Coordinates: 18°54′17″N 79°10′17″E / 18.904718°N 79.171466°E / 18.904718; 79.171466

గూడెం సత్యనారాయణస్వామి దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గూడెం సత్యనారాయణస్వామి దేవాలయం
గూడెం సత్యనారాయణస్వామి దేవాలయం is located in Telangana
గూడెం సత్యనారాయణస్వామి దేవాలయం
గూడెం సత్యనారాయణస్వామి దేవాలయం
తెలంగాణలో దేవాలయ ఉనికి
భౌగోళికాంశాలు:18°54′17″N 79°10′17″E / 18.904718°N 79.171466°E / 18.904718; 79.171466
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:మంచిర్యాల జిల్లా
ప్రదేశం:గూడెం, దండేపల్లి మండలం
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:సత్యనారాయణస్వామి

గూడెం సత్యనారాయణస్వామి దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం, గూడెం గ్రామంలో ఉన్న దేవాలయం.[1] గోదావరి నదీ తీరాన, ప్రకృతి రమణీతల మధ్య ఎత్తైన గుట్టపై ఉన్న ఈ దేవాలయం తెలంగాణ అన్నవర క్షేత్రంగా పిలువబడుతోంది.[2] మంచిర్యాలకు 30 కిలోమీటర్లు, కరీంనగర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి 63 వ జాతీయ రహదారికి పక్కనే ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో నిత్యపూజలతో పాటు, సత్యనారాయణ వ్రతాలు, వివాహాలు జరుగుతుంటాయి.[3]

చరిత్ర[మార్చు]

ఇక్కడి కొండను రత్నాద్రి కొండగా పిలుస్తారు. 1964లో గూడెం గ్రామానికి చెందిన గోవర్ధన పెరుమాండ్లస్వామి అనే భక్తుడికి సత్యనారాయణ స్వామి కలలో కనిపించి రత్నపు చెవుల కొండపై ఉన్నానని చెప్పడంతో అతడు రాళ్ళు, ముళ్ళ పొదలను దాటుకుంటూ కొండపైకి వెళ్ళిచూడగా అక్కడ స్వామివారి విగ్రహాలు లభించగా పవిత్ర గోదావరి జలాలతో ఆ విగ్రహాలు అభిషేకం చేశాడు. అప్పుడే ఇక్కడ ఆలయం నిర్మించాలని సంకల్పించి గుడి నిర్మాణం చేపట్టి క్రోధి నామ సంవత్సర మాఘశుద్ధ దశమి రోజున విగ్రహ ప్రతిష్ట చేశారని స్థానికులు చెబుతుంటారు.[4]

జాతర[మార్చు]

ప్రతి సంవత్సరం కార్తిక పౌర్ణమి రోజున దేవాలయంలో కార్తీక పౌర్ణమి జాతర జరుగుతుంది.[5] ఈ జాతరలో భాగంగా ఆలయ నిర్వాహకులు సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తారు.[6]

పుష్కరాలు[మార్చు]

2015లో గోదావరి నదీ పుష్కరాల సందర్భంలో మే 14 నుండి 25 వరకు పుష్కర మహోత్సవాలు జరిగాయి.

మూలాలు[మార్చు]

  1. "Mancherial: Gudem temple earns Rs 29.21 lakh through offerings". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-11-20. Archived from the original on 2021-11-20. Retrieved 2021-11-22.
  2. Dayashankar, K. M. (2009-11-22). "Gudem, the Annavaram of Telangana". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2021-11-22. Retrieved 2021-11-22.
  3. "తెలంగాణ అన్నవరం". Sakshi. 2017-06-06. Archived from the original on 2017-06-10. Retrieved 2021-11-22.
  4. "Telangana Temple: తెలంగాణ అన్నవరానికి కార్తీకశోభ.. కిక్కిరిసిన ఆలయం.. ఎక్కడంటే." News18 Telugu. 2021-11-19. Archived from the original on 2021-11-22. Retrieved 2021-11-22.
  5. "Gudem temple is an ideal destination in Karthika masam". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-11-16. Archived from the original on 2021-11-22. Retrieved 2021-11-22.
  6. "దండేపల్లి సత్యనారాయణ స్వామి సన్నిధికి పోటెత్తిన భక్తులు". ETV Bharat News. 2019-11-12. Archived from the original on 2021-11-22. Retrieved 2021-11-22.