార్చు]

  1. The Hindu (9 October 2020). "MLC criticises government on Central Tribal University" (in Indian English). Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.
  2. ETV Bharat News (20 October 2020). "తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలిగా గుమ్మడి సంధ్యారాణి". Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.
  3. Prajasakti. "వైసిపి జూదాన్ని రాష్ట్ర క్రీడగా మార్చింది : గుమ్మడి సంధ్యారాణి". Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.
  4. The Hindu (28 September 2020). "TDP will return to power in 2024, say new in-charges" (in Indian English). Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.