తిరువణ్ణామలై జిల్లా
Tiruvannamalai
Central Arcot District | |||||||
---|---|---|---|---|---|---|---|
Coordinates: 12°25′N 79°7′E / 12.417°N 79.117°E | |||||||
Country | India | ||||||
State | Tamil Nadu | ||||||
జిల్లా | Tiruvannamalai | ||||||
City | Tiruvannamalai | ||||||
Municipalities | 1.Tiruvannamalai, 2.Arani, 3.Cheyyar, 4.Vandavasi | ||||||
Total Urban areas | 22 | ||||||
North Arcot | 26.1.1989 | ||||||
Named for | King Sambhuvarayar | ||||||
ముఖ్యపట్టణం | Tiruvannamalai | ||||||
Talukas | Tiruvannamalai, Kilpennathur, Arani, Cheyyar, Chengam, Polur, Vandavasi, Kalasapakkam, Chetpet, Thandarampattu, and Vembakkam | ||||||
Government | |||||||
• Body | District collectrate | ||||||
• Collector | Murugesh I.A.S | ||||||
విస్తీర్ణం | |||||||
• District of Tamil Nadu | 6,191 కి.మీ2 (2,390 చ. మై) | ||||||
• Rank | Second | ||||||
జనాభా (2011)[1] | |||||||
• District of Tamil Nadu | 24,64,875 | ||||||
• Rank | 4th rank in Tamil Nadu | ||||||
• జనసాంద్రత | 654/కి.మీ2 (1,690/చ. మై.) | ||||||
• Metro | 14,96,343 | ||||||
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) | ||||||
ISO 3166 code | [[ISO 3166-2:IN|]] | ||||||
Vehicle registration | TN-25, TN-97 | ||||||
Coastline | 0 కిలోమీటర్లు (0 మై.) | ||||||
Largest city | Tiruvannamalai | ||||||
Sex ratio | 1000:994 ♂/♀ | ||||||
Literacy | 79.33% | ||||||
Legislature Strength | 12 | ||||||
Lok Sabha constituency | Arani and Tiruvannamalai | ||||||
Vidhan Sabha constituency | Arani, Cheyyar, Chengam, Kalasapakkam, Peranamallur, Polur, Tiruvannamalai city, Tiruvannamalai rural, Thandarampattu, Pudupalayam, chettupattu and Vandavasi | ||||||
Precipitation | 5,646 మిల్లీమీటర్లు (222.3 అం.) |
తిరువణ్ణామలై జిల్లా (గతంలో సెంట్రల్ ఆర్కాట్, తిరువణ్ణామలై శంభువరాయర్ జిల్లా అని పిలిచేవారు) దక్షిణ భారతదేశం, తమిళనాడు రాష్ట్రం లోని జిల్లాలలో ఇది ఒకటి. ఈ జిల్లా రాష్ట్రంలోని పెద్ద జిల్లాలలో ఇది ఒకటి. ఇది తిరువణ్ణామలై సంబువరాయర్, వెల్లూరు అంబేద్కర్ జిల్లాలుగా ఉత్తర ఆర్కాట్‌ను విభజించుటద్వారా1989 సంవత్సరంలో ఈ జిల్లాఏర్పడింది. తిరువణ్ణామలై నగరం ఈ జిల్లా కేంద్రంగా ఉంది. తిరువణ్ణామలై జిల్లా వైశాల్యం 6,191 కిమీ 2 కలిగి ఉంది. జిల్లా మొత్తం పరిపాలనాపరంగా అరణి,చెంగం,తిరువణ్ణామలై,పోలూర్,తాండరంపట్టు, వందవాసి,కలసపాక్కం, చెట్‌పేట్, కిల్పెన్నతుర్, జమునామరథూర్, చెయ్యార్, వెంబక్కం అనే 12 తాలూకాలుగా విభజించబడింది. 2011 నాటికి జిల్లాలో ప్రతి 1,000 మంది పురుషులకు 994 స్త్రీల లింగనిష్పత్తితో నగరం 2,464,875 మంది జనాభాతో ఉంది.
