తెలంగాణ డిజిటల్ మీడియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ డిజిటల్ మీడియా
తెలంగాణ ప్రభుత్వ లోగో
ప్రభుత్వ సంస్థ అవలోకనం
స్థాపనం 2 జూన్ 2014; 9 సంవత్సరాల క్రితం (2014-06-02)
అధికార పరిధి తెలంగాణ
ప్రధాన కార్యాలయం తెలంగాణ సచివాలయం, హైదరాబాదు
Minister responsible కేటీఆర్, (సమాచార సాంకేతిక శాఖ మంత్రి)
ప్రభుత్వ సంస్థ కార్యనిర్వాహకుడు/లు జయేశ్ రంజన్, (ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి)
దిలీప్ కొణతం, (డైరెక్టర్)
మాతృ శాఖ సమాచార సాంకేతిక శాఖ
వెబ్‌సైటు
అధికారిక వెబ్సైటు

తెలంగాణ డిజిటల్ మీడియా (ఆంగ్లం: Telangana Digital Media) అనేది తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతిక శాఖకు చెందిన ఒక విభాగం. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని పౌరులకు అందించడంకోసం ఈ విభాగం ఏర్పాటుచేయబడింది. ప్రముఖ రచయిత, సాంకేతిక నిపుణుడైన దిలీప్ కొణతం, ఈ డిజిటల్ మీడియాకు డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.[1][2]

చరిత్ర[మార్చు]

నేటికాలంలో డిజిటల్ మాధ్యమం చాలా వేగంగా దూసుకెలుతోంది. ప్రభుత్వ కార్యకలాపాలు, ఇతర వివరాలు ప్రజలకు చేరవేయడానికి డిజిటల్ మాధ్యమాలు ఉపయోగపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత డిజిటల్ మాధ్యమాల ప్రాముఖ్యతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, 2014 జూన్ నెలలో తెలంగాణ డిజిటల్ మీడియా విభాగాన్ని ఏర్పాటచేసింది. ఐటీ శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో ఈ విభాగం కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

విధులు[మార్చు]

  • తెలంగాణ ప్రభుత్వంలోని అన్ని శాఖల అనుసంధానం
  • ప్రభుత్వ పరిధిలోని తెలంగాణ సీఎంవో, ఐటి-పరిశ్రమలు-పురపాలక శాఖల మంత్రి అధికారిక ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఖాతాల నిర్వహణ
  • నకిలీ (ఫేక్), మోసపూరిత (ఫ్రాడ్) ఖాతాలను తొలగించడానికి చేపట్టిన ఖాతాల ధృవీకరణ, బ్యాడ్జింగ్
  • సోషల్ మీడియారంగంలోని వివిధ సంస్థల, నిపుణుల సహకారంతో డిజిటల్ మాధ్యమాల వాడుకపై శిక్షణలు/సెషన్‌ల నిర్వహణ

కార్యకలాపాలు[మార్చు]

  • సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నకిలీ వార్తలు, తప్పుడు సమాచార ప్రచారాలపై అవగాహన కలిగించడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో అవగాహన సదస్సులను నిర్వహణతోపాటు ఫ్యాక్ట్ చెక్ పేరిట ఒక పోర్టల్ ను కూడా రూపొందించింది.
  • 2017 ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని 2017 డిసెంబరు 17న ఏర్పాటుచేసిన ’డిజిటల్‌ తెలుగు - డిజిటల్ మాధ్యమాలలో తెలుగు వాడుక, అభివృద్ధి’ చర్చాగోష్ఠిలో డిజిటల్‌ మాధ్యమాలలో తెలుగు భాషను వెలిగించేందుకు గత రెండు దశాబ్దాలుగా కృషిచేస్తున్న 60 సాంకేతిక నిపుణులు, భాషావేత్తలు, సృజనకారులు పాల్గొన్నారు.[3]
  • కరోనా 2019 సమయంలో ఆ మహమ్మారికి సంబంధించిన తాజా అప్‌డేట్‌లను పోస్ట్ చేయడానికి డిజిటల్ మీడియా వింగ్ ప్రత్యేక వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేసింది. వాట్సాప్ చాట్‌బాట్‌లను కూడా ఏర్పాటుచేసింది.
  • తెలుగు వికీపీడియా అభివృద్ధికోసం తెవికీ సముదాయంతో కలిసి హైదరాబాదు బుక్ ఫెయిర్ ప్రాగణంలో తెలుగు వికీపీడియా స్టాల్ ను నిర్వహించింది.[4]
  • తెలంగాణ డిజిటల్ రిపాజిటరీ
  • రాష్ట్రంలోని చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సాహిత్య, పురావస్తు వారసత్వ సంపద, ఖజానా, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కట్టడాలు, వింతలు, విశేషాలకు సంబంధించిన సమాచారాన్ని డిజిటల్ రూపంలో జాగ్రత్తగా భద్రపరిచి భావి తరాలకు ఉచితంగా అందించేందుకు డిజిటల్ మీడియా విభాగం తెలంగాణ డిజిటల్ రిపాజిటరీ పేరుతో ఒక ప్రాజెక్టును ప్రారంభించనుంది.[5]

