చంద్రశేఖర్ వైద్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంద్రశేఖర్ వైద్య
జననం(1922-07-07)1922 జూలై 7
మరణం2021 జూన్ 16(2021-06-16) (వయసు 98)
జాతీయతభారతీయుడు
వృత్తిబాలీవుడ్ సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1950–2021

చంద్రశేఖర్ వైద్య (7 జూలై 1922[1][2] - 16 జూన్ 2021), బాలీవుడ్ సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు. రాజేష్ ఖన్నా నటించిన అనేక సినిమాలలో సహాయక పాత్రలతో గుర్తింపు పొందాడు. రామాయణం పౌరాణిక టెలివిజన్ సిరీస్ లో ఆర్య సుమంత్ పాత్రను పోషించాడు.

తొలి జీవితం[మార్చు]

చంద్రశేఖర్ 1922, జూలై 7న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు.[1][2] కళాశాల చదువును వదిలేసి 1940ల ప్రారంభంలో బొంబాయికి వెళ్ళాడు. యునైటెడ్ కింగ్ డమ్ నుండి వెస్ట్రన్ డ్యాన్స్‌లో డిప్లొమా పొందాడు.[3][4]

సినిమారంగం[మార్చు]

గాయకురాలు షంషాద్ బేగం సిఫారసుతో 1948లో పూణేలోని షాలిమార్ స్టూడియోలో ఉద్యోగిగా చేరాడు. 1950లో భరత్ భూషణ్ ప్రధాన పాత్రలో నటించిన బెబాస్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించాడు.[5] ఆ తరువాత నిర్దోషి (1951), డాగ్ (1952), ఫార్మియాష్ (1953), మీనార్ (1954) వంటి సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించాడు.

1954లో వచ్చిన ఔరత్ తేరి యేహి కహానీ సినిమా వరకు దాదాపు 250 సినిమాలో నటించాడు. 1953లో వి. శాంతారాం నిర్మాణంలో వచ్చిన సురాంగ్ సినిమాలో తొలిసారిగా హీరోగా నటించాడు. గేట్వే ఆఫ్ ఇండియా, ఫ్యాషన్ (1957), బార్సాత్ కి రాత్ (1960), బాత్ ఏక్ రాత్ కి, అంగులిమాల్ (1960), రుస్తోమ్-ఇ-బాగ్దాద్ (1963), కింగ్ కాంగ్ (1962), జహాన్ అరా (1964) మొదలైన సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు.

స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించి హీరోగా నటించిన చా చా చా సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. హెలెన్ ప్రధాన పాత్రలో నటించిన తొలి సినిమా ఇది. అవిజిత్ ఘోష్ రాసిన 40 రిటెక్స్: బాలీవుడ్ క్లాసిక్స్ యు మే హావ్ మిస్డ్ పుస్తకంలో ఈ సినిమా గురించి రాయబడింది. 1966లో స్ట్రీట్ సింగర్‌ సినిమాకు దర్శకత్వం వహించాడు.[6]

చంద్రశేఖర్ 50 సంవత్సరాల వయసులో గుల్జార్‌ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయాలని నిర్ణయించుకొని 1972 నుండి 1976 మధ్యకాలంలో గుల్జార్‌ తీసిన పరిచయ్, కోషిష్, అచనక్, ఆంధి, ఖుష్బూ, మౌసం వంటి సినిమాలకు పని చేశాడు. 65 సంవత్సరాల వయస్సులో రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణం టీవీ సిరీస్ లో దశరథుడి ప్రధానమంత్రి ఆర్య సుమంత్ పాత్రను పోషించాడు.

78 సంవత్సరాల వయసులో ఖాఫ్‌ సినిమాలో నటించిన చంద్రశేఖర్, 2000లో సినిమారంగం నుండి రిటైర్ అయ్యాడు.

సినీ సంఘాలు[మార్చు]

1985 నుండి 1996 వరకు సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (సింటా) అధ్యక్షుడిగా పనిచేశాడు. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అధ్యక్షుడిగా, ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్, సినీ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ ఫండ్ ఆఫ్ ఇండియా ట్రస్టీ, ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా, సినీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యునిగా పనిచేశారు. రైటర్స్ అసోసియేషన్, ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ గా ఉన్నాడు.[7]

వ్యక్తిగత జీవితం[మార్చు]

చంద్రశేఖర్ కుమారుడు అశోక్ శేఖర్ టెలివిజన్ నిర్మాతగా ఉంటూ, ఈవెంట్స్, సెలెబ్ మేనేజ్మెంట్ కంపెనీని కూడా నడుపుతున్నాడు. మనవడు శక్తి అరోరా సినిమాలలో నటిస్తున్నాడు.[8][9]

సినిమాలు[మార్చు]

నటుడిగా[మార్చు]