చరిత్ర
[మార్చు]తిరువణ్ణామలై తమిళనాడులోని అత్యంత పూజ్యమైన ప్రదేశాలలో ఒకటి. పురాతన కాలంలో, "అణ్ణామలై" అనే పదానికి దుర్గమమైన పర్వతం అని అర్థం."తిరు" అనే పదం దాని గొప్పతనాన్ని సూచించడానికి ఉపసర్గ చేయబడింది.రెండు పదాలతో కలిపి తిరువణ్ణామలై అని పిలువబడింది. తిరు అంటే 'పవిత్రమైంది' లేదా 'పవిత్రమైనది' సంప్రదాయబద్ధంగా తమిళనాడులోని తిరునీర్మలై (రంగనాథుడు), తిరునాగేశ్వరం (విష్ణువు, శివుడు), తిరుమయం (విష్ణువు, శివుడు), తిరుమయిలై (విష్ణు, శివుడు), తిరుమయిలై వంటి పేర్ల ముందు ఉపయోగిస్తారు. లార్డ్ ఆదికేశవ పెరుమాళ్, లార్డ్ కపాలి ఈశ్వరన్), తిరువణ్ణామలై (శివుడు), తిరుచెందూర్ (లార్డ్ మురుగ), తిరుచిరాపల్లి (రాక్‌ఫోర్ట్ లార్డ్ తైయుమానవర్, లార్డ్ శ్రీరంగనాథర్), తిరుత్తణి (లార్డ్ మురుగ), తిరుచెంగోడ్ (లార్డ్ శివ), తిరుమన్చే శివుడు), తిరుమాన్ (లార్డ్ శివుడు ), (శివుడు), తిరునల్లార్ (లార్డ్ శని ఈశ్వరన్), తిరుపోరూర్ (లార్డ్ మురుగ), తిరుక్కడైయూర్ (శివుడు), తిరుకళుకుండ్రం (లార్డ్ వేదగిరీశ్వరర్ ఆలయం), తిరుకరుగవూర్ (లార్డ్ గర్భరక్షాంబిగై ఆలయం), తిరునెల్వేలి, తిరుప్పూర్, తిరువళ్లూరు ఇలా తిరు అనే పదం వచ్చేటట్లుగా వాడతారు.
ఆలయ పట్టణం తిరువణ్ణామలై భారతదేశంలోని అత్యంత ప్రాచీన వారసత్వ ప్రదేశాలలో ఒకటి. ఇది శైవానికి ముఖ్యకేంద్రం. అరుణాచల కొండ, దాని పరిసర ప్రాంతాలు శతాబ్దాలనుండి తమిళులు గొప్పగా గౌరవిస్తున్నారు.ఈ ఆలయం భావన, నిర్మాణ శైలిలో గొప్పది, సంప్రదాయం, చరిత్ర, పండుగలతో గొప్పది. ఈ పట్టణంలో జరిగే ప్రధాన దీపం పండుగ దక్షిణ భారతదేశంలోని అన్ని సుదూర ప్రాంతాల నుండి భక్తులను ఆకర్షిస్తుంది. ఇది తిరువణ్ణామలై, పోలూరు, అరణి, వందవాసి, దేవికాపురంతో పాటు తూర్పు భారతదేశం, ఫ్రెంచ్ కంపెనీలకు అనుసంధానించబడిన చారిత్రక ప్రదేశాలను కలిగి ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం చరిత్రలో ఆరణి, వందవాసి ముఖ్యమైన స్థానాలు కలిగి ఉన్నాయి. చోళుల కాలం చివరిలో జిల్లాను ఆరణి సమీపంలోని పెదవేడు ప్రధానకేంద్రంగా సంబువరాయర్ చోళన్ పరిపాలించాడు. మనం ఇప్పుడు అరణి పట్టణం లోని కైలాసనాథర్ అనే శివాలయంతో పాటు కోట, చరిత్రను కనుగొనవచ్చు.
