డైమండ్ రత్నబాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డైమండ్ రత్నబాబు
జననం1982, సెప్టెంబరు 19
మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
ప్రసిద్ధిసినిమా దర్శకుడు, రచయిత
భార్య / భర్తపరిమళ పుష్పా నాయుడు
పిల్లలుఇద్దరు కుమారులు (మోహిత్ కళ్యాణ్ నాయుడు, ధృవ కళ్యాణ్ నాయుడు)
తండ్రిఈశ్వరరావు
తల్లిప్రభావతి

డైమండ్ రత్నబాబు తెలుగు సినిమా దర్శకుడు, రచయిత.[1] అనేక సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించిన రత్నబాబు 2019లో బుర్రకథ సినిమాతో దర్శకుడిగా మారాడు.[2] 2022లో మోహన్ బాబు ప్రధాన పాత్రలో సన్ ఆఫ్ ఇండియా సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు.[3]

జననం

[మార్చు]

రత్నబాబు 1982, సెప్టెంబరు 19న ఈశ్వరరావు - ప్రభావతి దంపతులకు ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జన్మించాడు. శ్రీ సోము పిల్లల పాఠశాల, జార్జ్ కరోనేషన్ హైస్కూల్ లో పాఠశాల విద్యను చదివాడు. నోబుల్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాడు.

చిన్నప్నటినుండి సాహిత్యంలో ప్రవేశం ఉన్న రత్నబాబు రాసిన కవిత్వాన్ని విన్నవాళ్ళు 'కుర్రాడు డైమండ్ లా ఉన్నాడు, చాలా బాగా రాశాడు' అని అన్నారు. ఆ మాట తనకు నచ్చి, డైమండ్ అనే పదాన్ని తన కలంపేరుగా పెట్టుకున్నాడు. అలా అందరూ డైమండ్ రత్నబాబు అని పిలుస్తున్నారు.

ఉద్యోగ జీవితం

[మార్చు]

విజయవాడలోని నవత ట్రాన్స్ పోర్టులో కొంతకాలం పనిచేశాడు. ఆ తరువాత హాస్యానందం మ్యాగజైన్ సబ్ ఎడిటర్ కూడా పనిచేశాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రత్నబాబుకు పరిమళ పుష్పా నాయుడుతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు (మోహిత్ కళ్యాణ్ నాయుడు, ధృవ కళ్యాణ్ నాయుడు).

సినిమారంగం

[మార్చు]

నటుడు అల్లు రామలింగయ్య గురించి రత్నబాబు రాసిన వ్యాసం ఒక పత్రికలో ప్రచురితమయింది. దానికి వచ్చిన 250 రూపాయల చెక్కు తీసుకోవడానికి హైదరాబాదుకి వెళ్ళాడు. ఇతని రచనల గురించి తెలుసుకున్న అల్లు అరవింద్, అల్లు అర్జున్ లు సినిమారంగంలో ప్రోత్సాహం అందించారు. సినిమా రచయిత చింతపల్లి రమణ దగ్గర కొన్ని సినిమాలకు పనిచేశాడు. సీమశాస్త్రి, పాండవులు పాండవులు తుమ్మెద, పిల్లా నువ్వు లేని జీవితం, సెల్ఫీ రాజా, ఇంట్లో దెయ్యం నాకేం భయం మొదలైన సినిమాలకు రచనా విభాగంలో పనిచేశాడు. 2015లో వచ్చిన షేర్ సినిమాతో పూర్తిస్థాయి రచయితగా సినిమారంగంలోకి ప్రవేశించాడు. ఆ తరువాత లక్కున్నోడు (2017), గాయత్రి (2018) మొదలైన సినిమాలకు రచయితగా పనిచేశాడు.[4] తెలుగు సినీ రచయితల సంఘం కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాడు.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా దర్శకుడు రచయిత
2015 షేర్ కాదు Yes
2016 ఈడోరకం ఆడోరకం కాదు Yes
2017 లక్కున్నోడు కాదు Yes
2018 గాయత్రి కాదు Yes
2019 బుర్రకథ Yes Yes
2022 సన్ ఆఫ్ ఇండియా Yes Yes
2023 అన్‌స్టాపబుల్ Yes Yes

మూలాలు

[మార్చు]
  1. "All you want to know about #DiamondRatnaBabu". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2022-04-14.
  2. "Diamond Ratna Babu Movies". MovieGQ (in ఇంగ్లీష్). Archived from the original on 2021-04-21. Retrieved 2022-09-16.
  3. hansindia (2019-06-25). "Diamond Ratna Babu". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-09-16. Retrieved 2022-09-16.
  4. "Diamond Ratna Babu - Movies, Biography, News, Age & Photos". BookMyShow (in Indian English). Retrieved 2022-04-14.

బయటి లింకులు

[మార్చు]