జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల
జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల భవనం
రకంప్రభుత్వ వైద్య విద్య
స్థాపితం2021
అనుబంధ సంస్థకాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం
విద్యార్థులు150
స్థానంజగిత్యాల, జగిత్యాల జిల్లా, తెలంగాణ, భారతదేశం

జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల అనేది తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, జగిత్యాల పట్టణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల.[1] గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఔత్సాహిక వైద్య విద్యార్థులకు వైద్య పరిజ్ఞానాన్ని అందించేందుకు తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం 2021లో ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించింది. ఇది కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ నుండి 2022-23 విద్యా సంవత్సరానికి 150 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లేఖను అందుకుంది.[2][3]

నిర్మాణం[మార్చు]

2021 జూన్‌ 17న సీఎం కేసీఆర్‌ ఈ వైత్య కళాశాల ఏర్పాటుపై ప్రకటన చేయగా, మంత్రివర్గ ఆమోదంతో మంజూరయింది. 2021 సెప్టెంబరు 6న రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌, ఓఎస్డీ తదితరుల బృందం జగిత్యాల పట్టణంలో రెండురోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి, దేశంలోనే తొలిసారిగా వైద్య కళాశాలతోపాటు, సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే వైద్యశాల కలిపి ప్రారంభించనున్నామని ప్రకటించింది.[4]

ధరూర్‌ క్యాంపులోనే 27.08 ఎకరాల వైశాల్యంలో 119 కోట్లు రూపాయలతో నిర్మిస్తున్న వైద్య కళాశాల, దానికి అనుబంధంగా ప్రధాన దవాఖానల భవన నిర్మాణ పనులకు 2022, డిసెంబరు 7న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవం చేసి, ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.[5][6] రెండెకరాల్లో వైద్య కళాశాల, అరెకరంలో విద్యార్థుల క్యాంపస్‌, మరో అరెకరంలో బాలుర క్యాంపస్‌ నిర్మించబడుతున్నాయి.

కోర్సులు - శాఖలు[మార్చు]

  • అనాటమీ
  • ఫార్మాకాలజీ
  • ఫిజియోలాజీ
  • బయోకెమిస్ట్రీ
  • పాథాలజీ
  • మైక్రోబయోలాజీ
  • ఫోరెన్సిక్ మెడిసిన్
  • జెనరల్ సర్జరీ
  • ఆర్థోపెడిక్స్
  • ఓటో-రైనో-లారిగోలజీ
  • ఆప్తాల్మోలజీ
  • జనరల్ మెడిసిన్
  • టిబి & ఆర్‌డి
  • డివిఎల్
  • సైకియాట్రీ
  • పీడియాట్రిక్స్
  • ఓబిజీ
  • అనస్థీషియాలజీ
  • కమ్యూనిటీ మెడిసిన్
  • రేడియోడియాగ్నోసిస్
  • ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్
  • టీబీసీడీ
  • సీటీ సర్జరీ
  • న్యూరో సర్జరీ
  • న్యూరాలజీ
  • ప్లాస్టిక్‌ సర్జరీ
  • యూరాలజీ
  • గాస్ట్రోఎంట్రాలజీ
  • ఎండోక్రైనాలజీ
  • నెఫ్రాలజీ
  • కార్డియాలజీ
  • ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్
  • ఈఎన్‌టీ
  • ఆప్తల్
  • అనస్తీషియా
  • డెంటల్

ఆసుపత్రి[మార్చు]

కళాశాలకు అనుబంధంగా 330 పడకల ఆసుపత్రి మంజూరు చేయబడి 2022 మే 7న వైద్యారోగ్య శాఖమంత్రి టి. హరీశ్‌రావు చేతులమీదుగా తాత్కాలిక భవనంలో ఆసుపత్రి ప్రారంభించబడింది.

తరగతుల ప్రారంభం[మార్చు]

2021 జూన్‌ 25న రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ కళాశాల, ఆసుపత్రికి కలిపి 16 విభాగాల్లో 1001 పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాల ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, లెక్చరర్లు, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ను నియమించారు. 2022 నవంబరు 2వ తేదీ నుంచే రెండో విడుత కౌన్సెలింగ్‌ ప్రారంభమై డిసెంబరు 14 వరకు విడుతల వారీగా సీట్ల భర్తీ జరగనున్నది. 2022 నవంబరు 15 నుండి ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 8 వైద్య కళాశాలల ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించి వైద్యరంగంలో గుణాత్మక మార్పుకు, దేశ వైద్యరంగంలోనే నూతన అధ్యాయానికి నాందిపలికాడు.[7]

ఎనమిది వైద్య కళాశాలలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ABN (2022-11-15). "జగిత్యాల వైద్య విద్య తరగతులు షురూ". Andhrajyothy Telugu News. Archived from the original on 2022-11-15. Retrieved 2022-11-15.
  2. Desk, HT Telugu (2022-06-15). "తెలంగాణకు గుడ్ న్యూస్… కొత్తగా 150 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు". Hindustantimes Telugu. Archived from the original on 2022-07-12. Retrieved 2022-11-15.
  3. "జగిత్యాల మెడికల్‌ కాలేజీకి అనుమతి". Sakshi. 2022-06-15. Archived from the original on 2022-11-15. Retrieved 2022-11-15.
  4. telugu, NT News (2021-12-04). "వైద్యకళాశాల శరవేగం". www.ntnews.com. Archived from the original on 2022-11-15. Retrieved 2022-11-15.
  5. telugu, NT News (2022-12-07). "జగిత్యాల మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన చేసిన కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2022-12-07. Retrieved 2022-12-08.
  6. "మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన చేసిన కేసీఆర్‌." Prabha News. 2022-12-07. Archived from the original on 2022-12-07. Retrieved 2022-12-08.
  7. telugu, NT News (2022-11-15). "మెడికల్‌ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2022-11-15. Retrieved 2022-11-16.

ఇతర లంకెలు[మార్చు]