చిత్రాంగద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిత్రాంగద
చిత్రాంగద
చిత్రాంగదతో అర్జునుడు
సమాచారం
కుటుంబంచిత్రవాహన (తండ్రి), వసుంధర (తల్లి)
దాంపత్యభాగస్వామిఅర్జునుడు
పిల్లలుబభృవాహనుడు
బంధువులుపాండవులు (బావలు)
కుంతి (అత్త)

చిత్రాంగద తూర్పు హిమాలయాలలోని మణిపురపు రాకుమారి, అర్జునుని భార్య. వీరికి బభృవాహనుడు అను కుమారుడు జన్మించాడు.[1]

తొలి జీవితం[మార్చు]

మహాభారత కాలంలో మనలూర్ అనేది భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో ఒక రాజ్యం. దీనిని చిత్రవాహనుడు అనే రాజు పరిపాలించాడు. అతనికి చిత్రాంగద ఒక్కతే సంతానం. చిత్రవాహనుడికి వేరే వారసుడు లేనందున, చిత్రంగదకు యుద్ధంలో పరిపాలనలో శిక్షణ ఇచ్చాడు. ఆమె రాజ్య ప్రజలను రక్షించే నైపుణ్యాన్ని నేర్చుకుంది.[2]

వివాహం[మార్చు]

పాండవ రాజు అర్జునుడు, చిత్రాంగదను ఎలా కలిశాడో మహాభారతంలో వివరించబడలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన చిత్ర[3] నాటకంలో చిత్రాగదను మగ బట్టలు ధరించిన యోధురాలుగా చిత్రీకరించాడు.[4] అరణ్యవాసం చేసే సమయంలో మణిపుర రాజ్యాన్ని సందర్శించిన అర్జునుడు అందమైన చిత్రాంగద నిజాయితీ, ధైర్యం చూసి ఆమెతో ప్రేమలో పడ్డాడు.[2]

వివాహం చేసుకోవడానికి ఆమె తండ్రిని సంప్రదించినప్పుడు, రాజు తన పూర్వీకుడు ప్రభంజన కథను చెప్పాడు. సంతానం లేని ప్రభంజన అనేక యజ్ఞాలు, యాగాలు చేశాడు. మహాదేవుడు ప్రత్యక్షమై, తన జాతికి చెందిన ప్రతి వారసుడికి ఒక బిడ్డ పుట్టాలని వరం ఇచ్చాడు. కనుక చిత్రాంగదకు కలిగే సంతానము మణిపురంలోనే ఉండి రాజ్యాన్ని పరిపాలించాలని చిత్రవాహనుడు పెట్టిన షరతుకు అంగీకరించి అర్జునుడు, చిత్రాంగదను వివాహం చేసుకొని అతను ఆమెతో మూడు సంవత్సరాలు ఉండిపోయాడు. చిత్రాంగద కొడుకుకు జన్మనిచ్చిన తరువాత అర్జునుడు తన సంచారాన్ని తిరిగి ప్రారంభించాడు.[5] తన తాత తదనంతరం మణిపురంను బభృవాహనుడు పాలించాడు.

తరువాతి జీవితం[మార్చు]

