గోపరాజు రమణ
గోపరాజు రమణ | |
---|---|
జననం | గోపరాజు యజ్ఞేశ్వర వెంకట రమణామూర్తి 1952, ఏప్రిల్ 5 |
ప్రసిద్ధి | రంగస్థల, టివీ, రేడియో నటుడు, రచయిత, దర్శకుడు, సినిమా నటుడు |
భార్య / భర్త | లీలా అన్నపూర్ణ విశాలాక్షి |
పిల్లలు | గోపరాజు విజయ్ (నటుడు, దర్శకుడు) |
తండ్రి | హనుమంతారావు |
తల్లి | బాలా త్రిపురసుందరమ్మ |
గోపరాజు రమణ, (ఆంగ్లం: Goparaju Ramana) తెలుగు నాటకరంగ, టివీ, సినిమా నటుడు.[1] నాటకరంగంలో అనేక నాటకాల్లో నటించి ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నాడు.[2] మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో హీరో తండ్రిగా నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు.[3]
జననం
[మార్చు]రమణ 1952, ఏప్రిల్ 5న హనుమంతారావు - బాలా త్రిపురసుందరమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, తెనాలి మండలంలోని కొలకలూరు గ్రామంలో జన్మించాడు.[4]
వ్యక్తిగత జీవితం
[మార్చు]రమణకు లీలా అన్నపూర్ణ విశాలాక్షితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు (గోపరాజు విజయ్) ఉన్నాడు. విజయ్ నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్నాడు.[5]
కళారంగం
[మార్చు]10వ తరగతిలో ఉన్నప్పుడు మానవుడి అడుగుజాడల్లో అనే నాటకంతో నాటకరంగంలోకి అడుగుపెట్టాడు. 1967లో బాలానందం అనే నాటక సంస్థలో చేరాడు.[4] నాటకరంగంలో నటుడిగా రమణకి మంచి అనుభవం ఉంది. అంతేకాకుండా పలు సీరియళ్ళలోనూ, సినిమాల్లోనూ నటించాడు. 2005లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన గ్రహణం సినిమాలో రమణ తొలిసారిగా నటించాడు. ఈ తరువాత మాయాబజార్, గోల్కొండ హైస్కూల్, అష్టాచెమ్మా వంటి సినిమాలలో వివిధ పాత్రలు పోషించాడు. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో బాలకృష్ణ గురువుగా నటించాడు.[6] రవీంద్రభారతిలో జరిగిన నాటక ప్రదర్శనలో రమణ నటన చేసిన దర్శకుడు వినోద్ అనంతోజు, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలోని ‘కొండల్రావ్’ పాత్రకి ఎంపిక చేశాడు.
నటించినవి
[మార్చు]నాటకాలు/నాటికలు
[మార్చు]- అనుబంధాలు
- రక్తజ్వాల
- నోరుముయ్
- చరిత్రకు చమటలు పడుతున్నాయి
- నేరస్తుడెవరు
- నాగమండల
- చాలు ఇకచాలు
- తలుపులు తెరిచే ఉన్నాయి
- కుక్కపిల్ల
- బైపాస్
- శ్రీకారం
- మనసులు కలిస్తే
- గమ్మస్థానాల వైపు
సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూ |
---|---|---|---|---|
2004 | గ్రహణం | సుబ్రమణ్యం | ||
2005 | దేవీఅభయం | |||
2006 | మాయాబజార్ | మారువేషంలో నారదుడు | ||
సుందరానికి తొందరెక్కువ | ||||
2008 | అష్టాచెమ్మా | రాంబాబు పెంపుడు తండ్రి | ||
2010 | బెట్టింగ్ బంగార్రాజు | |||
2011 | గోల్కొండ హైస్కూల్ | లియాఖత్ భాయ్ | ||
2012 | ఓనమాలు | |||
2014 | మాపల్లె రేపల్లంట | |||
2016 | వీలైతే ప్రేమిద్దం | |||
2017 | గౌతమి పుత్ర శాతకర్ణి | పూజారి | ||
2019 | ఎన్టీఆర్: మహానాయకుడు | ప్రభుత్వ ఉద్యోగి | ||
2020 | మిడిల్ క్లాస్ మెలోడీస్ | కొండల్రావు | ||
2021 | క్రాక్ | పిసి మూర్తి | ||
3 రోజెస్ | ||||
మహా సముద్రం | లక్ష్మీపతి | |||
2022 | గ్యాంగ్స్టర్ గంగరాజు | నాగరాజు | ||
ఆడవాళ్ళు మీకు జోహార్లు | చిరు మామ | |||
అశోకవనంలో అర్జున కల్యాణం | అర్జున్ మేనమామ | |||
స్వాతిముత్యం | భాగీ మేనమామ | |||
ఎఫ్ 3 | వెంకీ తండ్రి | |||
సమ్మతమే | కృష్ణ తండ్రి | |||
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి | చలపతి | |||
18 పేజీలు | బస్ కండక్టర్ | |||
2023 | వేట | మూర్తి | ||
వీర సింహ రెడ్డి | ప్రధాన పూజారి | |||
బెదురులంక 2012 | గ్రామ అధ్యక్షుడు | |||
భువన విజయమ్ | చలపతి | |||
ప్రేమ విమానం | ||||
ఓటు | ||||
రంగబలి | విశ్వం | |||
రచయిత పద్మభూషణ్ | లోకేంద్ర కుమార్ | |||
కస్టడీ | ధర్మరాజు | తమిళంలో ఏకకాలంలో తీశారు | ||
