జాతీయ సాంకేతిక దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాతీయ సాంకేతిక దినోత్సవం
అధికారిక పేరుజాతీయ వైజ్ఞానిక దినోత్సవం
జరుపుకొనే రోజుమే 11
ఉత్సవాలుమే 11
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదే రోజు

జాతీయ సాంకేతిక దినోత్సవం (జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం) ప్రతి సంవత్సరం మే 11న నిర్వహించబడుతుంది. భార‌త‌దేశ సాంకేతిక పురోగ‌తికి గుర్తుగా ఈ జాతీయ వైజ్ఞానిక దినోత్సవం జరుపబడుతుంది.[1]

చరిత్ర[మార్చు]

భార‌త సైన్యం 1998 మే 11న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో రెండవ అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించారు. దీన్నే పోఖ్రాన్-II (ఐదు న్యూక్లియర్ బాంబుల విస్ఫోటనాల పరీక్షల వరుస) అంటారు.[2] భార‌త‌దేశాన్ని అణు దేశంగా ప్ర‌క‌టించ‌డ‌మేకాకుండా మే 11వ తేదీని జాతీయ సాంకేతిక దినోత్సవంగా ప్ర‌క‌టించి అధికారికంగా సంతకం చేశారు.[3]

ఇదేరోజు ఏరోస్పేస్ ఇంజనీరుగా ఉన్న డా. అబ్దుల్ కలాం నిర్వహించిన మొదటి దేశీయ విమానం హంస-3 పరీక్షలు, త్రిశూల్‌ క్షిపణులు, ఆపరేషన్లు కూడా విజయవంతంగా పరీక్షించబడ్డాయి.[4]

కార్యక్రమాలు[మార్చు]

  1. సైన్స్‌ ప్రాముఖ్యతను తెలియజేయడానికి దేశంలోని వివిధ సాంకేతిక సంస్థలలో, ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
  2. శాస్త్ర, సాంకేతికరంగంలో కృషిచేసిన వ్యక్తులకు, పరిశ్రమలకు ఈ దినోత్సవం రోజున అవార్డులు అందజేస్తారు.
  3. నూతన ఆవిష్కరణల గురించి తెలియజేయడంతో పాటూ ఆ ఫలాలను అందరికీ అందేలా చూడడం.

మూలాలు[మార్చు]

  1. హెచ్.ఎం.టీవీ.లైవ్, స్పెషల్స్ (11 May 2020). "నేడే జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం". HMTV (in ఇంగ్లీష్). Sumitra. Archived from the original on 11 మే 2020. Retrieved 11 May 2020.
  2. India Bureau (17 May 1998). "India releases pictures of nuclear tests". CNN India Bureau,1998. CNN India Bureau. Retrieved 11 May 2020.
  3. Press Information Bureau (11 మే 2008). "National technology day celebrated". Department of Science and Technology. Archived from the original on 15 డిసెంబరు 2010. Retrieved 11 మే 2020.
  4. సాక్షి, ఎడ్యుకేషన్ (8 May 2020). "మే 11న జాతీయ సాంకేతిక దినోత్స‌వం". www.sakshieducation.com. Archived from the original on 11 మే 2020. Retrieved 11 May 2020.