టాప్ ర్యాంకర్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టాప్ ర్యాంకర్స్
టాప్ ర్యాంకర్స్ సినిమా పోస్టర్
దర్శకత్వంగొల్లపాటి నాగేశ్వరరావు
కథగొల్లపాటి నాగేశ్వరరావు
నిర్మాతపసుపులేటి బ్రహ్మం
తారాగణంరాజేంద్ర ప్రసాద్
సోనీ ఛరిష్ట
శివాజీరాజా
గిరిబాబు
ఛాయాగ్రహణంకంతేటి శంకర్
కూర్పువి. నాగిరెడ్డి
సంగీతంజయసూర్య బోంపెం
సామ్ ప్రసాద్ (నేపథ్య సంగీతం)
నిర్మాణ
సంస్థ
విశ్వ విజన్ ఫిల్మ్స్
విడుదల తేదీ
2015 జనవరి 30 (2015-01-30)
దేశంభారతదేశం
భాషతెలుగు

టాప్ రాంకర్స్ 2015, జనవరి 30న విడుదలైన తెలుగు హాస్య చలనచిత్రం.[1] విశ్వ విజన్ ఫిల్మ్స్ పతాకంపై గొల్లపాటి నాగేశ్వరరావు దర్శకత్వం వమించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, అశోక్ కుమార్, త్రిశూల్, సాగరికా, సోని చరిష్ట, గిరిబాబు తదితరులు నటించగా, జయసూర్య బోంపెం సంగీతం అందించాడు.[2]

కథా నేపథ్యం[మార్చు]

సెంట్ మేరీస్ విద్యాసంస్థల ప్రిన్సిపాల్ విశ్వనాధ్ (రాజేంద్ర ప్రసాద్) విద్యార్ధులు ప్రతిరోజు 20 గంటలు చదవాలని కొత్త కొత్త రూల్స్ పెడుతాడు. విద్యార్థులందరిని ర్యాంకులు సాధించే రోబోలుగా చూస్తుంటాడు. తమ కాలేజీ విద్యార్ధులే ఎంసెట్ లో టాప్ ర్యాంకులు సాధించాలన్నది అతని టార్గెట్. ఇంట్లో కూతురి విషయంలో కూడా ఇలానే ప్రదర్శిస్తుంటాడు. పదవ తరగతిలో 18వ ర్యాంక్ సాధించిన కూతురిని తిట్టడంతోపాటు టాప్ ర్యాంక్ రాకపోవడం పెద్ద అవమానం అంటూ కూతురిని అసహ్యించుకుంటాడు. దీంతో కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది. కూతురి ఆత్మహత్య తర్వాత విశ్వనాథ్ లో మార్పు వస్తుంది. విశ్వనాథ్ తన ప్రయత్నంలో విజయవంతం అయ్యాడా, లేదా అనేది మిగతా కథ.[3]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • కథ, చిత్రానువాదం, మాటలు, దర్శకత్వం: గొల్లపాటి నాగేశ్వరరావు
  • నిర్మాత: పసుపులేటి బ్రహ్మం
  • రచన సహకారం:రాజేంద్ర భరద్వాజ్, శ్రీజ సాధినేని
  • సంగీతం: జయసూర్య బోంపెం
  • నేపథ్య సంగీతం: సామ్ ప్రసాద్
  • ఛాయాగ్రహణం: కంతేటి శంకర్
  • కూర్పు: వి. నాగిరెడ్డి
  • పాటలు: జయసూర్య
  • గానం: జై శ్రీనివాస్
  • నిర్మాణ సంస్థ: విశ్వ విజన్ ఫిల్మ్స్

పాటలు[మార్చు]

  1. ప్రిన్సిపాల్ కాదురా బాబు - హేమంత్ కుమర్, అనుదీప్‌ దేవ్‌ (4:04)
  2. ఛలో - భార్గవి పిళ్ళై (4:01)
  3. ర్యాంకుల రణరంగమా - జై శ్రీనివాస్ (3:15)
  4. పద పద పద - జై శ్రీనివాస్ (3:44)
  5. అనురాగమా - రాగిణి, ఘణ (3:46)

మూలాలు[మార్చు]

  1. Times of India, Entertainment (30 January 2015). "Top Rankers Movie". Retrieved 24 February 2020.
  2. 123తెలుగు, సినిమా వార్తలు (24 January 2015). "ఈ నెల 30న వస్తున్న 'టాప్ ర్యాంకర్స్'..!". www.123telugu.com. Retrieved 24 February 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. 123తెలుగు, రివ్యూ (30 January 2015). "Top Rankers Review and Rating". www.123telugu.com. Archived from the original on 26 December 2019. Retrieved 24 February 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. తెలుగు వన్, సినిమా వార్తలు (15 November 2013). "రాజేంద్రప్రసాద్ టాప్ ర్యాంకర్స్ పాటలు". www.teluguone.com. Retrieved 24 February 2020.

ఇతర లంకెలు[మార్చు]