జడివాన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జడివాన అనేది ఆంధ్రప్రదేశ్ కు సంబధించిన 10వ తరగతి తెలుగు పాఠం. దీని రచయిత ఎర్రన. ఇతడు 14వ శతాబ్దానికి చెందినవాడు. ఈ పాఠం ఎర్రన రాసిన హరివంశం పూర్వభాగంలోని ఏడవ అశ్వాసంలోనుండి గ్రహించబడింది.

నేపథ్యం[మార్చు]

జడివాన అంటే విడవకుండా కురిసేవాన అని అర్థం. ఇంద్రుడి ఆజ్ఞతో మేఘాలు రేపల్లెపై జడివానను కురిస్తాయి.

జడివాన కురవడానికి కారణం[మార్చు]

ప్రతి సంవత్సరం గోపాలకులు ఇంద్రుడిని పూజిస్తారు. దీనినే ఇంద్రోత్సవం అంటారు. కాని కృష్ణుడు ఇంద్రుడికి బదులుగా గోవర్ధన పర్వతాన్ని పూజించమంటాడు. గోపాలకులు కృష్ణుడి ఆజ్ఞానుసారం గోవర్ధన పర్వతాన్ని పూజిస్తారు. అందుకు కోపగించుకున్న ఇంద్రుడు రేపల్లెపై జడివానను కురిపిస్తాడు.

ఆకాశంలో మేఘాలు విస్తరించుట[మార్చు]

  • దిక్కులనే ఆడ ఏనుగు పిల్లలు ఒక్కసారిగా ఆకాశంలో విస్తరిస్తే ఎలా ఉంటాయో,
  • కులపర్వతాలు పెల్లగింపబడి ఆకాశంలో వెలిస్తే ఎలా ఉంటాయో,
  • పాతాళ లోకంలోని చీకట్లు సూర్యుడిని మింగడాని ప్రయత్నిస్తే ఎలా ఉంటాయో,
  • సముద్రాలలోని తరంగాలు ఆకాశంలో వెలిస్తే ఎలా ఉంటాయో,
  • ఆ విధంగా ఆకాశంలో మేఘాలు విస్తరించాయి.

ఆ మేఘాల సమూహం నుండి వర్షం ప్రారంభమైంది. భూమికి, ఆకాశానికి మధ్య సందు ఏ మాత్రం కనిపించకుండా జడివాన కురుస్తుంది.

జడివాన వలన కలిగిన బాధలు[మార్చు]

  • గోపాలకులు కురిసే జడివాన వలన చాలా బాధలు పడుతున్నారు. వారి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో తెలియక బాధ పడుతున్నారు.
  • ఆ జడివాన పశువులకు కూడా బాధను కలిగిస్తుంది. అంతటితో ఆగకుండా సమస్త ప్రాణులను నాశనం చేసే విధంగా చెలరేగుతుంది.
  • జడివాన ఆ అడవిలోని సమస్త చెట్ల సమూహానికి, సమస్త పక్షుల సంతతికి బాధను కలిగిస్తుంది.
  • చనిపోయిన పక్షులు ఎక్కడ చూసినా సరే నీటి ప్రవాహాలలో తేలుతూ కనిపిస్తున్నాయి.
  • కొండ గుహలలో నివసించే సింహాలు మేఘాల గర్జనలకు భయపడిపోయి ఏం చేయాలో తెలియక ఎక్కడ ఉన్నవి అక్కడే ఉన్నాయి.
  • మరి సింహాల పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన జంతువుల పరిస్థితి గురించి చెప్పవలసిన అవసరం లేదు.
"https://te.wikipedia.org/w/index.php?title=జడివాన&oldid=3692139" నుండి వెలికితీశారు