స్వాతంత్ర్యానంతరం తిరువణ్ణామలై ఉత్తర ఆర్కాట్ జిల్లాలో ఉంది. ఉత్తర ఆర్కాట్ పౌర జిల్లా నుండి అక్టోబరు 1989 అక్టోబరులో వెల్లూర్ జిల్లా, తిరువణ్ణామలై జిల్లాలు విడగొట్టుట ద్వారా కొత్త జిల్లాలుగా ఏర్పడ్దాయి. పి.కోలప్పన్ తిరువణ్ణామలై జిల్లా మొదటి కలెక్టర్. మొత్తం మీద తిరువణ్ణామలై సంప్రదాయకంగా చారిత్రక, ఆధ్యాత్మిక విలువలతో సమృద్ధిగా ఉంది. పారిశ్రామిక వృద్ధిలో మాత్రం ఆశించనంత ముందంజలో లేదు.
భౌగోళికం
[మార్చు]జిల్లాకు తూర్పున కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలు, దక్షిణాన విల్లుపురం, కళ్లకురిచి జిల్లాలు, పశ్చిమాన కృష్ణగిరి, ధర్మపురి జిల్లాలు, ఉత్తరాన వెల్లూరు, రాణిపేట, తిరుపత్తూరు జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా గణాంకాలు
[మార్చు]చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1901 | 7,54,287 | — |
1911 | 8,75,117 | +16.0% |
1921 | 9,42,378 | +7.7% |
1931 | 10,70,320 | +13.6% |
1941 | 11,73,298 | +9.6% |
1951 | 12,23,154 | +4.2% |
1961 | 13,28,359 | +8.6% |
1971 | 15,24,349 | +14.8% |
1981 | 17,85,798 | +17.2% |
1991 | 20,42,979 | +14.4% |
2001 | 21,86,125 | +7.0% |
2011 | 24,64,875 | +12.8% |
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, తిరువణ్ణామలై జిల్లాలో 24,64,875 మంది జనాభా ఉన్నారు. లింగ నిష్పత్తి ప్రతి 1,000 మంది పురుషులకు 994 స్త్రీలు ఉన్నారు. ఇది జాతీయ సగటు లింగ నిష్పత్తి 929 కంటే చాలాఎక్కువ ఉంది.[2] మొత్తం జనాభాలో 2,72,569 మంది ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వారు ఉన్నారు. వీరిలో 1,41,205 మంది పురుషులు కాగా,1,31,364 మంది స్త్రీలు ఉన్నారు.జనాభాలో షెడ్యూల్డ్ కులాలు జనాభా 22.94% మంది ఉండగా, షెడ్యూల్డ్ తెగలు జనాభా 3.69% మంది ఉన్నారు. జిల్లా సగటు అక్షరాస్యత 66.% ఉంది. దీనిని జాతీయ సగటు 72.99%తో పోలిస్తే చాలా తక్కువ ఉంది [2] జిల్లాలో మొత్తం 5,88,836 గృహాలు ఉన్నాయి. మొత్తం 12,38,177 మంది కార్మికులు ఉన్నారు. ఇందులో 2,65,183 మంది సాగుదారులు, 3,51,310 ప్రధాన వ్యవసాయ కార్మికులు, 37,020 మంది ఇంటివద్ద నిర్వహించే పరిశ్రమలపై ఆధారపడినవారు,3,16,559 ఇతర కార్మికులు, 2,68,105 మంది ఉపాంత కార్మికులు, 27,458 ఉపాంత సాగుదారులు, 1,73,753 ఉపాంత వ్యవసాయ కార్మికులు, 9,700 స్వదేశీ పనివారు కార్మికులు ఉన్నారు.[3] 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభాలో 94.31% తమిళం,2.66% ఉర్దూ, 2.36% తెలుగు భాషను వాడతారు.[4]
జిల్లాలో లక్ష, అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం లక్ష, అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల జాబితా దిగువ వివరింపబడినది:[6]
నగరం | జనాభా | నగరం | జనాభా | ||
---|---|---|---|---|---|
1 | తిరువణ్ణామలై | 3,80,543 | 9 | గాంధీనగర్-లక్ష్మీపురం | 45,571 |
2 | అరణి | 1,43,783 | 10 | కలంబూర్ | 31,751 |
