డి. రవీందర్

వికీపీడియా నుండి
(డి. రవీందర్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
డి. రవీందర్‌
జననం
దాచేపల్లి రవీందర్‌ గుప్తా

జాతీయత భారతదేశం
వృత్తిప్రొఫెసర్

దాచేపల్లి రవీందర్‌ గుప్తా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్‌. ఆయన 2021, మే 21న నిజామాబాదు జిల్లా, డిచ్‌పల్లి లోని తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌గా నియమితుడయ్యాడు.[1][2][3]ఆయన ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగనున్నాడు.[4]

జననం, విద్యాభాస్యం[మార్చు]

డి. రవీందర్‌ యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్‌ నారాయణ్‌పూర్‌ లో దాచేపల్లి రాములు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు.[5] ఆయన ఒకటవ తరగతి పదవ తరగతి వరకు సంస్థాన్‌ నారాయణపుర్ లో పూర్తి చేశాడు. ఆయన రామన్నపేట లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 1976 నుండి 1978 వరకు ఇంటర్మీడియట్ పూర్తి చేసి, నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో 1978 నుండి 1981 వరకు డిగ్రీ పూర్తి చేశాడు. రవీందర్‌ 1981-1983లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్‌లో పీజీ, 1984 నుండి 1988లో కంప్యూటర్‌ మెమోరిస్‌, పిక్చర్‌ ట్యూబ్‌లపై పీహెచ్‌డీ పూర్తి చేసి 1989లో పీహెచ్‌డీ పట్టా అందుకున్నాడు.[6][7]

వృత్తి జీవితం[మార్చు]

డి. రవీందర్‌ 1989లో ఫిజిక్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరాడు. ఆయన 1998లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి అందుకున్నాడు. రవీందర్‌ 2006లో ప్రొఫెసర్‌గా పదోన్నతి అందుకొని 2020లో పదవి విరమణ చేశాడు. ఆయన 1994లో యూజీసీ కెరీర్‌ అవార్డు, 1996లో యంగ్‌సైంటిస్ట్‌ అవార్డును అందుకున్నాడు. ఆయన అమెరికా, లండన్‌, కెనడా, స్వీడన్, ఐర్లాండ్, జపాన్‌, సింగపూర్‌ మొదలగు దేశాల్లో పర్యటించి పరిశోధన వర్క్‌షాపుల్లో పాల్గొన్నాడు.[8]

వైస్‌చాన్సలర్‌గా భాద్యతలు[మార్చు]

డి. రవీందర్‌ 2021, మే 24న తెలంగాణ విశ్వవిద్యాలయం 4వ వైస్ చాన్సలర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించాడు.[9][10][11]తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌గా ప్రొఫెసర్ డి. రవీందర్ గుప్తా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మే 27న మర్యాద పూర్వకంగా కలిశాడు.[12]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (22 May 2021). "10 వర్సిటీలకు సారథులు". Namasthe Telangana. Archived from the original on 25 మే 2021. Retrieved 27 May 2021.
  2. "After two years, 10 Telangana state universities finally get new Vice-Chancellors". The New Indian Express. 23 May 2021. Archived from the original on 25 మే 2021. Retrieved 27 May 2021.
  3. TV9 Telugu, TV9 (22 May 2021). "Universities Vice Chancellors: తెలంగాణలో యూనివర్సిటీల కొత్త వీసీల నియమాకం.. ఆమోదం తెలిపిన రాష్ట్ర గవర్నర్ - telangana government announced universities new vice chancellors". TV9 Telugu. Archived from the original on 25 మే 2021. Retrieved 27 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Namasthe Telangana (22 May 2021). "టీయూ కొత్త సారథి రవీందర్‌". Namasthe Telangana. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  5. Namasthe Telangana, యాదాద్రి > టీయూ వీసీగా నారాయణపురం వాసి (24 May 2021). "టీయూ వీసీగా నారాయణపురం వాసి". Namasthe Telangana. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  6. Eenadu (23 May 2021). "ఉపకులపతి వస్తున్నారు". m.eenadu.net. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  7. Sakshi (22 May 2021). "TS: పది యూనివర్సిటీలకు వీసీలను నియమించిన ప్రభుత్వం". Sakshi. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  8. Andhrajyothy (23 May 2021). "టీయూ వీసీగా దాచేపల్లి రవీందర్‌ గుప్తా". www.andhrajyothy.com. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  9. Eenadu (25 May 2021). "పరిశోధనలకు ప్రాధాన్యం". EENADU. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  10. Telangana Today (24 May 2021). "Prof Ravinder Gupta takes charge as Telangana University V-C". Telangana Today. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  11. Namasthe Telangana (27 May 2021). "ప్రొఫెస‌ర్ ర‌వీంద‌ర్ గుప్తాకు కోలేటి దామోద‌ర్ అభినంద‌న‌లు". Namasthe Telangana. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  12. Namasthe Telangana (27 May 2021). "మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసిన వీసీలు". Namasthe Telangana. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.