జరీన్ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జరీన్ ఖాన్
జరీన్ ఖాన్ (2018)
జననం
జరీన్ ఖాన్

(1987-05-14) 1987 మే 14 (వయసు 36)
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం

జరీన్ ఖాన్, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, మోడల్. హిందీ, తమిళం, తెలుగు, పంజాబీ సినిమాలలో నటించింది.[1][2] 2019లో తెలుగులో వచ్చిన చాణక్య సినిమాలో ఏజెంట్ జుబెదా పాత్రను పోషించింది.

జననం[మార్చు]

జరీన్ ఖాన్ 1987 మే 14న మహారాష్ట్ర, ముంబైలోని పఠాన్ కుటుంబంలో జన్మించింది.[3][4][5] హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, మరాఠీ భాషలను మాట్లాడుతుంది. ముంబైలోని రిజ్వీ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది.[6][7]

సినిమారంగం[మార్చు]

సల్మాన్ ఖాన్ సహకారంతో,[8][9] జరీన్ ఖాన్ 2010లో వీర్‌ సినిమాలో యువరాణిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2011లో వచ్చిన కామెడీ బ్లాక్‌బస్టర్ సినిమా రెడీలో అత్యంత ప్రజాదరణ పొందిన ఐటెమ్ సాంగ్ క్యారెక్టర్ ధీలాలో నటించింది. 2012 రొమాంటిక్ కామెడీ హౌస్‌ఫుల్ 2లో గ్లామరస్ మోడల్ పాత్రతో గుర్తింపు పొందింది. 2013లో నాన్ రాజవగా పొగిరెన్‌ సినిమాలో ఐటెమ్ సాంగ్ మాల్గోవ్‌తో తమిళ సినిమారంగంలోకి ప్రవేశించింది. 2014లో జాట్ జేమ్స్ బాండ్‌ సినిమాలో ప్రముఖ పాత్రలో నటించి, బాలీవుడ్‌కి తిరిగి వచ్చింది. 2015 ఎరోటిక్ థ్రిల్లర్ హేట్ స్టోరీ 3 సినిమాలో నటించింది.[10] 2019లో యాక్షన్ థ్రిల్లర్ చాణక్య సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[11]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు
2010 వీర్ యువరాణి యశోధర హిందీ ఉత్తమ తొలిచిత్ర నటి విభాగంలో జీ సినీ అవార్డు నామినేట్ చేయబడింది
2011 రెడీ ఖుషీ పాఠక్ హిందీ "క్యారెక్టర్ ధీలా" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2012 హౌస్‌ఫుల్ 2 జ్లో హిందీ
2013 నాన్ రాజవగా పొగిరెన్ మాల్గోవ్ తమిళం "మాల్గోవ్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2014 జాట్ జేమ్స్ బాండ్ లల్లి పంజాబీ పంజాబీ సినిమా రంగప్రవేశం
డిఓఏ: ది డెత్ ఆఫ్ అమర్ మరణం జర్నలిస్ట్ హిందీ
2015 హేట్ స్టోరీ 3 సియా దీవాన్ హిందీ
2016 వీరప్పన్ అతిధి పాత్ర హిందీ "ఖల్లాస్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
వాజా తుమ్ హో అతిధి పాత్ర హిందీ "మాహి వే" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2017 అక్సర్ 2 షీనా హిందీ
2018 1921 గులాబీ హిందీ
2019 చాణక్యుడు ఏజెంట్ జుబేదా తెలుగు తెలుగు సినిమా రంగప్రవేశం
ఢాక లల్లి పంజాబీ
2021 హమ్ భీ అకేలే తుమ్ భీ అకేలే మాన్సీ దూబే హిందీ డిస్నీ+ హాట్‌స్టార్ ఫిల్మ్[12]

అవార్డులు[మార్చు]

సంవత్సరం సినిమా అవార్డు విభాగం ఫలితం మూలం
2011 వీర్ జీ సినీ అవార్డులు ఉత్తమ మహిళా అరంగేట్రం నామినేట్ చేయబడింది [13]
2015 జాట్ జేమ్స్ బాండ్ పిటిసి పంజాబీ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ మహిళా అరంగేట్రం గెలుపు [14]

మూలాలు[మార్చు]

  1. "Zarine Khan: Veer ki Heer!". The Times of India. 23 January 2010. Archived from the original on 5 November 2012. Retrieved 2022-04-18.
  2. "Payal Rohatgi compares Kat, Zarine to Sunny Leone". The Times of India.
  3. ""I Am Muslim, I Know My Islam": Zareen Khan". Bollywood Hungama.
  4. Mangal Dalal (8 January 2010). "When Men Were Men". The Indian Express. Retrieved 2022-04-18. Asked about whether it was a risk casting Zarine Khan, the debutant from the UK, Khan says: "She's a Pathan girl who speaks Hindi and Urdu well and was spectacular in the screen test. It was pure luck".
  5. Mangal Dalal (8 January 2010). "'Veer' also has a social message behind it: Salman Khan". Express India. Archived from the original on 14 March 2012. Retrieved 2022-04-18. Asked about whether it was a risk casting Zarine Khan, the debutant from the UK, Khan says: "She's a Pathan girl who speaks Hindi and Urdu well and was spectacular in the screen test.
  6. "No bikini for me: Zarine Khan". Mid-Day. Indo-Asian News Service. 27 January 2010. Retrieved 2022-04-18.
  7. Natasha Sahgal (11 January 2010). "Zarine Khan is living a dream as the heroine in 'Veer'". The Indian Express. Retrieved 2022-04-18.
  8. "Zareen Khan opens up about Salman Khan being her Godfather, says she cannot be a monkey on his back and bother him for little things". The Times of India. 20 January 2022. Retrieved 2022-04-18.
  9. Mishra, Vinay (19 January 2022). "Exclusive: Zareen Khan says, 'I cannot be a monkey on Salman Khan's back'; says she is 'replaceable right now'". Hindustan Times. Retrieved 2022-04-18.
  10. "Which is the raunchiest Hate Story? VOTE!". Rediff.
  11. "Zareen Khan says Allu Arjun is her favourite dancer in Tollywood". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-04-18.
  12. "Zareen Khan and Anshuman Jha's film 'Hum Bhi Akele Tum Bhi Akele' resumes after a legal battle". DNA India. 5 September 2019.
  13. "Happy Birthday Zareen Khan: Her 5 Must Watch Films". News18 (in ఇంగ్లీష్). 2021-05-14. Retrieved 2022-04-18.
  14. "PTC Punjabi Film Awards". CinePunjab.com. Archived from the original on 2013-08-28. Retrieved 2022-04-18.

బయటి లింకులు[మార్చు]