రూల్స్ రంజన్ | ||||
సామజవరగమన | గుమస్తా | |||
మార్టిన్ లూథర్ కింగ్ | ||||
2024 | అంబాజీపేట మ్యారేజి బ్యాండు | నరసింహ | ||
గీతాంజలి మళ్లీ వచ్చింది | టీ అమ్మేవాడు | |||
ఆ ఒక్కటీ అడక్కు | ప్రమాదంలో బాధితుడు | |||
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి | దొరస్వామి రాజు | |||
యేవమ్ | ఎం. గంగాధర్ | |||
కమిటీ కుర్రోళ్లు | వెంకట్రావు | |||
ధూమ్ ధామ్ | ||||
ఉరుకు పటేల | ||||
భలే ఉన్నాడే | ||||
జనక అయితే గనక | ||||
శ్వాగ్ | ||||
ధూం ధాం | ||||
అక్రమార్జన |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | నెట్వర్క్ | మూ |
---|---|---|---|---|
1999–2000 | సంఘర్షణ | ETV | ||
2000–2002 | విధి | |||
2003–2007 | పద్మవ్యూహం | |||
2014–2019 | ముద్ద మందారం | పారు తండ్రి | జీ తెలుగు | |
2015–2022 | సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు | ETV | ||
2018–2019 | మహాలక్ష్మి | జెమినీ టీవీ | ||
2020–2021 | గిరిజా కళ్యాణం (ధారావాహిక) | లక్ష్మీ నారాయణ | ||
2021 | 3 గులాబీలు | ఇందు మామ | ఆహా |
అవార్డులు, పురస్కారాలు
[మార్చు]- కందుకూరి పురస్కారం, 2017 ఏప్రిల్ 30, రాజమండ్రి[7]
- కీ.శే. శనగల కబీర్ దాస్ స్మారక పురస్కారం, సుమధుర కళానికేతన్, విజయవాడ, 2019 జూలై[8]
- ద్వితీయ ఉత్తమ నటుడు - తలుపులు తెరిచే ఉన్నాయి, పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2019
- ద్వితీయ ఉత్తమ నటుడు - కుక్కపిల్ల, పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2018
- ఉత్తమ నటుడు - చాలు ఇకచాలు, పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2017
- ఉత్తమ నటుడు - బైపాస్, అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్ - 2016
- ఉత్తమ క్యారెక్టర్ నటుడు - శ్రీకారం, పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2012
- ఉత్తమ క్యారెక్టర్ నటుడు - మనసులు కలిస్తే, పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2011
మూలాలు
[మార్చు]- ↑ "Goparaju Ramana". www.filmibeat.com. Archived from the original on 2020-12-04. Retrieved 2022-04-05.
- ↑ India, The Hans (2020-11-04). "Actor Sreeramulu suggesting me for role of Prakasam was biggest award, says Ramana". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-04-05. Retrieved 2022-04-05.
- ↑ EENADU (10 August 2022). "ఈ 'మిడిల్క్లాస్' కొండలరావు ఎవరు?". www.eenadu.net. Archived from the original on 2024-05-25. Retrieved 2024-05-25.
- ↑ 4.0 4.1 "Goparaju Ramana". starsunfolded.com. Archived from the original on 2021-06-14. Retrieved 2022-04-05.
- ↑ యడవల్లి, శ్రీనివాసరావు (2024-08-20). "నాలుగు దశాబ్దాల నట విజయం - Prajasakti". Archived from the original on 2024-08-20. Retrieved 2024-08-20.
- ↑ "ఈ 'మిడిల్క్లాస్' కొండలరావు ఎవరు?". EENADU. 2020-11-24. Archived from the original on 2022-04-05. Retrieved 2022-04-05.
- ↑ వెబ్ ఆర్కైవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ జాలగూడు. "కందుకూరి పురస్కారాలు - 2017" (PDF). web.archive.org. Archived from the original on 2018-05-07. Retrieved 2022-04-05.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link) - ↑ The New Indian Express, Vijayawada (26 July 2019). "Sumadhura comedy drama festival to begin today". www.newindianexpress.com. Archived from the original on 13 August 2020. Retrieved 2022-04-05.
- ↑ "35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". www.andhrajyothy.com. 2015-06-27. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో గోపరాజు రమణ పేజీ