Coordinates: 24°19′41″N 93°59′10″E / 24.328°N 93.986°E / 24.328; 93.986

తెంగ్‌నౌపల్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెంగ్‌నౌపల్ జిల్లా
మణిపూర్ రాష్ట్ర జిల్లా
భారతదేశంలోని మణిపూర్ లో ప్రాంతం ఉనికి
భారతదేశంలోని మణిపూర్ లో ప్రాంతం ఉనికి
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
ముఖ్య పట్టణంతెంగ్‌నౌపల్
Area
 • మొత్తం3,375 km2 (1,303 sq mi)
భాషలు
 • అధికారికమీటిలాన్ (మణిపురి)
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Vehicle registrationఎంఎన్

తెంగ్‌నౌపల్ జిల్లా, భారతదేశంలోని మణిపూర్‌ రాష్ట్ర కొత్త జిల్లా. ఇది చందేల్ జిల్లా నుండి విభజించబడింది.[1][2][3] ఇది రాజధాని నగరం ఇంఫాల్ నుండి 69 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇండో-మయన్మార్ రోడ్డులో ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ జిల్లాలో లోయలు ఉన్నాయి. ఇది ప్రశాంతమైన, అందమైన పర్యాటక కేంద్రం. ఈ ప్రదేశం గుండా వెళుతున్నప్పుడు, మేఘాలు వెలుపలికి రావడాన్ని గమనించవచ్చు.[4]

భౌగోళికం[మార్చు]

తెంగ్‌నౌపల్ పట్టణం జిల్లా ప్రధాన కేంద్రంగా ఉంది. ఇది 24°19′41″N 93°59′10″E / 24.328°N 93.986°E / 24.328; 93.986 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[5][6] దీని విస్తీర్ణం 3,375 కి.మీ2 (1,303 చ.మై) గా ఉంది. ఇది సముద్రమట్టానికి 2,500 నుండి 10,000 అడుగుల ఎత్తులో ఉంది.[4]

చరిత్ర[మార్చు]

ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పఖాంఘా వంశీయులు పాలించారు. 1631లో చైనీయులు దీనిని స్వాధీనం చేసుకున్నారు. 1942లో రెండవ ప్రపంచ యుద్ధంలో జపనీయులు దీనిపై బాంబు దాడి చేశారు. ఈ జిల్లాలో మణిపూర్, బరాక్ అనే రెండు నదులు ఉన్నాయి. ఇవి ఉత్తరం నుండి దక్షిణానికి ప్రవహిస్తున్నాయి. చేపలతో నిండిన వివిధ సరస్సులు కూడా ఉన్నాయి. ఈ జిల్లాకు సమీపంలో ఉన్న మోరే, బర్మాతో సరిహద్దును పంచుకుంటుంది. ఇది ఈశాన్య భారత ముఖ్యమైన వాణిజ్య కేంద్రం.[4]

ఉప విభాగాలు[మార్చు]

తెంగ్‌నౌపల్ జిల్లాలో 3 ఉప విభాగాలు ఉన్నాయి.[7]

  • తెంగ్‌నౌపల్
  • మోరే
  • మాచి

మూలాలు[మార్చు]

  1. "7 new districts formed in Manipur amid opposition by Nagas". indiatoday.intoday.in. Retrieved 10 January 2021.
  2. "Manipur Creates 7 New Districts". NDTV.com. Retrieved 10 January 2021.
  3. Laithangbam, Iboyaima. "New districts to stay, says Manipur CM". The Hindu. Retrieved 10 January 2021.
  4. 4.0 4.1 4.2 "Tengnoupal Tourist Attractions, Tengnoupal Hill Station Manipur". www.incredible-northeastindia.com. Retrieved 10 January 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Manipur Chief Minsiter [sic] inaugurates two new districts amid Naga protests - Times of India". The Times of India. Retrieved 10 January 2021.
  6. "Simply put: Seven new districts that set Manipur ablaze". The Indian Express. 20 December 2016. Retrieved 10 January 2021.
  7. "Creation of new districts could be game-changer in Manipur polls". www.hindustantimes.com/. 20 December 2016. Retrieved 10 January 2021.

వెలుపలి లంకెలు[మార్చు]