అవార్డులు[మార్చు]

  • కోవిడ్‌–19 సమయంలో కమ్యూనికేషన్‌ ప్రచారానికి చేసిన కృషికి గుర్తింపుగా 2020 ఫిబ్రవరి 23న డిజిటల్‌ మీడియాకు ‘పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌ఎస్‌ఐ)–2020’ అవార్డు వచ్చింది.[6]
  • డిజిట‌ల్ మీడియా శాఖ ప‌నితీరును గుర్తిస్తూ 2021 సెప్టెంబర్ 17న గోవాలో జ‌రిగిన 15వ పీఆర్‌సీఐ గ్లోబ‌ల్ క‌మ్యూనికేష‌న్స్ స‌ద‌స్సులో అందించిన ‘పీఆర్‌సీఐ చాణ‌క్య’ అవార్డును రెండోసారి కొణ‌తం దిలీప్‌ అందుకున్నాడు.[7][8][9]
  • న్యూఢిల్లీలో 2023 సెప్టెంబరు 21, 22న జరిగిన 17వ గ్లోబల్ కమ్యూనికేషన్ కాంక్లేవ్​లో మాజీ కేంద్రమంత్రి శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చేతుల మీదుగా దిలీప్ కొణతం, ‘సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నాడు. సోషల్‌ మీడియా ఉత్తమ వినియోగంతోపాటు ఉత్తమ వార్షిక నివేదిక క్యాటగిరీలో తెలంగాణ ఐటీ శాఖ వార్షిక నివేదిక 2022-23కు, ప్రజా సేవలకు సంబంధించిన ప్రకటనల విభాగంలో ‘మన ట్యాంక్‌బండ్‌ని శుభ్రంగా, అందంగా ఉంచుకుందాం’ వీడియోకు, బెస్ట్‌ గవర్నమెంట్‌ కమ్యూనికేషన్‌ ఫిల్మ్స్‌ క్యాటగిరీలో ‘కాళేశ్వరం’ (తెలంగాణ జల విప్లవం) వీడియోకు పీఆర్‌సీఐ అవార్డులు లభించాయి.[10][11]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. TelanganaToday (21 June 2017). "Public Libraries in Telangana to go digital". Archived from the original on 22 September 2018. Retrieved 22 September 2018.
  2. కొణతం, దిలీప్ (2019-11-02). "రేపటి తరానికి డిజిటల్‌ తెలుగు". తెలంగాణ. Archived from the original on 2022-08-04. Retrieved 2022-09-22.
  3. "Jayesh Ranjan Opens Telugu Wikipedia Stall at Hyderabad Book Fair". Sakshi Post (in ఇంగ్లీష్). 2021-12-19. Archived from the original on 2021-12-26. Retrieved 2022-09-22.
  4. "డిజిటల్‌లోనే సమస్తం". EENADU. 2022-12-29. Archived from the original on 2022-12-29. Retrieved 2023-01-07.
  5. Sakshi Education (20 March 2021). "ఫిబ్రవరి 2021 అవార్డ్స్". www.education.sakshi.com. Archived from the original on 2021-09-22. Retrieved 2022-09-22.
  6. Namasthe Telangana (18 September 2021). "రెండోసారి చాణ‌క్య అవార్డు గెలుచుకున్న కొణ‌తం దిలీప్‌". www.ntnews.com. Archived from the original on 2021-09-22. Retrieved 2022-09-22.
  7. The New Indian Express (19 September 2021). "Telangana government's digital media chief bags Chanakya Award for the second time". www.newindianexpress.com. Archived from the original on 2021-09-22. Retrieved 2022-09-22.
  8. Andrajyothy (2021-09-22). "డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌కు చాణక్య అవార్డు". www.andhrajyothy.com. Archived from the original on 2021-09-22. Retrieved 2022-09-22.
  9. Bureau, The Hindu (2023-09-23). "Digital Media team of Telangana wins big at PRSI national awards". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2023-09-23. Retrieved 2023-09-23.
  10. "Public Relations Council of India Excellence Awards 2023 : తెలంగాణ డిజిటల్ మీడియా విభాగానికి 5 ప్రతిష్ఠాత్మక అవార్డులు". ETV Bharat News. 2023-09-22. Archived from the original on 2023-09-23. Retrieved 2023-09-23.

బయటి లంకెలు[మార్చు]