డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (ఇండియా )

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) The Directorate General of Civil Aviation (DGCA) భారతదేశం లోపల విమాన రవాణా సేవల నియంత్రణకు, పౌర వాయు నిబంధనలు, వాయు భద్రత, వాయు అర్హత ప్రమాణాలను అమలు చేసే భారత ప్రభుత్వ పౌర విమానయాన శాఖ ఆధ్వర్యం లో ఉన్న చట్టబద్ధమైన సంస్థ. పౌర విమానాల రిజిస్ట్రేషన్, భారతదేశంలో రిజిస్టర్ అయిన పౌర విమానాలకు వాయు అర్హత ప్రమాణాల రూపకల్పన, ఎయిర్ వర్థిటీ సర్టిఫికెట్ల మంజూరు, పైలట్లు, విమాన నిర్వహణ ఇంజనీర్లు, విమాన ఇంజనీర్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల ధృవీకరణ, ఏరోడ్రోమ్లు, సిఎన్ఎస్ / ఎటిఎం సౌకర్యాల భారతదేశం మీదుగా నడుస్తున్న విమాన రవాణా సేవల నియంత్రణ, ఆపరేటర్ల షెడ్యూల్, నాన్ షెడ్యూల్డ్ విమానాల క్లియరెన్స్, ప్రమాదాలు / సంఘటనలపై దర్యాప్తు నిర్వహించడం, అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ తో సహకరిస్తూ, అన్ని నియంత్రణ విధులను నిర్వహిస్తుంది[1].

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్
Directorate General of Civil Aviation
సంస్థ అవలోకనం
అధికార పరిధి భారత ప్రభుత్వం
ప్రధాన కార్యాలయం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కార్యాలయం, సఫ్దర్‌జంగ్ విమానాశ్రయం, న్యూ ఢిల్లీ
28°34′58.56″N 77°12′47.12″E / 28.5829333°N 77.2130889°E / 28.5829333; 77.2130889
మాతృ శాఖ Ministry of Civil Aviation (India)
Parent Agency పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (భారతదేశం)
వెబ్‌సైటు
https://dgca.gov.in/digigov-portal/

చరిత్ర[మార్చు]

భారత ప్రభుత్వం తంతి,తపాలా వారిచే 1979 సంవత్సరంలో విడుదల చేసిన స్టాంప్ - ఇండియన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 ఎయిర్‌లైనర్

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) పౌర విమానయాన రంగంలో నియంత్రణ సంస్థ, ప్రధానంగా భద్రతా సమస్యలతో వ్యవహరిస్తుంది. భారతదేశం లోపల,వెలుపల విమాన రవాణా సేవల నియంత్రణకు పౌర వాయు నిబంధనలు, వాయు భద్రత, వాయు అర్హత ప్రమాణాలను అమలు చేయడానికి బాధ్యత వహిస్తుంది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసిఎఓ) తో అన్ని నియంత్రణ చర్యలను డిజిసిఎ సమన్వయం చేస్తుంది. ఎయిర్ కార్పొరేషన్స్ చట్టం, 1953 ద్వారా ప్రభుత్వం తొమ్మిది విమానయాన సంస్థలను జాతీయం చేసింది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ విమానయాన సంస్థలు 1990 సంవత్సరముల మధ్య వరకు భారతీయ విమానయాన పరిశ్రమలో ఆధిపత్యం తో ఉన్నాయి. ఏప్రిల్ 1990 సంవత్సరంలో, ప్రభుత్వం ఓపెన్-స్కై విధానాన్ని అవలంబించింది, ఈ విధానం అమలుతో  ఎయిర్ టాక్సీ ఆపరేటర్లు ఏ విమానాశ్రయం నుండి అయినా చార్టర్, నాన్ చార్టర్ ప్రాతిపదికన విమానాలను నడపడానికి, వారి స్వంత విమాన షెడ్యూల్లు, సరుకు, ప్రయాణీకుల ఛార్జీలను నిర్ణయించడానికి అనుమతించింది. 1994 సంవత్సరంలో భారత ప్రభుత్వం తన ఓపెన్ స్కై పాలసీలో భాగంగా, విమాన రవాణా సేవలలో ఇండియన్ ఎయిర్ లైన్స్/ ఎయిర్ ఇండియా(IA,AI)  గుత్తాధిపత్యాన్ని ముగించింది. ప్రైవేటు ఆపరేటర్లు విమాన రవాణా సేవలను అందించడానికి అనుమతించారు. అయితే, ఏ విదేశీ విమానయాన సంస్థ కూడా దేశీయ విమానయాన సంస్థలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈక్విటీని కలిగి ఉండదు.1995 సంవత్సరంవరకు అనేక ప్రైవేట్ విమానయాన సంస్థలు విమానయాన వ్యాపారంలోకి ప్రవేశించాయి, దేశీయ విమాన రవాణా లో 10 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం భారతీయ విమానయాన పరిశ్రమ ప్రైవేట్ విమానయాన సంస్థల ఆధిపత్యంలో ఉంది, వీటిలో తక్కువ ఖర్చు క్యారియర్లు ఉన్నాయి, ఇవి విమాన ప్రయాణాన్ని తక్కువ ధరతో ప్రజలకు విమాన ప్రయాణం చేసే అవకాశం రావడం జరిగింది[2].

