డి. రాజేశ్వర్ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డి. రాజేశ్వర్ రావు
డి. రాజేశ్వర్ రావు


ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2017 మే 28 - 27 మే 2023

వ్యక్తిగత వివరాలు

జననం (1961-03-02) 1961 మార్చి 2 (వయసు 63)
నిజామాబాదు, తెలంగాణ
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు మల్లయ్య, వెంకమ్మ
జీవిత భాగస్వామి అనసూయ
సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె

డి. రాజేశ్వర్ రావు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త. 2017-2023 వరకు తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా పని చేసాడు.[1] ఆయనను 2023 ఆగష్టు 10న క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2]

జీవిత విషయాలు[మార్చు]

రాజేశ్వర్ రావు 1961, మార్చి 2న మల్లయ్య, వెంకమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదులో జన్మించాడు. బిఏ వరకు చదువుకున్నాడు.[3]

వ్యక్తిగత వివరాలు[మార్చు]

రాజేశ్వర్ రావుకు అనసూయతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె.[4]

రాజకీయరంగం[మార్చు]

2005 నుండి 2007 హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేశాడు. 2007 నుండి 2014, జూన్ 1 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014, జూన్ 2 నుండి 2017, మే 27 వరకు తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు. 2017, మే 28న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

ఇతర వివరాలు[మార్చు]

ఆస్ట్రేలియా, ఈజిప్ట్, ఇజ్రాయెల్, జోర్డాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, థాయిలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదలైన దేశాలలో పర్యటించాడు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Telangana Legislature, MLCs (3 August 2021). "Members Information - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 3 August 2021. Retrieved 3 August 2021.
  2. "స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ పైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా రాజేశ్వర్ రావు". 10 August 2023. Archived from the original on 11 August 2023. Retrieved 11 August 2023.
  3. Telangana Data, MLCs (2 October 2020). "Telangana Nominated MLC D. Rajeshwar Rao". Archived from the original on 3 August 2021. Retrieved 3 August 2021.
  4. "D. Rajeshwar Rao". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-06-30. Retrieved 2021-08-03.