  1. బెబాస్ (1950)
  2. నిర్దోషి (1951)
  3. డాగ్ (1952)
  4. ఫార్మాయీష్ (1953)
  5. సురాంగ్ (1953)
  6. మీనార్ (1954)
  7. ఔరత్ తేరి యేహి కహానీ (1954)
  8. కవి (1954)
  9. మస్తానా (1954)
  10. బరాదరి (1955)
  11. బసంత్ బహర్ (1956)
  12. గేట్వే ఆఫ్ ఇండియా (1957)
  13. ఫ్యాషన్ (1957)
  14. కాళి తోపి లాల్ రుమాల్ (1959)
  15. బర్సాత్ కి రాట్ (1960)
  16. అంగులిమాల్ (1960)
  17. బాత్ ఏక్ రాత్ కి (1962)
  18. కింగ్ కాంగ్ (1962)
  19. రుస్తోమ్-ఇ-బాగ్దాద్ (1963)
  20. జహాన్ అరా (1964)
  21. చా చా చా (1964)
  22. స్ట్రీట్ సింగర్ (1966)
  23. కాటి పటాంగ్ (1970)
  24. హమ్ తుమ్ ఔర్ వో (1971)
  25. ధర్మ (1973)
  26. గెహ్రీ చాల్ (1973)
  27. అజ్నాబీ (1974)
  28. చరిత్రహీన్ (1974)
  29. వర్దన్ (1975)
  30. రంగా ఖుష్ (1975)
  31. ఆజ్ కా యే ఘర్ (1976)
  32. మెహబూబా (1976)
  33. శంకర్ దాదా (1976)
  34. అన్పాద్ (1978)
  35. సాజన్ బినా సుహాగన్ (1978)
  36. కర్మయోగి (1978)
  37. ది బర్నింగ్ ట్రైన్ (1980)
  38. మాన్ గయే ఉస్తాద్ (1981)
  39. ధన్వాన్ (1981)
  40. నమక్ హలాల్ (1982)
  41. నికా (1982)
  42. అయాష్ (1982)
  43. శక్తి (1982)
  44. డిస్కో డాన్సర్ (1982)
  45. షరాబి (1984)
  46. ఇన్సాఫ్ మెయిన్ కరూంగా (1985)
  47. దుర్గా (1985)
  48. అలగ్ అలగ్ (1985)
  49. గోరా (1987)
  50. డాన్స్ డాన్స్ (1987)
  51. సంసార్ (1987)
  52. అవామ్ (1987)
  53. డాకు హసీనా (1987)
  54. హుకుమత్ (1987)
  55. సీతాపూర్ కి గీతా (1987)
  56. వతన్ కే రాఖ్వాలే (1987)
  57. ఘర్వాలి బహర్వాలి (1988 చిత్రం)
  58. తమచా (1988)
  59. ఖత్రోన్ కే ఖిలాడి (1988)
  60. త్రిదేవ్ (1989)
  61. లవ్ లవ్ లవ్ (1989)
  62. ఎలాన్-ఇ-జంగ్ (1989)
  63. కాలా బజార్ (1989)
  64. మజ్బూర్ (1990)
  65. ఘర్ హో తో ఐసా (1990)
  66. మేరా పాటి సిర్ఫ్ మేరా హై (1990)
  67. జవానీ జిందాబాద్ (1990)
  68. బెగునా (1991)
  69. మా (1991)
  70. గజాబ్ తమషా (1992)
  71. హంషాకల్ (1992)
  72. వక్త్ కా బాద్షా (1992)
  73. గురుదేవ్ (1993)
  74. మేరీ ఆన్ (1993)

నిర్మాత, దర్శకుడు[మార్చు]

  • చా చా చా (1964)
  • స్ట్రీట్ సింగర్ (1966)

సహాయ దర్శకుడు[మార్చు]

  • పారిచయ్ (1972)
  • కోషిష్ (1972)
  • అచానక్ (1973)
  • ఆంధి (1975)
  • ఖుష్బూ (1975)
  • మౌసం (1975)

టెలివిజన్[మార్చు]

  • రామాయణం (1987-1988) (దశరథుడి ప్రధానమంత్రి సుమంత్రగా)

మరణం[మార్చు]

వయస్సు-సంబంధిత అనారోగ్యంతో 98 సంవత్సరాల వయస్సులో 2021, జూన్ 16న మరణించాడు.[10] అయితే కొన్ని వార్తా సంస్థలు అతని వయస్సును 97గా రాశాయి.[11][12]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Ashok Raj (1 November 2009). Hero Vol.1. Hay House, Inc. pp. 215–. ISBN 978-93-81398-02-9.
  2. 2.0 2.1 "Biography and Superhit Movies of Chandrashekhar G. Vaidya". India E Info. Archived from the original on 2022-10-03. Retrieved 2021-06-17.
  3. "Yesteryear actor Chandrashekhar is 97 years young! (Where Are They Now?)". www.outlookindia.com. Retrieved 17 June 2021.
  4. IANS (7 July 2013). "Veteran actor Chandrashekhar turns 90!". .bollywoodlife.com. Archived from the original on 26 October 2013. Retrieved 17 June 2021.
  5. "Yesteryear actor Chandrashekhar is 97 years young! (Where Are They Now?)". Retrieved 17 June 2021.
  6. "Chandrashekhar ninety seven and still cha cha cha". Glamsham. Retrieved 17 June 2021.[permanent dead link]
  7. "Yesteryear Bollywood actor Chandrashekhar Vaidya is 97 years young!". The New Indian Express. Archived from the original on 6 August 2019. Retrieved 17 June 2021.
  8. Neha Maheshwri, TNN (2012-04-19). "Shakti Arora is Chandrashekhar's grandson". The Times of India. Archived from the original on 4 December 2012. Retrieved 17 June 2021.
  9. "Silsila Badalte Rishton Ka's Shakti Arora shares a picture with 96-year-old grandfather and veteran actor Chandrashekhar - Times of India". The Times of India. Archived from the original on 22 May 2019. Retrieved 17 June 2021.
  10. "Veteran actor Chandrashekhar Vaidya dies at 98 in Mumbai". India Today. 16 June 2021. Retrieved 17 June 2021.
  11. "Veteran actor Chandrashekhar passes away at 97". The Times of India. 16 June 2021. Retrieved 17 June 2021.
  12. "Veteran actor Chandrashekhar dies at 97". The Indian Express. 16 June 2021. Retrieved 17 June 2021.

బయటి లింకులు[మార్చు]