జానకి రాముడు (2016 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జానకి రాముడు[1]
జానకి రాముడు సినిమా పోస్టర్
దర్శకత్వంటి. సతీష్ బాబు
నిర్మాతఎం.పి. నాయుడు
తారాగణంనవీన్ సంజయ్
మౌర్యాని
అర్జున్ యజత్
పవిత్ర లోకేష్
సుదర్శన్
కిరణ్
ఛాయాగ్రహణంఅనిత్ కుమార్
కూర్పునాగేంద్ర వరప్రసాద్
సంగీతంగిఫ్టన్ ఎలియాస్
నిర్మాణ
సంస్థ
కావేరి మీడియా
విడుదల తేదీ
2016 డిసెంబరు 16 (2016-12-16)
దేశంభారతదేశం
భాషతెలుగు

జానకి రాముడు 2016, డిసెంబరు 16న విడుదలైన తెలుగు చలనచిత్రం.[2] టి. సతీష్ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవీన్ సంజయ్, మౌర్యాని, అర్జున్ యజత్ తదితరులు నటించగా, గిఫ్టన్ ఎలియాస్ సంగీతం అందించాడు.[3] కావేరి మీడియా పతాకంపై ఎం.పి. నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించాడు.

కథా సారాంశం[మార్చు]

రాము (నవీన్ సంజయ్) పల్లెటూరిలో చదువుకుంటూ అదే ఊరిలో ఉంటూ తనతో పాటే చదువుకునే జానకి (మౌర్యాని)ని ప్రేమిస్తాడు. జానకి కూడా రాముని ప్రేమిస్తుంది. తను అనుకున్నది సాధించి గొప్ప పేరు తెచ్చుకున్న తరువాత జానకిని పెళ్లి చేసుకోవాలనుకొని హైదరాబాదుకు వస్తాడు. రాము తిరిగి తన ఊరికి వెళ్లేసరికి జానకి అతనికి దూరమవుతుంది. రాము లక్ష్యం ఏంటి, జానకి రాముకి ఎందుకు దూరమయింది, వాళ్ళు మళ్ళీ కలిసారా, తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.

నటవర్గం[మార్చు]

  • నవీన్ సంజయ్ (రాము)
  • మౌర్యాని (జానకి)[4][5]
  • పవిత్ర లోకేష్ (జానకి తల్లి)
  • సుధ (అర్జున్ తల్లి)
  • సూర్య (బాస్కెట్ బాల్ కోచ్)
  • జాకీ (బాస్కెట్ బాల్ కోచ్)
  • సుదర్శన్
  • అర్జున్ యజత్
  • ప్రియాంక[6]
  • కిరణ్

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: టి. సతీష్ బాబు
  • నిర్మాత: ఎం.పి. నాయుడు
  • సంగీతం: గిఫ్టన్ ఎలియాస్
  • ఛాయాగ్రహణం: అనిత్ కుమార్
  • కూర్పు: నాగేంద్ర వరప్రసాద్
  • నిర్మాణ సంస్థ: కావేరి మీడియా

పాటలు[మార్చు]

జానకి రాముడు[7]
పాటలు by
గిఫ్టన్ ఎలియాస్[8]
Released2016 నవంబరు 21 (2016-11-21)
Genreసినిమా పాటలు
Length20:17
Languageతెలుగు
Labelజంగ్లీ మ్యూజిక్, టైమ్స్ మ్యూజిక్
గిఫ్టన్ ఎలియాస్[8] chronology
జానకి రాముడు[7]
(2016)
హవా
(2019)

ఈ చిత్రానికి సంగీతం, నేపథ్య సంగీతం గిఫ్టన్ ఎలియాస్ అందించాడు. తనకి ఇది తొలిచిత్రం.[9]

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."లైఫ్ అంటే (రచన: శ్రీమణి)"శ్రీమణిహేమచంద్ర, నియోల్, నూతన03:41
2."వరమా వరమా (రచన: శ్రీమణి)"శ్రీమణిచిన్మయి04:10
3."ప్రేమ కన్న కిక్కు లేదే (రచన: అనంత శ్రీరాం)"అనంత శ్రీరాంరాహుల్ నంబియార్03:37
4."రావమ్మా (రచన: శ్రీమణి)"శ్రీమణినిఖిల్ మ్యాథు, గీతా మాధురి03:50
5."ఓ ప్రేమ (రచన: శ్రీమణి)"శ్రీమణిమహ్మద్ ఇర్ఫాన్04:59

మార్కెటింగ్[మార్చు]

2016, జనవరి 9న ఈ చిత్ర టీజర్, పోస్టర్‌ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదలచేశాడు.[10] 2016, నవంబరు 21న హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రసాద్ స్టూడియోలో నిర్మాత రాజ్ కందుకూరి, దర్శకుడు వి ఆనంద్, నటి నందిత శ్వేత, సురేష్ కొండేటి చేతులమీదుగా జంగ్లీ మ్యూజిక్, టైమ్స్ మ్యూజిక్ ద్వారా ఈ చిత్ర పాటలు విడుదలయ్యాయి.[11][12]

మూలాలు[మార్చు]

  1. "Latest Telugu Movies 2016". Thetelugufilmnagar.com. Archived from the original on 31 జనవరి 2020. Retrieved 31 January 2020.
  2. "Janaki Ramudu Release Date Confirmed". Thetelugufilmnagar.com. Archived from the original on 31 జనవరి 2020. Retrieved 31 January 2020.
  3. "Janaki Ramudu 2016 movie". Timesofindia.indiatimes.com. Retrieved 31 January 2020.
  4. "Ready to play the devil". The Hindu. Retrieved 31 January 2020.
  5. "Actress Mouryani Stills @ Janaki Ramudu Movie Audio Launch Event". Thetelugufilmnagar.com. Archived from the original on 31 జనవరి 2020. Retrieved 31 January 2020.
  6. "Latest Telugu Movies 2016". Thetelugufilmnagar.com. Archived from the original on 3 ఫిబ్రవరి 2017. Retrieved 31 January 2020.
  7. "anaki Ramudu Movie Stills". Thetelugufilmnagar.com. Archived from the original on 17 అక్టోబర్ 2018. Retrieved 31 January 2020. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  8. "Jamming for a cause". The Hindu. 3 May 2010. Retrieved 31 January 2020.
  9. "A patriotic tribute - ANDHRA PRADESH". The Hindu. 14 August 2014. Retrieved 31 January 2020.
  10. "Janaki Ramudu poster & teaser launch by Ram Gopal Varma videos". Indiaglitz.com. Retrieved 31 January 2020.
  11. "'Janaki Ramudu' Audio Launch videos". Indiaglitz.com. Retrieved 31 January 2020.
  12. "Janaki Ramudu Audio Launch Photos". Thetelugufilmnagar.com. Archived from the original on 31 జనవరి 2020. Retrieved 31 January 2020.

ఇతర లంకెలు[మార్చు]