అర్జునుడు ఆమెను విడిచిపెట్టి హస్తినాపురానికి తిరిగి వస్తూ ఆమెను తన రాజ్యానికి తీసుకువెళతానని మాట ఇచ్చాడు. చిత్రాంగద తన కొడుకు పెంపకాన్ని చూసుకుంది. చిత్రాంగద, ఆమె రాజ్యం గురించి మహాభారతంలోని అనేక అధ్యాయాలలోప్రస్తావించలేదు. మరొక వైపు, పాండవులు చివరకు కౌరవులపై యుద్ధంలో విజయం సాధించారు. యుధిష్ఠిరుడు హస్తినాపురానికి రాజు అయ్యాడు. యుద్ధ సమయంలో తన సొంత బంధువులను చంపానన్న బాధతో అతని మనస్సు చంచలమైనది. ఋషుల సలహామేరకు అశ్వమేధ యజ్ఞాన్ని నిర్వహించి, అలంకరించబడిన గుర్రాన్ని రాజ్యం అంతటా పంపించాడు. అది ఎక్కడైనా పోటీ పడకుండా పోతే, అ భూమిని రాజు స్వాధీనం చేసుకుంటాడు. గుర్రం బాధ్యత అర్జునుడు చూసుకుంటున్నాడు. గుర్రం దక్షిణం వైపు కదులుతుండగా, ఒక యువకుడు అర్జునుడిని అడ్డగించాడు. అర్జునుడు ఆ యువకుడి వివరాలు అడిగినప్పుడు, అతను ఆ భూమికి యువరాజునని, యుద్ధం చేయడానికి ఈ వివరాలు చాలని అంటాడు. భీకర యుద్ధం ప్రారంభమై, తనపై బాణాలు రావడం చూసి అర్జునుడు అశ్చర్యపోతాడు.

చివరకు యువకుడు వేసిన బాణంతో అర్జునుడు అపస్మారక స్థితిలోకి వెలుతాడు. ఆ క్షణం ఆ యువకుడు చిత్రాంగద కుమారుడని అర్జునుడు గ్రహిస్తాడు. ఈ సంఘటన గురించి విన్న చిత్రాంగద ఏడుస్తూ అక్కడికి వచ్చి, అర్జునుడిని చూస్తుంది. అర్జునుడి మరో భార్య ఉలూపి, చనిపోయిన మనుష్యులను తిరిగి బ్రతికించగల మృత్యసంజీవి (రాతి)తో అక్కడికి వచ్చి, అర్జునుడికి తన సొంత కొడుకు చేత చంపబడే శాపం ఉందని, ఈ సంఘటనతో అతను తన శాపం నుండి విముక్తి పొందాడని చిత్రాంగద, బబ్రువాహనులతో చెప్తుంది. అర్జునుడు మృత్యసంజీవితో మేల్కొని, తన భార్యలను కొడుకును చూశాడు. అర్జునుడు ఉలుపి, చిత్రాంగద, ఆమె కుమారుడు బబ్రువాహనులను హస్తినాపురానికి తీసుకువెళతాడు. అక్కడ చిత్రాంగద గాంధారి సేవకురాలిగా మారి, తన జీవితాన్ని గాంధారి సేవలో గడిపింది.[2]

పదవి విరమణ[మార్చు]

కలియుగం ప్రారంభమైన తరువాత ద్రౌపదితోపాటు పాండవులు పదవీ విరమణ చేసి, వారి ఏకైక వారసుడు అర్జునుడి మనవడు పరిక్షిత్తుకు సింహాసనాన్ని అప్పగించారు. వారి వస్తువులు, సంబంధాలన్నింటినీ విడిచిపెట్టి తమ కుక్కలతో కలిసి హిమాలయాలకు తమ చివరి తీర్థయాత్ర చేసారు. చిత్రాంగద తన రాజ్యమైన మణిపురంకు తిరిగి వెళ్ళింది.[6]

చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Shastri Chitrao (1964), p. 213
  2. 2.0 2.1 2.2 Bhanu, Sharada (1997). Myths and Legends from India - Great Women. Chennai: Macmillan India Limited. pp. 7–9. ISBN 0-333-93076-2.
  3. Tagore, Rabindranath (2015). Chitra - A Play in One Act. Read Books Ltd. p. 1. ISBN 9781473374263.
  4. J. E. Luebering, ed. (2010). The 100 Most Influential Writers of All Time. The Rosen Publishing Group, Inc. p. 242. ISBN 9781615300051.
  5. Ganguli (1883), Book I, Section 218
  6. Ganguli, Kisari Mohan (1883–1896). "SECTION 1". The Mahabharata: Book 17: Mahaprasthanika Parva. Internet Sacred Text Archive. Retrieved 26 June 2020.