విధులు[మార్చు]

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) విమాన సర్వీసుల నియంత్రణతో పాటు ఈ భాద్యతలు నిర్వహిస్తుంది[2].

  • పౌర విమానాల రిజిస్ట్రేషన్.
  • భారతదేశంలో రిజిస్టర్ అయిన సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ ల ఎయిర్ వర్త్ నెస్ వాటి  ప్రమాణాలను రూపొందించడం, అటువంటి విమానాలకు ఎయిర్ వర్టిఫికేట్ లను మంజూరు చేయడం.
  • పైలట్లు, విమాన నిర్వహణ ఇంజనీర్లు, ఫ్లైట్ ఇంజనీర్లకు లైసెన్సింగ్ ఇవ్వడం, పరీక్షలు చేయడం,తనిఖీలు నిర్వహించడం.
  • ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల లైసెన్సింగ్.
  • ఏరోడ్రోమ్ లు, సి ఎన్ ఎస్ /ఏ టి ఎం (CNS/ATM) సౌకర్యాల  సర్టిఫికేషన్.
  • భారతీయ క్యారియర్లకు ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్లను మంజూరు చేయడం, భారతీయ, విదేశీ ఆపరేటర్లచే  లోపల / వేలుపుల  నడుస్తున్న విమాన రవాణా సేవల నియంత్రణ, అటువంటి ఆపరేటర్ల షెడ్యూల్, నాన్ షెడ్యూల్డ్ విమానాల క్లియరెన్స్ తో సహా.
  • ప్రమాదాలు/సంఘటనలపై దర్యాప్తు నిర్వహించడం, భద్రతా విమానయాన నిర్వహణ కార్యక్రమాల అమలుతో సహా ప్రమాద నివారణ చర్యలు తీసుకోవడం.
  • ఎయిర్ క్రాఫ్ట్ చట్టం, ఎయిర్ క్రాఫ్ట్ నిబంధనలు, పౌర విమానయాన ఆవశ్యకతలకు సవరణలు చేయడం, ఐసిఎఓ అనుబంధాలకు సవరణలు చేయడం, ఏదైనా ఇతర చట్టానికి సవరణ కోసం ప్రతిపాదనలను ప్రారంభించడం లేదా అంతర్జాతీయ కన్వెన్షన్ లేదా ప్రస్తుత కన్వెన్షన్ కు సవరణను అమలు చేయడానికి కొత్త చట్టాన్ని ఆమోదించడం.
  • పౌర, సైనిక ఎయిర్ ట్రాఫిక్ ఏజెన్సీల ద్వారా ఫ్లెక్సీ-ఉపయోగం కోసం జాతీయ స్థాయిలో సమన్వయం చేయడం, భారత గగనతలం ద్వారా పౌర ఉపయోగం కోసం మరిన్ని వాయు మార్గాలను అందించడానికి ఐసిఎఓతో పరస్పర చర్య.
  • పర్యావరణ అధికారులతో సహకరించడం.
  • ప్రమాదకరమైన వస్తువులను రవాణా చేయడానికి ఆపరేటర్ల శిక్షణా కార్యక్రమాలను ఆమోదించడం, ప్రమాదకరమైన వస్తువులను రవాణా చేయడానికి అనుమతి ఇవ్వడం మొదలైనవి.

ప్రాంతీయకార్యాలయాలు[మార్చు]

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రాంతీయ/ ఉప కార్యాలయాలు ఉన్నాయి. ముంబై,భోపాల్, ఢిల్లీ,లక్నో,కాన్పూర్,పాటియాలా,కోల్ కతా,పాట్నా,భువనేశ్వర్,చెన్నై,హైదరాబాద్,బెంగళూరు,కొచ్చి లలో ఉన్నాయి[3].

మూలాలు[మార్చు]

  1. "Directorate General of Civil Aviation (DGCA, India) Government Body Profile | CAPA". centreforaviation.com. Retrieved 2022-12-18.
  2. 2.0 2.1 "Organization Setup | Ministry of Civil Aviation". www.civilaviation.gov.in. Archived from the original on 2022-12-18. Retrieved 2022-12-18.
  3. "Home | Directorate General of Civil Aviation | Government of India". www.dgca.gov.in. Retrieved 2022-12-18.