గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్
Jump to navigation
Jump to search
ఎడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 GIS 2023 | |
---|---|
తేదీలు | 2023 మార్చి 3-4 |
ప్రదేశం | ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానం, విశాఖపట్నం |
ప్రారంభించినది | 2023 |
దాత(లు) | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
వెబ్‌సైటు | |
https://www.advantageap.in/ |
ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 (ఆంగ్లం: Global Investors’ Summit) అనేది విశాఖపట్నం వేదికగా 2023 మార్చి 3, 4 తేదీలలో నిర్వహించిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు. ఎడ్వాంటేజ్ ఏపీ నినాదంతో 14 రంగాల్లో ఈ సదస్సును నిర్వహించారు. దీనికి దేశవిదేశాల నుంచి వాణిజ్య ప్రతినిధులు, వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలు, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.[1][2]
విశేషాలు
[మార్చు]మొదటి రోజు
[మార్చు]- కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ సహా దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు పలువురు హాజరయ్యారు.
- రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 340 ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించాడు. కాగా మొదటి రోజు రూ.11.85 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 92 ఎంఓయూలు కుదుర్చుకున్నారు. 15 కీలక రంగాల్లో పెట్టుబడులతో 6 లక్షల 3 వేల 223 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం నిర్వహిస్తున్న జీ-20 సదస్సుకు సంబంధించిన వర్కింగ్ కమిటీ సమావేశాలకూ విశాఖ నగరం ఆతిథ్యమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రెండవ రోజు
[మార్చు]- గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర పోర్టులు, షిప్పింగ్స్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాలా, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర కె ఎల్లా, రెడ్డిస్ ల్యాబ్ చైర్మన్ సతీష్ రెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ తదితరులు
- రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 248 ఒప్పందాలు
- మొత్తం రూ. 13 లక్షల 5వేల 663 కోట్ల పెట్టుబడులు రాబట్టారు
- జీఐఎస్ విజయానికి కృషి చేసిన అందరికీ రాష ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియచేసారు
మూలాలు
[మార్చు]- ↑ "Global Investors summit: విశాఖలో ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్." web.archive.org. 2023-03-04. Archived from the original on 2023-03-04. Retrieved 2023-03-04.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Global Investors Summit: ఏపీకి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు". web.archive.org. 2023-03-04. Archived from the original on 2023-03-04. Retrieved 2023-03-04.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)