3 | వందవాసి | 1,16,452 | 11 | వెట్టవలం | 28,059 |
4 | పోలూరు | 1,01,420 | 12 | పుదుపాళయం | 25,374 |
5 | తిరువేతిపురం | 87,901 | 13 | త్యాగి అన్నామలై నగర్ | 24,329 |
6 | చెంగం | 74,901 | 14 | పెరనమల్లూరు | 22,619 |
7 | చెట్టుపట్టు | 59,580 | 15 | ఆడమంగళం-పూడూర్ | 21,750 |
8 | కలసపాక్కం | 46,910 | 16 | కిజ్-పెన్నతుర్ | 21,308 |
రాజకీయాలు, నియోజక వర్గాలు
[మార్చు]జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాలలో 2021 ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు వివరాలు
జిల్లా | నం. | నియోజకవర్గం | పేరు | పార్టీ | కూటమి | వ్యాఖ్యలు | ||
---|---|---|---|---|---|---|---|---|
తిరువణ్ణామలై జిల్లా | 62 | చెంగం (ఎస్.సి) | ఎంపీ గిరి | ద్రవిడ మున్నేట్ర కజగం | యు.పి.ఎ | |||
63 | తిరువణ్ణామలై | ఈవీ వేలు | ద్రవిడ మున్నేట్ర కజగం | యు.పి.ఎ | ||||
64 | కిల్పెన్నత్తూరు | కె. పిచ్చండి | ద్రవిడ మున్నేట్ర కజగం | యు.పి.ఎ | డిప్యూటీ స్పీకర్ | |||
65 | కలసపాక్కం | పి.ఎస్.టి శరవణన్ | ద్రవిడ మున్నేట్ర కజగం | యు.పి.ఎ | ||||
66 | పోలూర్ | ఎస్ఎస్ కృష్ణమూర్తి | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | ఎన్.డి.ఎ | ||||
67 | అరణి | సెవ్వూరు ఎస్. రామచంద్రన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | ఎన్.డి.ఎ | ||||
68 | చెయ్యార్ | ఓ. జోతి | ద్రవిడ మున్నేట్ర కజగం | యు.పి.ఎ | ||||
69 | వందవాసి (ఎస్.సి) | ఎస్. అంబేత్ కుమార్ | ద్రవిడ మున్నేట్ర కజగం | యు.పి.ఎ |
పరిపాలన
[మార్చు]తిరువణ్ణామలై జిల్లా 6,31,205 హెక్టార్ల విస్తీర్ణంలో అరణి, తిరువణ్ణామలై, చెయ్యార్ అనే 3 ఉప జిల్లాలు, పన్నెండు తాలూకాలు, 27 బ్లాక్‌లు, 1,061 గ్రామాలు ఉన్నాయి. తిరువణ్ణామలై లోని పన్నెండు తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి:
తాలూకా | ప్రధాన కార్యాలయం | ప్రాంతం | రెవెన్యూ
గ్రామాలు |
జనాభా 2011 |
జన సాంద్రత | |
---|---|---|---|---|---|---|
1 | తిరువణ్ణామలై-అర్బన్ | తిరువణ్ణామలై | 102 కిమీ 2 | 135 | 4,09,826 | 3,382 /కిమీ 2 |
2 | తిరువణ్ణామలై-రూరల్ | కుల్ పెన్నాథూర్ | 102 కిమీ 2 | 77 | 1,69,759 | 3,382 /కిమీ 2 |
3 | తాండరాంపట్టు | తాండరాంపట్టు | 691 కిమీ 2 | 63 | 1,79,559 | 593 /కిమీ 2 |
4 | చెంగం | చెంగం | 510 కిమీ 2 | 121 | 2,80,581 | 639 /కిమీ 2 |
5 | అరణి | అరణి | 327 కిమీ 2 | 55 | 2,94,976 | 673 /కిమీ 2 |
6 | పోలూరు | పోలూరు | 509 కిమీ 2 | 111 | 2,51,685 | 645 /కిమీ 2 |
7 | కలసపాక్కం | కలసపాక్కం | 532 కిమీ 2 | 52 | 1,40,301 | 618 /కిమీ 2 |
8 | జవ్వధుమలై | జమునమరత్తూరు | 645 కిమీ 2 | 42 | 47,271 | 291 /కిమీ 2 |
9 | చెయ్యార్ | తిరువేతిపురం | 344 కిమీ 2 | 131 | 2,18,188 | 618 /కిమీ 2 |
10 | వందవాసి | వందవాసి | 645 కిమీ 2 | 161 | 2,75,079 | 652 /కిమీ 2 |
11 | చెట్టుపట్టు | చెట్టుపట్టు | 493 కిమీ 2 | 76 | 1,46,806 | 588 /కిమీ 2 |
12 | వెంబక్కం | వెంబక్కం | 310 కిమీ 2 | 91 | 1,24,188 | 581 /కిమీ 2 |
తాలూకాలు
[మార్చు]జిల్లా తిరువణ్ణామలై, తిరువణ్ణామలై గ్రామీణ అరణి, చెయ్యార్, చెంగం, పోలూర్, వందవాసి, కలసపాక్కం, చెట్‌పేట్, తాండరంపట్టు, వెంబక్కం అనే తాలూకాలతో కూడి ఉంది. తిరువణ్ణామలై జిల్లా వ్యవసాయం, పట్టు చీర నేయడం అనే రెండు ప్రధాన వ్యాపారాలకు ప్రసిద్ధి చెందింది. వరి సాగు, బియ్యం తయారీ ఈ జిల్లాలో అతిపెద్ద వ్యాపారాలలో ఒకటి. జిల్లాలో 1965 సరస్సులు, 18 రిజర్వాయర్లు, చిన్న ఆనకట్టల ద్వారా 1,12,013 హెక్టార్ల వరి సాగుకు సాగునీరు అందుతుంది. జిల్లాలో 18 నియంత్రిత మార్కెట్‌లు ఉన్నాయి. వీటి ద్వారా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వానికి విక్రయిస్తారు. ఈ నియంత్రిత మార్కెట్ల ద్వారా 2007లో 2,71,411 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం విక్రయింపబడింది. జిల్లా అంతటా ధాన్యం, నేరుగా బియ్యంగా చేయడానికి తగిన రైస్ మిల్లులు ఉన్నాయి. చెయ్యార్ సమీపంలోని ఆధునిక రైస్ మిల్లు ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న అతిపెద్ద మిల్లుగా పేరొందింది. అరణిలో దాదాపు 278 రైస్ మిల్లులు ఉన్నాయి. కలంబూర్‌లో దాదాపు 20 రైస్ మిల్లులు ఉన్నాయి. కలంబూర్ పొన్నీ రైస్ అని పిలువబడే వివిధ రకాల బియ్యానికి ప్రసిద్ధి. కలంబూర్ పొన్నీ బియ్యం రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. చెన్నై, కోయంబత్తూర్, వెల్లూరు వంటి ప్రాంతాలకు ఈ బియ్యం ఎక్కువుగా రవాణా అవుతాయి.
పట్టు చీరెలు నేయడం
[మార్చు]జిల్లాలో పట్టు చీరల తయారీలో నైపుణ్యం కలిగిన నేత కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు. చేనేత మగ్గాలు తరచుగా నేయడానికి నిమగ్నమై ఉన్నాయి.అయితే ఇటీవల కొందరు మర మగ్గాలు ఉపయోగించే యాంత్రిక పద్ధతులకు మొగ్గు చూపారు.అరణి తాలూకా, పట్టు నేయడంలో అధిక శాతం దోహదం చేస్తుంది. జిల్లాలో ఆదాయాన్ని ఆర్జించే ముఖ్యమైన పట్టణం ఆరణి. ఈ పట్టణం రాష్ట్రంలో ప్రసిద్ధి చెందనప్పటికీ, భారతదేశంలోని పట్టు వస్త్రాలలోఎక్కువ భాగం అరణి ప్రజలచే ఉత్పత్తి చేయబడుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ "2011 Census of India" (Excel). Indian government. 16 April 2011.
- ↑ 2.0 2.1 "Census Info 2011 Final population totals". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 2014-01-26.
- ↑ "District Census Handbook 2011 - Tiruvannamalai" (PDF). Census of India. Registrar General and Census Commissioner of India.
- ↑ "Table C-16 Population by Mother Tongue: Tamil Nadu". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India.
- ↑ "Table C-01 Population By Religion - Tamil Nadu". census.gov.in. Registrar General and Census Commissioner of India.
- ↑ Census of India 2011: Provisional Population Totals.